వీసీల ఎంపికకు సెర్చ్ కమిటీలు | VC selection To Search Committees | Sakshi
Sakshi News home page

వీసీల ఎంపికకు సెర్చ్ కమిటీలు

Published Fri, Jan 1 2016 1:48 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

వీసీల ఎంపికకు సెర్చ్ కమిటీలు - Sakshi

వీసీల ఎంపికకు సెర్చ్ కమిటీలు

ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్లను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీల్లో ఒకరిని వర్సిటీ పాలకమండలి నామినీగా, మరొకరిని యూజీసీ నామినీగా, ఇంకొకరిని ప్రభుత్వ నామినీగా నియమిస్తూ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య గురువారం జీవోలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్నత విద్యా శాఖ వీసీ పోస్టుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటి వరకు 60 వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

ఒక్కో వర్సిటీ వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను సెర్చ్ కమిటీలు పరిశీలించి ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం పంపించనున్నాయి. మరోవైపు శాతవాహన వర్సిటీ వీసీ ఎంపికకుగానూ త్వరలోనే సెర్చ్ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
 
వర్సిటీలవారీగా సెర్చ్ కమిటీల్లో సభ్యులు
ఉస్మానియా వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, యూజీసీ నామినీగా ఇగ్నో మాజీ వీసీ ప్రొఫెసర్ హెచ్‌పీ దీక్షిత్, ప్రభుత్వ నామినీగా ఆర్థిక శాఖ కార్యదర్శి కె.రామకృష్ణారావు.
 
కాకతీయ వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్, యూజీసీ నామినీగా భారతీ విద్యా పీఠ్ వీసీ ప్రొఫెసర్ శివాజీరావు, ప్రభుత్వ నామినీగా విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య.
 
పాలమూరు విశ్వవిద్యాలయం: వర్సిటీ నామినీగా ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశరావు, యూజీసీ నామినీగా యూజీసీ సభ్యుడు డాక్టర్ వీఎస్ చౌహాన్, ప్రభుత్వ నామినీగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య.
 
మహాత్మాగాంధీ వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు, యూజీసీ నామినీగా యూజీసీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ దేవరాజ్, ప్రభుత్వ నామినీగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య.
 
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం: వర్సిటీ నామినీగా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు, యూజీసీ నామినీగా యూజీసీ సభ్యుడు డాక్టర్ వీఎస్ చౌహాన్, ప్రభుత్వ నామినీగా రంజీవ్ ఆర్ ఆచార్య.
 పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశరావు, యూజీసీ నామినీగా హర్యానా సెంట్రల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుహాడ్, ప్రభుత్వ నామినీగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య.
 
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా ఆ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్, యూజీసీ నామినీగా ఇగ్నో మాజీ వీసీ ప్రొఫెసర్ హెచ్‌పీ దీక్షిత్, ప్రభుత్వ నామినీగా ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు.
 
తెలంగాణ విశ్వవిద్యాలయం: వర్సిటీ నామినీగా కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్ లింగమూర్తి, యూజీసీ నామినీగా కలకత్తా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సురంజన్ దాస్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement