
జింబాబ్వే పర్యటనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్లను శుక్రవారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా జింబాబ్వేతో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20ల మ్యాచ్‌లు ఆడనుంది. అయితే టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లును సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా టీ20 సిరీస్‌కు బంగ్లా రెగ్యులర్ కెప్టెన్ మహ్మదుల్లాకు సెలక్టర్లు విశ్రాంతి విశ్రాంతి ఇచ్చారు.
అతడి స్థానంలో కెప్టెన్‌గా ఆ జట్టు వికెట్ కీపర్ నూరుల్ హసన్ ఎంపికయ్యాడు. అదే విధంగా జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. జూలై 30 న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో బంగ్లా పర్యటన ప్రారంభం కానుంది. ఇక ఇటీవల విండీస్‌తో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌లో ఓటమి చెందిన బంగ్లాదేశ్.. వన్డే సిరీస్‌ను మాత్రం క్లీన్‌స్వీప్ చేసింది.
బంగ్లాదేశ్ టీ20 జట్టు: నూరుల్ హసన్ (కెప్టెన్), మునిమ్ షహరియార్, అనాముల్ హక్, లిటన్ దాస్, అఫీఫ్ హుస్సేన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, మొసద్దెక్ హుస్సేన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో,మెహిదీ హసన్ మిరాజ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్
బంగ్లాదేశ్ వన్డే జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిటన్ దాస్, అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్), మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, హజ్సన్ మహ్మద్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మొసద్దెక్ హొస్సేన్, తైజుల్ ఇస్లాం
చదవండి: IRE vs NZ 3rd T20: తిరుగులేని న్యూజిలాండ్.. సిరీస్ క్లీన్‌స్వీప్
Comments
Please login to add a commentAdd a comment