యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) హెడ్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్ రాజ్‌పుత్ నియమితుడయ్యాడు. ఈ పదవిలో రాజ్‌పుత్ మూడేళ్ల పాటు కొనసాగుతాడని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
రాజ్‌పుత్ నియామకానికి ముందు యూఏఈ తాత్కాలిక కోచ్‌గా పాక్ మాజీ ఆటగాడు ముదస్సర్ నాజర్ వ్యవహరించారు. భారత మాజీ ఆల్‌రౌండర్ రాబిన్ సింగ్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం నాజర్ కొన్ని రోజుల పాటు తాత్కాలిక కోచ్‌గా పని చేశాడు.
62 ఏళ్ల రాజ్‌పుత్‌కు గతంలో అంతర్జాతీయ స్థాయిలో కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. టీమిండియా 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచినప్పుడు ఇతనే భారత జట్టు కోచ్‌గా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు టెస్ట్ హోదా లభించడంలో రాజ్‌పుత్ కోచ్‌గా క్రీయాశీలకపాత్ర పోషించాడు. 2018-2022 వరకు అతను జింబాబ్వే హెడ్‌కోచ్‌గా పని చేశాడు.
యూఏఈ కోచ్‌గా నియమితుడైన అనంతరం రాజ్‌పుత్ ఇలా అన్నాడు. ఇటీవలికాలంలో యూఏఈ బలమైన అసోసియేట్ దేశంగా ఎదిగింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో యూఏఈ ఆటగాళ్లు టెస్ట్ హోదా కలిగిన దేశాల ఆటగాళ్లతో పోటీపడుతున్నారు. ప్రస్తుత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. వారితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కాగా, లాల్‌చంద్ రాజ్‌పుత్ 1985-87 మధ్యలో భారత తరఫున 2 టెస్ట్‌లు, 4 వన్డేలు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment