వెస్టిండీస్, యుఎస్‌ఏ వేదికలుగా ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ స్టార్ ఆటగాడైన విరాట్ కోహ్లి విషయంలో కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. వరల్డ్‌కప్ జట్టులో కోహ్లికి చోటు కల్పించకుండా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్నది బీసీసీఐ ఆలోచనగా తెలుస్తుంది.
కోహ్లి బ్యాటింగ్ శైలి వెస్టిండీస్‌లోని స్లో పిచ్‌లకు సెట్ కాదని.. అందుకే రన్ మెషీన్‌పై వేటు వేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. పొట్టి ఫార్మాట్‌లో కోహ్లి ప్రదర్శన పట్ల బీసీసీఐ సంతృప్తిగా లేదని.. అందుకే కోహ్లిని తప్పించి అతని స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని భావిస్తుందట.
వరల్డ్‌కప్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకునేలా కోహ్లికి సర్దిచెప్పే బాధ్యతను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు అప్పజెప్పినట్లు తెలుస్తుంది. కోహ్లికి సంబంధించిన ఈ సంచలన కథనాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. ఒకవేళ ఇదే నిజమై కోహ్లిని తప్పిస్తే.. భారత క్రికెట్‌లో అలజడి రేగడం ఖాయం. కోహ్లి అభిమానులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. కోహ్లి కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నప్పుడు బీసీసీఐ ఇంత పెద్ద సాహసం చేయదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్‌కప్‌కు ముందు జరిగే ఐపీఎల్‌లో కోహ్లి సత్తా చాటితే అప్పుడు బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment