search committee
-
పూర్తవని కూడికలు, తీసివేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏ యూనివర్సిటీకి ఎవరిని నియమించాలనే అంశంపై కసరత్తు దాదాపు పూర్తయినప్పటికీ, కూడికలు, తీసివేతలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీసీల కూర్పు నేపథ్యంలో పలు రకాల ఒత్తిళ్లు వస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి అక్టోబర్ 3, 4 తేదీల్లో ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు భేటీ కానున్నాయి. ఈ కమిటీలు వీసీల నియామకంపై ప్రభుత్వానికి అవసరమైన సిఫార్సులు చేస్తాయి. ఒక్కో వీసీ పోస్టుకు ముగ్గురిని సూచిస్తాయి. వీటిల్లో ఒకరిని ప్రభుత్వం గుర్తించి, జాబితాను గవర్నర్‌కు పంపాల్సి ఉంటుంది. కాగా, సెర్చ్ కమిటీల భేటీ తర్వాత తుది నిర్ణయం తీసుకునేందుకు సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. దసరా సెలవులు, ఆ తర్వాత కూడా కొన్ని సెలవులు ఉండటం వల్ల అనుకున్న వ్యవధిలో వీసీల నియామకం జరగకపోవచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రక్షాళన తప్పదా?అనుభవజు్ఞలు, పదవికి గౌరవం తెచ్చే వారితోనే ఈసారి వీసీల నియామకం ఉంటుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మీడియాకు తెలిపారు. ఈ దిశగా అనేక మంది పేర్లు పరిశీలించినట్టు చెప్పారు. అయితే, ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలిలోనూ భారీ ప్రక్షాళన ఉండొచ్చని అధికార వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. మండలిలో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమందిని కొనసాగించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఒక్కసారిగా మండలిని కొత్తవారితో నింపడం సరికాదని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో కార్యకలాపాలన్నీ సాఫీగా, ఎలాంటి వివాదాలు లేకుండా సాగుతున్నాయన్నది అధికారుల అభిప్రాయం. ఈ కారణంగా లింబాద్రిని కొనసాగించడమా? లేదా అనేదానిపై స్పష్టత రాలేదు. ఒకవేళ లింబాద్రి స్థానంలో వేరే వ్యక్తిని నియమిస్తే, ఆయనను ఏదైనా యూనివర్సిటీకి వీసీగా నియమించే అవకాశముందని తెలుస్తోంది. మండలిలో ఇద్దరు వైస్ చైర్మన్ల మార్పు తప్పదనే వాదన వినిపిస్తోంది. మండలి కార్యదర్శిగా ఉన్న శ్రీరాం వెంకటేశ్ కొన్ని నెలల క్రితమే ఆ పోస్టులోకి వచ్చారు. ఆయన అనుభవా న్ని దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టులో కొనసాగించే వీలుంది. కాగా, కీలకమైన జేఎన్టీయూహెచ్కు పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. దీనికి ఎన్ఐటీలో ఉన్న ఓ ప్రొఫెసర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో వచ్చే సిఫార్సులను కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి వస్తోందని సమాచారం. ఉస్మానియా వర్సిటీ వీసీ పోస్టుకు ఉన్నతాధికారులు పాత వీసీనే సిఫార్సు చేస్తున్నారు. మరో నలుగురు కూడా వివిధ మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థానం ఎవరికి దక్కుతుందనేది కీలకంగా మారింది. మొత్తం మీద అన్ని వర్సిటీలకు కూడా పోటీ ఉందని, ఈ నేపథ్యంలో వీసీల కూర్పునకు కొంత సమయం తప్పదని అధికారులు అంటున్నారు. -
ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్, జ్ఞానేశ్
న్యూఢిల్లీ: నూతన ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌లను కేంద్రం నియమించింది. వీరి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం కేంద్ర న్యాయ శాఖ విడుదలచేసింది. అంతకుముందు 212 పేర్లను సెర్చ్ కమిటీ ఎంపికచేసి మోదీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్‌కు పంపించింది. కాగా, వీరి నియామక విధానాన్ని సంబంధిత సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడైన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు. ‘‘ ఈ పేర్లను పరిశీలించాలంటూ 212 మంది పేర్ల జాబితాను గత రాత్రి నాకు ఇచ్చారు. తెల్లారితే సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ మోదీ అధ్యక్షతన భేటీ ఉంది. రాత్రి ఇచ్చి మధ్యాహ్నంకల్లా 212 మందిలో ఎలక్షన్ కమిషనర్‌గా అర్హత ఉన్న వ్యక్తిని ఎంపికచేయడం మానవమాత్రులకు సాధ్యమా? బుధవారం ప్యానెల్ భేటీ జరగడానికి కేవలం 10 నిమిషాల ముందు తుది జాబితా అంటూ ఆరు పేర్లున్న లిస్ట్ ఇచ్చారు. ఈ తుది జాబితా నుంచి సుఖ్బీర్, జ్ఞానేశ్‌ల పేర్లను ప్యానెల్‌లోని మెజారిటీ సభ్యులు ఖరారుచేశారు. అయితే ఈ ప్రతిపాదిత పేర్లలో ఈ ఇద్దరినే ఎందుకు ఎంపిక చేశారో నాకైతే అర్ధంకాలేదు. సుప్రీంకోర్టు గత తీర్పు ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఈ ఎంపిక కమిటీలో ఉంటే బాగుండేది’ అని అధీర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్యానెల్లో మోదీ, అ«దీర్తోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్ అనూప్‌చంద్ర పాండే గత నెల 14వ తేదీన రిటైర్ కావడం, మరో ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇద్దరూ 1988 బ్యాచ్ అధికారులే ఎలక్షన్ కమిషనర్లుగా ఎంపికైన సుఖ్బీర్, జ్ఞానేశ్‌లు 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. సుఖ్బీర్ ఉత్తరాఖండ్ క్యాడర్ అధికారి కాగా, జ్ఞానేశ్ కేరళ క్యాడెర్ అధికారి. సుఖ్బీర్ గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. అఖిలభారత సరీ్వస్లోకి రాకముందు సుఖ్బీర్ అమృత్‌సర్‌లో ఎంబీబీఎస్ చదివారు. జ్ఞానేశ్ గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా చేశారు. అమిత్ షా మంత్రిగా ఉన్న సహకార శాఖలోనూ కార్యదర్శిగా ఉన్నారు. జమ్మూకశీ్మర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కలి్పంచిన ఆరి్టకల్ 370ని రద్దుచేయడంలో జ్ఞానేశ్ హోం శాఖలో పనిచేస్తూ కీలకపాత్ర పోషించారు. ఐఐటీ(కాన్పూర్) పట్టభద్రుడైన జ్ఞానేశ్ 2014లో ఢిల్లీలో కేరళ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్నారు. నూతన ఎలక్షన్ కమిషనర్లను ఎంపికచేసేందుకు సీజేఐ, ప్రధాని, లోక్‌సభలో విపక్షనేతలతో సెలక్షన్ ప్యానెల్‌ను ఏర్పాటుచేయాలని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరిచింది. దీనికి అనుగుణంగా కేంద్రం చట్టం చేసింది. కానీ సీజేఐకి బదులు కేంద్రమంత్రికి ప్యానెల్లో స్థానం కలి్పంచింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను శుక్రవారం కోర్టు విచారణ జరగనుంది. -
నిమ్స్ పగ్గాలు ఎవరికో..!
సాక్షి, హైదరాబాద్/లక్డీకాపూల్: నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్)కు కొత్త డైరెక్టర్ ను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే వార్తలు రావడంతో ఈ విషయమై పలు ఊహాగానాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త డైరెక్టర్ నియామకం కోసం ప్రభుత్వం సెర్చ్ కమిటీ వేయనున్నట్టు సమాచారం. ఈ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత నిమ్స్‌కు కొత్త డైరెక్టర్ నియమితులవుతారు. ప్రస్తుత డైరెక్టర్ మనోహర్ అనారోగ్యం దృష్ట్యా కొనసాగలేనని చెప్పడంతో కొత్త డైరెక్టర్ నియామకం అనివార్యంగా మారింది. ప్రతిష్టాత్మక సంస్థ..ప్రతిష్టాత్మక పదవి! ప్రతిష్టాత్మక నిమ్స్‌కు తొలిసారిగా 1985లో నాటి ప్రభుత్వం డైరెక్టర్‌ను నియమించింది. అప్పటి నుంచి ఆ పదవి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. తొలి డైరెక్టర్‌గా కాకర్ల సుబ్బారావు (1985–1990) నియమితులు కాగా, ఆ తర్వాత 1997–2004 మధ్య కూడా రెండుసార్లు ఆయనే డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన కాకుండా డా.ప్రసాదరావు (2004–2010) కూడా ఐదేళ్లకు పైబడి డైరెక్టర్‌గా ఉన్నారు. మిగిలిన డైరెక్టర్లు, ఇన్చార్జి డైరెక్టర్లు ఏడాది నుంచి 3 ఏళ్ల కాలవ్యవధి వరకు మాత్రమే పదవిలో కొనసాగారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న మనోహర్ 2015 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా చూస్తే ఆయన లాగా ఏకబిగిన ఎక్కువ కాలం (ఏడేళ్లు) డైరెక్టర్ పదవిలో కొనసాగిన వారు మరొకరు లేకపోవడం గమనార్హం. సమస్యాత్మకం కూడా.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు నిమ్స్‌లో వైద్య సేవలకు తరలివస్తుంటారు. నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉండే నిమ్స్ డైరెక్టర్ పదవి ఎంత ప్రతిష్టాత్మకమో అంతే సమస్యాత్మకం కూడా. సంపన్నుల నుంచి నిరుపేదల వరకు అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బృహత్తర బాధ్యతలు ఒకపక్క, ఎప్పటికప్పుడు అనుభవంలోకి వచ్చే పాలనాపరమైన ఇబ్బందులు మరోపక్క.. వీటన్నింటినీ సమన్వయం చేస్తూ ఒకరకంగా కత్తి మీద సామే చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ పదవిలో నియమించే వ్యక్తిని ఆచితూచి ఎంపిక చేస్తుంది. అయినప్పటికీ పెద్ద, ప్రతిష్టాత్మక సంస్థ కావడంతో డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రముఖ వైద్యులు ఆసక్తి చూపిస్తుంటారు. పోటా పోటీ ప్రస్తుతం నిమ్స్ డైరెక్టర్ పోస్టు కోసం పలువురు రేసులో ఉన్నట్టు వినిపిస్తోంది. నిమ్స్ డీన్ డాక్టర్ రామమూర్తి, మెడికల్ సూపరింటెండెంట్ ఎన్.సత్యనారాయణ, కార్డియాక్ సర్జన్ డా.ఆర్వీ కుమార్, డాక్టర్ బీరప్ప (సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ), న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ ఎం.విజయసారథి, నెఫ్రాలజీ హెడ్ గంగాధర్‌లు ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైద్యవిద్య డైరెక్టర్(డీఎంఈ) రమేష్‌రెడ్డి పేరు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకా లంగా నిమ్స్ అందిస్తున్న వైద్య సేవల విషయంలో పలు విమర్శలు వినిపిస్తు న్నాయి. దిగువస్థాయి సిబ్బందిలో నిర్ల క్ష్యం బాగా పెరిగిందని అంటున్నారు. రోగులకు పడకలు సహా వసతుల కొర త ఉందని, ఆరోగ్యశ్రీ సేవల్లో లోపాలు సమస్యగా మారుతున్నాయని తెలుస్తోంది. కొన్ని వార్డుల్లో సిబ్బంది అవినీతిపై రోగుల ఆరోపణలూ వినవస్తున్నాయి. కొత్తగా వచ్చే డైరెక్టర్ వీటిపై దృష్టిసారించి పనిచేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఒక పోస్టు 240 దరఖాస్తులు!
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పదవి కోసం ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా తీవ్రమైన పోటీ నెలకొంది. ఏకంగా 240 మంది ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వర్సిటీకి చెందిన వారితో పాటు ఇతర వర్సిటీల అధ్యాపకులు, మాజీ వీసీలు, 100 మందికి పైగా రిటైర్డ్ అధ్యాపకులు, ప్రస్తుతం అధికార పదవుల్లో కొనసాగుతున్న రిజిస్ట్రార్ మొదలు ప్రిన్సిపల్స్, ఇతర అధికారులు, విభాగాల అధిపతులు రేసులో ఉండటం విశేషం. కాగా వీరి సుదీర్ఘ నిరీక్షణకు తెర వేస్తూ వీసీ ఎంపిక త్వరలో జరగవచ్చనే ప్రచారంతో పైరవీలు మరింత ఊపందుకున్నట్టు సమాచారం. ముళ్ల కిరీటమే అయినా.. నిజాం స్థాపించిన ఈ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకొని 104వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఏడోదైన ఓయూ కోటి మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించింది. దీని ఘనకీర్తి ప్రపంచం నలుమూలలా విస్తరించింది. అలాంటి ఓయూ నేడు నిధులు, నియామకాలకు సంబంధించిన సమస్యలతో పాటు అనేక ఇతర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. నిత్యం ఏదో ఒక సమస్య, ఆందోళన కార్యక్రమాలతో సాగే ఓయూలో వీసీ పదవి ముళ్ల కిరీటమని తెలిసినా, మరోవైపు ప్రతిష్టాత్మక పదవి కావడంతో 240 మంది ప్రొఫెసర్లు దాని కోసం పోటీ పడుతున్నారు. 20 రోజుల్లో కొత్త ఉప కులపతి? ప్రొఫెసర్ రామచంద్రం పదవీ విరమణతో సుమారు 18 నెలల కిందట ఈ పోస్టు ఖాళీ అయ్యింది. 2019 జూలైలో ఈ పదవికి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గతేడాది సెర్చ్ కమిటీని నియమించినా ఇంతవరకు సమావేశం జరగలేదు. ఈ సమావేశం కోసం ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌ను నోడల్ అధికారిగా నియమించారు. అయితే వివిధ రకాల ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉండటం, కరోనా నేపథ్యంలో వీసీ నియామకంలో జాప్యం జరిగింది. అయితే ఇప్పటికే తీవ్ర జాప్యమవడం, కరోనా అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొంటుండడం, మార్చిలో మళ్లీ ఎన్నికలు (పట్టభద్రుల ఎమ్మెల్సీ) ఉన్న నేపథ్యంలో.. అంతకంటే ముందుగా 20 రోజుల్లోగానే ఓయూతో పాటు ఇతర వర్సిటీలకు వీసీలను నియమిస్తారని ఓయూ సీనియర్ అధ్యాపకులకు సమాచారం అందినట్టు తెలిసింది. సెర్చ్ కమిటీ సమావేశమై ముగ్గురి పేర్లు ఎంపిక చేస్తే, ముఖ్యమంత్రి అందులో ఒకరిని ఖరారు చేసి గవర్నర్‌కు పంపుతారు. ఆ తర్వాత వీసీ నియామకాన్ని గవర్నర్ ప్రకటిస్తారు. పైరవీలు మరింత ముమ్మరం వీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అధ్యాపకులు తొలినాళ్లలోనే జోరుగా పైరవీలు చేశారు. నియామకంలో జాప్యం తో కొంత సద్దుమణిగినా తాజా సమాచారం నేపథ్యంలో పైరవీలు మరింత ఊపందుకున్నట్లు తెలిసింది. లాక్డౌన్ అనంతరం వర్సిటీ అస్తవ్యస్తంగా మారిందని, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా.. సమర్థులు, ఓయూకు పూర్వ వైభవం తెచ్చే ప్రొఫెసర్లను వీసీగా నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
మంచి విద్య.. మెరుగైన ఉద్యోగం
సాక్షి, అమరావతి: విద్యార్థులు పాఠశాలల్లో చేరిన దగ్గర నుంచి ఉద్యోగాలు సంపాదించే స్థాయి వరకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇది తనకు అత్యంత ప్రాధాన్యతా అంశమని స్పష్టం చేశారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రమాణాలు పెంచి వాటిని ఉద్యోగ కల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య, దీన్ని బోధిస్తున్న సంస్థలు, ఎయిడెడ్ కాలేజీల్లో పరిస్థితులు తదితర అంశాలమీద అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థ బలంగా లేకపోతే పేదలు, మధ్య తరగతి పిల్లలు చదువుకోలేరని, అందువల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థను బతికించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస సదుపాయాలు ఉండాలని, నాణ్యమైన విద్య అందించాలన్నారు. గత ప్రభుత్వం కావాలనే ఈ రంగాన్ని నిర్వీర్యం చేసిందని వ్యాఖ్యానించారు యూనివర్సిటీల దశ, దిశ మార్చండి.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలను దెబ్బతీశారని, ఫలితంగా ప్రైవేటు కాలేజీల్లో లక్షలాది రూపాయలు పోసి చదువుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫీజులు భరించలేక విద్యార్థులు చదువులు మానుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల దశ, దిశ మార్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, ప్రమాణాలు పెంచి వాటి ప్రతిష్టను ఇనుమడింపచేయాలని సీఎం గట్టిగా చెప్పారు. యూనివర్సిటీల్లో వీసీల నియామకంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలను అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రికి నివేదించారు. వీసీల నియామకానికి సంబంధించి సెర్చి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. నెలరోజుల్లోగా పూర్తి పారదర్శక విధానంలో అర్హత, అనుభవం ఉన్న వారిని వీసీలుగా ఎంపిక చేయాలని పేర్కొన్నారు. అలాగే ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, ఇతర అధ్యాపక, సిబ్బంది పోస్టులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భర్తీల విషయంలో అవినీతికి, పొరపాట్లకు తావివ్వకూడదని హెచ్చరించారు. అన్ని యూనివర్సిటీల న్యాక్ గ్రేడ్ పెరిగేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచి విద్యార్థులకు తోడుగా ఉన్నామన్న సంకేతాలు పంపాలని అధికారులకు సూచించారు. ఫీజులను ప్రామాణీకరించాలి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలు తరువాత ఉన్నత విద్య చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగిన అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. కాలేజీల ఫీజులు, ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంటు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని, దీన్ని పరిశీలించి ప్రామాణీకరించాలని (స్టాండర్డెజ్) ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఫీజుల నిర్ధారణ వాస్తవిక దృక్పథంతో ఉండాలని అభిప్రాయపడ్డారు. లేకుంటే పేద, మధ్యతరగతి పిల్లలు ఫీజులు భరించలేరన్నారు. ‘ఇంజనీరింగ్ చదివే విద్యార్థికి ఏటా రూ. 33 వేలు ఖర్చు అవుతుందని ప్రభుత్వమే నిర్ధారించి, ఆ మేరకు రీయింబర్స్‌మెంటును ఖరారు చేసింది. అదే సమయంలో కొన్ని కాలేజీలు ఏటా రూ. 70 వేల నుంచి రూ. 1 లక్ష వరకు కూడా ఫీజుల వసూలుకు మళ్లీ ప్రభుత్వమే అనుమతి ఇస్తోంది. ఈ పద్ధతి మారాలి. విద్య అన్నది వ్యాపారం కాదు. దాన్ని లాభార్జన రంగంగా చూడకూడదు. దేశంలో చట్టం కూడా అదే చెబుతోంది’ అని సీఎం పేర్కొన్నారు. ఫీజురీయింబర్స్‌మెంటు కింద కాలేజీలకు అందాల్సిన డబ్బులు కనీసం మూడు నెలలకోసారైనా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అప్పుడే ఆ కాలేజీలు కూడా సక్రమంగా నడుస్తాయని అక్కడ పనిచేస్తున్న వారికి సకాలానికి వేతనాలు అందుతాయని పేర్కొన్నారు. భూములు పొంది, సంస్థలు ఏర్పాటు చేయని వాటి వివరాలు సేకరణ.. రాజధాని ప్రాంతంలో ప్రైవేటు యూనివర్సిటీలకు ఇబ్బడిముబ్బడిగా భూములు కేటాయింపు అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. ఒక విధానం లేకుండా ఇష్టానుసారం గత ప్రభుత్వం భూములు కేటాయించిందని సీఎం వ్యాఖ్యానించారు. భూములు పొంది, సంస్థలను ఏర్పాటు చేయని వారి వివరాలను తయారుచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఒంగోలు, విజయనగరంలలో యూనివర్సిటీలు పెడతామంటూ ఎన్నికలకు ముందు హడావుడిగా జీవోలు ఇచ్చారని, కానీ వాటి నిర్మాణం, సిబ్బంది నియామకంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. మూడేళ్లలో వాటి ఏర్పాటు పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఉద్యోగ కల్పన కేంద్రాలుగా వర్సిటీలు, కాలేజీలు చదువు పూర్తిచేసుకుని బయటకు రాగానే ఉద్యోగం సంపాదించుకునేలా విద్యావ్యవస్థ ఉండాలని, వర్సిటీలు, కాలేజీల్లో ప్రమాణాలు పెంచి, వాటిని ఉద్యోగ కల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఈ దిశగా సిలబస్‌లో మార్పులు చేయాలని, సిలబస్‌ను మెరుగుపరచడానికి ఒక కమిటీని వేయాలని ఆదేశించారు. కొత్త సిలబస్ వచ్చే విద్యాసంవత్సరం అమల్లోకి రావాలని గడువు విధించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేముందు ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా వారి అర్హతలను నిర్ధారించాలని, ఏపీపీఎస్సీ నిర్దేశించుకున్న అర్హతలను ఒకసారి పరిశీలించాలని పేర్కొన్నారు. పార్లమెంటు నియోజకవర్గానికో వృత్తి నైపుణ్య కేంద్రం విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఏ కోర్సులు పెట్టాలి, ఎలా అమలు చేయాలన్న ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. స్థానిక పరిశ్రమల ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలని మార్గనిర్దేశం చేశారు. పరిశ్రమలకు అవసరమైన రీతిలో అభ్యర్థుల్లో నైపుణ్యాన్ని ఈ కేంద్రాల్లో నేర్పించాలని సూచించారు. అదే సమయంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో కోర్సులను మెరుగుపరచాలన్నారు. విశాఖపట్నం జిల్లా అరకులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని, మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ఈ రెండు విద్యాసంస్థలను గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటుచేయడం సముచితమని అభిప్రాయపడ్డారు. రూ. 1,000 కోట్ల రూసా నిధులు కోల్పోయాం రూసా గ్రాంటు కింద కేంద్రం గత ఏడాది రూ. 67 కోట్లు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విడుదల చేయకుండా వేరే ఖర్చులకు దారి మళ్లించిందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఏయూ, ఎస్వీ వర్సిటీలు న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు ఉన్నాయని, అవి 100 కోట్లు ఖర్చు చేసి ఉంటే రూసా కింద రూ. 1,000 కోట్లు అందేవని, దాన్ని రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఇలా కావడం విచారకరమని, ఇలా చేస్తే విద్యాసంస్థలు ఎలా మెరుగుపడతాయని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. వర్సిటీలలో మౌలిక సదుపాయాలకు ఎంత కావాలన్నా కేపిటల్ గ్రాంటుగా తాము ఇస్తామని, మొత్తం అన్ని యూనివర్సిటీలు న్యాక్ ఏప్లస్ గ్రేడులోకి తీసుకురావాలని ఆదేశించారు. ట్రిపుల్ ఐటీ నిధులూ పక్కదారి ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలను అధ్వానంగా మార్చారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ట్రిపుల్ ఐటీలకు సంబంధించి రూ. 400 కోట్లు ఉంటే అందులో రూ. 260 కోట్లు గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సీఎంకు అధికారులు తెలిపారు. ట్రిపుల్ ఐటీల భవనాల నిర్మాణానికి నిధులు లేకుండా పోయాయని, ప్రభుత్వ వైఫల్యం వల్ల వేలమంది విద్యార్థులను ప్రైవేటు భవనాల్లో ఉంచారని పేర్కొన్నారు. కాలేజీల అభివృద్ధిపై చర్చ సందర్భంగా జిల్లాకొక కాలేజీని రూ. 15 కోట్లతో అభివృద్ధి చేయిద్దామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ పేర్కొన్నారు. కొన్ని కాలేజీలనే అభివృద్ధి చేసే బదులు మౌలికంగా ముందుగా అవసరమయ్యే మంచి నీరు, ఫర్నీచర్, ఫ్యానులు, బ్లాక్‌బోర్డులు, ప్రహరీలు, పెయింటింగ్‌లు తదితర 9 అంశాల్లో అన్ని కాలేజీలను మెరుగుపర్చాలని వైఎస్ జగన్ సూచించారు. స్కూళ్ల మాదిరిగానే కాలేజీల ప్రస్తుత ఫొటోలు తీసుకొని రెండేళ్లలో అభివృద్ధి చేసి చూపించాలన్నారు. వర్సిటీల పాలకమండళ్లను నెలరోజుల్లో పునర్నియమిస్తామని సీఎం తెలిపారు. 7వ పీఆర్సీకి సంబంధించి బకాయిలకు రూ. 340 కోట్లు అవసరమని అధికారులు పేర్కొనగా సీఎం ఇస్తామన్నారు. ట్రిపుల్ ఐటీలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సహకారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదాత్త ఆశయంతో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటుచేస్తే వాటిని చేజేతులా నాశనం చేశారని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయంటూ పాదయాత్రలో తన వద్దకు వచ్చి విద్యార్థులు గోడుబెళ్లబోసుకున్నారని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో వెంటనే పనులు పూర్తిచేయాలని, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ పనులు త్వరితంగా మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ ఐటీల్లో చదివే విద్యార్థుల్లో 50 శాతం మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు వస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ పరిస్థితులు మారాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ట్రిపుల్ ఐటీలలో తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. సమీపంలోని రిజర్వాయర్ల నుంచి డైరెక్టుగా పైపులైనులు వేసి నీళ్లందించే ప్రయత్నాలు చేయాలన్నారు. ట్రిపుల్ ఐటీల్లో ఆత్మహత్య ఘటనలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకుండా విద్యాశాఖ మంత్రి, అధికారులు ఆయా క్యాంపస్‌లను తరుచూ సందర్శించాలని ఆదేశించారు. -
వీసీ రేస్.. క్లైమాక్స్!
► నేడు హైదరాబాద్‌లో సెర్చ్ కమిటీ సమావేశం ► పైరవీలు ముమ్మరం చేసిన ఆశావహులు ► రంగంలోకి కొత్త ముఖాలు ► ఎంపిక అనూహ్యమే అంటున్న క్యాంపస్ వర్గాలు సామాజిక సమీకరణలా.. రాజకీయ పైరవీలా.. వాస్తవ అర్హతలా?.. ఏయూ వీసీ ఎంపికలో ఏ అంశం పైచేయి సాధిస్తుంది. అంతిమంగా ఎవరి మాట చెల్లుతుంది.. ఎవరి ప్రయత్నం ఫలిస్తుందన్నది ఇప్పుడు క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మరికొన్ని గంటల్లో సెర్చ్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం పోటీలో ఉన్నవారితోపాటు అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకి రావడంతో వీసీ రేస్ క్లైమాక్స్‌కు చేరింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాల యం వైస్ చాన్సలర్ పదవి కోసం ఇదే క్యాంపస్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు బహిరంగంగా వీసీ పదవే లక్ష్యంగా ఆధిపత్య పోరు సాగిస్తుండగా.. మరికొందరు చాపకింద నీరులా పావులు కదుపుతూ చాణక్యం ప్రదర్శిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనసులో ఏముందో ఇప్పటికీ అంతు చిక్కని పరిస్థితుల్లో రేస్‌లోకి మరికొందరు రంగప్రవేశం చేయడంతో పోటీ రసకందాయంలో పడింది. సుమిత్రా దావ్రా నోట సీఎం మాట! కొత్త వీసీ ఎంపికకు నియమించిన సెర్చ్ కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం కానుంది. ఏయూ నామినీగా ఆనందకృష్ణన్( అన్నా విశ్వవిద్యాలయం మాజీ వీసీ), యూజీసీ నామినీగా రాజ్‌పాల్ సింగ్( పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ), గవర్నర్ నామినీ సుమిత్రా దావ్రా( ఉన్నత విద్యా శా ఖ ముఖ్య కార్యదర్శి) ఈ కమిటీలో సభ్యులుగా ఉ న్నారు. వీసీ పదవికి అందిన దరఖాస్తులను ఈ కమి టీ పరిశీలించి ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఇది పైకి కనిపించే తంతు మాత్రమే. కానీ సీఎం చంద్రబాబు ఎవర్ని వీసీగా నియమించాలని భావిస్తున్నారో ఆ పేరును గ వర్నర్ నామినీగా ఉన్న సుమిత్రా దావ్రా సూచిస్తారు. అదే పేరు సెర్చ్ కమిటీ ప్రభుత్వానికి నివేదించే జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది. దాంతో ఆమె సూచించే పేరు ఎవరిదన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. రేసు ఆసక్తికరం క్యాంపస్ నుంచి ఇన్చార్జి వీసీ నారాయణ, రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు వీసీ పదవి కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాగా హఠాత్తుగా మరికొందరు ఈ రేసులో ముందంజ వేయడం గమనార్హం. గతసారి విఫలయత్నం చేసిన ఇన్చార్జి వీసీ నారాయణ ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన పూర్తిగా మంత్రి గంటా శ్రీనివాసరావునే నమ్ముకున్నారు. తనను ఎంపిక చేస్తే కాపు సామాజిక వర్గానికి గుర్తింపునిచ్చినట్లు అవుతుందని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. మంత్రి గంటా కూడా నారాయణ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. విద్యా శాఖ మంత్రిగా తన జిల్లాలో వీసీ ఎంపికలోనైనా తన మాట చెల్లుబాటు కావాలి కదా అని ఆయన వాదిస్తున్నారు. కానీ ఆయన వాదనకు సీఎం చంద్రబాబు నుంచి సానుకూల స్పందన లభించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రధానంగా సామాజికవర్గ సమీకరణను ప్రస్తావిస్తూ పైరవీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. సీఎం పేషీ స్థాయిలో పైరవీలతోపాటు తమ సామాజికవర్గ పెద్దలతో సీఎంకు సిఫార్సు చేయించేందుకు యత్నిస్తున్నారు. ఆయనపట్ల చంద్రబాబు వైఖరి ఏమిటన్నది స్పష్టం కావడం లేదు. ఇటీవల క్యాంపస్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలు, పీహెచ్‌డీల ప్రవేశాల్లో రిజిస్ట్రార్‌గా ఆయన బాధ్యత కూడా ఉందన్న వాదన బలంగా వినిపిస్తుండటం ఉమామహేశ్వరరావు ప్రతికూలంగా మారుతోంది. రంగంలోకి ఇతర వర్సిటీల వారు కాగా చడీచప్పుడు కాకుండా మరికొందరు రేసులో ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. ఏయూ చరిత్ర విభాగానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణకుమారి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో ఆమె ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కూడా చేశారు. ఆమె అభ్యర్థిత్వం పట్ల హైదరాబాద్ స్థాయిలో సానుకూలత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. సామాజికవర్గ సమీకరణపరంగా కూడా ఆమె ఎంపిక రెట్టింపు ప్రయోజనాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. తిరుపతి ఎస్వీయూకు చెందిన ఓ ప్రొఫెసర్ కూడా సీఎం చంద్రబాబును కలసి తనకు అవకాశం ఇవ్వమని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాబు మనసులో మాట ఏమిటన్నది శుక్రవారం సెర్చ్ కమిటీ సమావేశంలో సమిత్రా దావ్రా వెల్లడించనున్నారు. సెర్చ్ కమిటీ నివేదికకు గవర్నర్ ఆమోదం తరువాతే కొత్త వీసీ ఎవరన్న ఉత్కంఠతకు తెరపడుతుంది. -
