Shakib Al Hasan To Miss Bangladesh Tour Of Zimbabwe, West Indies ODIs - Sakshi
Sakshi News home page

BAN vs WI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌.. బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ దూరం..!

Published Thu, Jul 7 2022 8:09 PM | Last Updated on Thu, Jul 28 2022 3:31 PM

Shakib Al Hasan To Miss Bangladesh Tour Of Zimbabwe, West Indies ODIs - Sakshi

బంగ్లాదేశ్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ షకీబ్ అల్ హసన్ వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌తో పాటు  జింబాబ్వే పర్యటనకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు గురువారం ధృవీకరించింది. కాగా ప్రస్తుతం జరుగుతోన్న టీ20 సిరీస్‌ అనంతరం బంగ్లాదేశ్ విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. అయితే బంగ్లాదేశ్‌-వెస్టిండీస్‌ ద్వైపాక్షిక సిరీస్ వన్డే సూపర్‌ లీగ్‌ నుంచి మినహాయించబడింది.

ఈ సిరీస్‌ వన్డే సూపర్ లీగ్‌లో భాగం కాకపోవడంతో షకీబ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. "జింబాబ్వే టూర్‌, విండీస్‌తో వన్డే సిరీస్‌లకు  షకీబ్ అందుబాటులో ఉండడు. ఈ విషయం మాకు ముందే అతడు తెలియజేశాడు. ఈ సిరీస్‌లకు జట్టు ఎంపిక గురించి సెలక్షన్‌ ప్యానెల్‌తో చర్చించాం. అయితే ఇతర సీనియర్ ఆటగాళ్లు చాలా మంది అందుబాటులో ఉండనున్నారు" అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్ పేర్కొన్నారు.
చదవండిWasim Jaffers India Playing XI: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. ఉమ్రాన్‌ మాలిక్‌కు నో ఛాన్స్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement