అఫ్ఘానిస్తాన్ కోచ్గా భారత మాజీ ఆటగాడు
కాబూల్:అఫ్ఘానిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్గా భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్ రాజ్పుత్ ఎంపికయ్యాడు.ఇటీవల భారత క్రికెట్ చీఫ్ కోచ్ పదవికి పోటీ పడిన రాజ్పుత్ను అఫ్ఘానిస్తాన్ కోచ్ గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమాముల్ హక్ ఆ దేశ క్రికెట్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్ఘాన్ క్రికెట్కు కోచ్ నియామకం అనివార్యమైంది. దీనిలోభాగంగా భారత్ లో కోచ్ గా పని చేసిన అనుభవం ఉన్నకారణంగానే రాజ్పుత్ను ప్రధాన కోచ్ గా నియమించినట్లు అప్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అఫ్ఘాన్ కోచ్ పదవి కోసం రాజ్ పుత్ తో పాటు పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు మొహ్మద్ యూసఫ్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హెర్ష్లీ గిబ్స్లు పోటీ పడ్డారు.
'రాజ్పుత్ అనుభవం మేర అతనికి అప్ఘాన్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవిని అప్పజెప్పాం. సాంకేతికంగా, ఆటగాడిగా రాజ్పుత్ బలమైన కోచ్. అతని నియామకంతో అప్ఘాన్ క్రికెట్కు మంచి రోజులు వస్తాయి. స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్ పర్యటన నాటికి రాజ్పుత్ జట్టుతో కలుస్తాడు. ఈ పదవికి భారత మాజీ ఆటగాడు మొహ్మద్ కైఫ్ కూడా దరఖాస్తు చేశాడు. అప్ఘాన్ కోచ్ పదవికి కోసం చాలా అప్లికేషన్లు వచ్చినా రాజ్పుత్, కైఫ్ల పేర్లను షార్టు లిస్టు చేశాం. అయితే ఫైనల్ రౌండ్ ఇంటర్య్వూలో రాజ్పుత్ ను కోచ్ గా నియమిస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది' అని క్రికెట్ బోర్డు చైర్మన్ దనీష్ నసిముల్లా తెలిపారు. గతంలో భారత అండర్ -19 క్రికెట్ జట్టుకు, 2008లో ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్కు రాజ్ పుత్ కోచ్గా పని చేశాడు.