
Keerthi Azad Slams BCCI Selectors About Kohli Captaincy Removal.. ఇండియన్ క్రికెట్ చరిత్రలో కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదం అత్యంత వివాదాస్పదంగా మారింది. కోహ్లిని తొలగించి రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడంపై చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇక కోహ్లి కూడా సౌతాఫ్రికా టూర్‌కు ఒక్కరోజు ముందు మీడియా ముందుకు వచ్చి బీసీసీఐపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. గంగూలీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బహిరంగంగా పేర్కొన్నాడు. దీంతో కెప్టెన్సీ వివాదం కాస్తా.. కోహ్లి వర్సెస్ బీసీసీఐగా మారిపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కీర్తీ ఆజాద్ కోహ్లికి మద్దతిస్తూ బీసీసీఐ సెలక్టర్లను ఏకీపారేశాడు.
చదవండి: Ind Vs Sa Test Series: కెప్టెన్‌గా కోహ్లికిదే చివరి అవకాశం.. కాబట్టి
''కోహ్లి విషయంలో సెలక్టర్లు వ్యవహరించిన తీరు తప్పుగా కనిపిస్తుంది. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడం కరెక్టే కావొచ్చు. కానీ చెప్పిన విధానం బాగాలేదు. విరాట్ కోహ్లి టీమిండియాకు కెప్టెన్‌గా గొప్ప విజయాలు అందించాడు. ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లు ఆడి మంచి అనుభవం సంపాదించిన ఒక సీనియర్ క్రికెటర్‌గా జట్టులో ఉన్నాడు. ఇంత అనుభవజ‍్క్షుడి విషయంలో బీసీసీఐ సెలక్టర్లు కాస్త గౌరవంగా ఉంటే బాగుండేది. కెప్టెన్సీ తొలగింపుపై కోహ్లికి చెప్పి ఉంటే హుందాగా కనిపించేది. ఇప్పుడున్న సెలక్టర్లు గొప్పవాళ్లు కావొచ్చు.. కానీ కోహ్లి ఆడిన మ్యాచ్‌ల్లో సగం కూడా ఆడలేదు. అతన్ని కించపరిచే హక్కు వాళ్లకు లేదు. నేను జాతీయ సెలక్టర్‌గా ఉన్న సమయంలో ముందు జట్టును ఎంపిక చేసి ప్రెసిడెంట్ దగ్గరకు తీసుకెళ్తారు. ఆయన ఒకసారి పరిశీలించి ఓకే అన్న తర్వాత జట్టును ప్రకటిస్తాం.. ఇది రూల్. దానిని ప్రస్తుతం పూర్తిగా మార్చేశారు'' అంటూ పేర్కొన్నాడు.
చదవండి: IND Tour Of SA: 'పొద్దున్నే నేనే దొరికానా.. నన్ను వదిలేయ్'
ఇక సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా అక్కడ మూడు టెస్టులు.. మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక గాయంతో రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.