వీసీల ఎంపికకు సెర్చ్ కమిటీలు
ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీలకు వైస్ చాన్స్లర్లను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీల్లో ఒకరిని వర్సిటీ పాలకమండలి నామినీగా, మరొకరిని యూజీసీ నామినీగా, ఇంకొకరిని ప్రభుత్వ నామినీగా నియమిస్తూ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య గురువారం జీవోలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్నత విద్యా శాఖ వీసీ పోస్టుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటి వరకు 60 వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఒక్కో వర్సిటీ వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను సెర్చ్ కమిటీలు పరిశీలించి ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం పంపించనున్నాయి. మరోవైపు శాతవాహన వర్సిటీ వీసీ ఎంపికకుగానూ త్వరలోనే సెర్చ్ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. వర్సిటీలవారీగా సెర్చ్ కమిటీల్లో సభ్యులు ఉస్మానియా వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, యూజీసీ నామినీగా ఇగ్నో మాజీ వీసీ ప్రొఫెసర్ హెచ్‌పీ దీక్షిత్, ప్రభుత్వ నామినీగా ఆర్థిక శాఖ కార్యదర్శి కె.రామకృష్ణారావు. కాకతీయ వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్, యూజీసీ నామినీగా భారతీ విద్యా పీఠ్ వీసీ ప్రొఫెసర్ శివాజీరావు, ప్రభుత్వ నామినీగా విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య. పాలమూరు విశ్వవిద్యాలయం: వర్సిటీ నామినీగా ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశరావు, యూజీసీ నామినీగా యూజీసీ సభ్యుడు డాక్టర్ వీఎస్ చౌహాన్, ప్రభుత్వ నామినీగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య. మహాత్మాగాంధీ వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు, యూజీసీ నామినీగా యూజీసీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ దేవరాజ్, ప్రభుత్వ నామినీగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం: వర్సిటీ నామినీగా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు, యూజీసీ నామినీగా యూజీసీ సభ్యుడు డాక్టర్ వీఎస్ చౌహాన్, ప్రభుత్వ నామినీగా రంజీవ్ ఆర్ ఆచార్య. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశరావు, యూజీసీ నామినీగా హర్యానా సెంట్రల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుహాడ్, ప్రభుత్వ నామినీగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా ఆ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్, యూజీసీ నామినీగా ఇగ్నో మాజీ వీసీ ప్రొఫెసర్ హెచ్‌పీ దీక్షిత్, ప్రభుత్వ నామినీగా ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు. తెలంగాణ విశ్వవిద్యాలయం: వర్సిటీ నామినీగా కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్ లింగమూర్తి, యూజీసీ నామినీగా కలకత్తా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సురంజన్ దాస్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉంటారు. -
వీసీ ఎంపికకు సెర్చ్ కమిటీ
హైదరాబాద్: గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ఉపకులపతి నియామకానికి సంబంధించి ప్రభుత్వం గురువారం సెర్చికమిటీని నియమించింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితాదావ్రా ఉత్తర్వులు జారీచేశారు. ముగ్గురు సభ్యుల గల ఈ కమిటీ వీసీ పదవికి దరఖాస్తులను ఆహ్వానించి అందులో నుంచి ముగ్గురి పేర్లను వీసీ పోస్టుకోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.