ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి విషయంలో బీసీసీఐ కొత్త ఎత్తుగడ వేసింది. కోహ్లిని తిరిగి ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు ఓ చిన్న జట్టుతో వన్డే సిరీస్ ఆడించాలని భారత సెలెక్షన్ కమిటీ భావిస్తుంది. ఇందులో భాగంగా ఆసియా కప్‌కు ముందు జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం కోహ్లిని ఎంపిక చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా సెంచరీ లేక అవస్థలు పడుతున్న కోహ్లి జింబాబ్వేతో సిరీస్‌లోనైనా పూర్వపు ఫామ్‌ను దొరకబుచ్చుకుంటాడని బీసీసీఐ ఈ ప్లాన్ వేసింది. దీన్ని అమలు చేసేందుకు భారత క్రికెట్ బోర్డు కోహ్లి సమ్మతాన్ని సైతం లెక్కచేయకపోవచ్చని సమాచారం.
కాగా, ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలోనైనా కోహ్లి ఫామ్‌లోకి వస్తాడని అంతా ఆశించారు. అయితే కోహ్లి అందరి ఆశలను అడియాశలు చేస్తూ.. పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. రీ షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్, రెండు టీ20లు, రెండు వన్డేల్లో కలిపి కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరాల్సి ఉండగా.. కోహ్లి రెస్ట్ పేరుతో ఈ పర్యటనకు డమ్మా కొట్టి పారిస్ టూర్‌కు వెళ్లనున్నాడు. విండీస్‌తో సిరీస్ అనంతరం ఆగస్టు 18 నుంచి 22 వరకు టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది. అతర్వాత ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కావాల్సి ఉంది.
చదవండి: Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు!
Comments
Please login to add a commentAdd a comment