Department of Higher Education
-
ఉన్నత విద్యాశాఖకు ఆంధ్ర సారస్వత పరిషత్ కృతజ్ఞతలు
సాక్షి, విజయవాడ: బిఏ ఓరియెంటల్ లాంగ్వేజ్(ఓల్) పూర్తి చేసిన వారికి బీఈడీలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ అభినందించారు. బిఈడి సోషల్ స్టడీస్ మెథడాలజీలోకి ప్రవేశం కల్పించేందుకు అనుమతి, అర్హత ఉన్న అభ్యర్థులకు ఏపీఎడ్ సెట్ దరఖాస్తుల గడువును మే 15 వరకు పొడిగింపు, జూన్ మూడో వారంలో ఈ పరీక్ష నిర్వహణకు సన్నాహాలు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్, ఓరియంటల్ విద్యార్థుల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి , కమిషనర్ సురేష్ నాయర్, ఏపీఎడ్ సెట్ కన్వీనర్ సుధీర్‌రెడ్డిలకు పరిషత్ ధన్యవాదాలు తెలిపింది. చదవండి: ‘చిరు’ధాన్యాల సాగుకు పెద్ద ప్రోత్సాహం -
ఏపీలోనూ విదేశీ కోర్సులు.. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్ రాష్ట్రంలోనూ అమలు
విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సుల ద్వారానే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సోలార్ పార్క్‌లు, సోలార్ మోటార్లు, ప్యానల్స్ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరతను అధిగమించేలా ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు అందుబాటులో ఉండాలి. వీటిలో ఈ దిశగా కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలి. వచ్చే జూన్ నాటికి ఈ తరహా కోర్సులు ఏర్పాటు చేయాలి. కళాశాలలకు అనుమతుల విషయంలో యూనిఫామ్ పాలసీ ఉండాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థలు అక్కడి విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను రాష్ట్రంలోని విద్యార్థులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా కోర్సులు మన విద్యార్థులకు ఏమేరకు గరిష్ట ప్రయోజనం కల్పిస్తాయో పరిశీలించి, వాటిని ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని సూచించారు. తద్వారా రాష్ట్ర విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిగ్రీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థుల నైపుణ్యాలను పెంచాలని, ఈ దిశగా వివిధ కోర్సుల పాఠ్య ప్రణాళికల్లో సమగ్రత తేవాలని సూచించారు. ఉన్నత విద్యా సంస్థల్లోని కోర్సుల పాఠ్య ప్రణాళికను ఆయా జిల్లాల్లో ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్ ఓరియెంటెడ్‌గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్ కోర్సులను ఈ పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలని చెప్పారు. ప్రఖ్యాత కాలేజీలు అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలను కూడా పరిశీలించి, రాష్ట్రంలో కూడా అటువంటి పాఠ్య ప్రణాళికలను అమలు చేయాలన్నారు. స్వయం ఉపాధిని కల్పించే కోర్సుల కోసం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) వంటి సంస్థలతో అనుసంధానం (టైఅప్) చేసుకోవాలని సూచించారు. రిస్క్ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ తరహా కోర్సుల వల్ల డిగ్రీ పూర్తి కాగానే విద్యార్థులకు స్వయం ఉపాధి అందుతుందని చెప్పారు. వచ్చే జూన్ కల్లా పాఠ్య ప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరితగతిన నియామకాలు ► ఉన్నత విద్యా శాఖలో 2 వేలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఈ ఖాళీలను త్వరగా భర్తీ చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇప్పటికే చేపట్టిన నోటిఫికేషన్లకు సంబంధించిన కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని, జూన్ కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. ► ఉన్నత విద్యా శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తున్న నేపథ్యంలో సిబ్బంది నియామకాలు త్వరితగతిన చేపట్టాలి. యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. సమర్థులైన బోధన సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలి. తద్వారా విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాలను పెంచేందుకు అవకాశముంటుంది. ట్రిపుల్ ఐటీలలో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలి. కాలేజీలు ప్రమాణాలు పెంచుకునేలా చేయూత ► రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటికీ న్యాక్ తదితర సంస్థల అక్రిడిటేషన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉన్నత విద్యా శాఖ పరిధిలోని ప్రతి కాలేజీలో కూడా బోధనపరంగా, వసతుల పరంగా నాణ్యత పెరగాలి. ఈ దిశగా ప్రతి విద్యా సంస్థ కూడా నాక్ అక్రిడిటేషన్ సాధించాలి. ► కాలేజీలు ప్రమాణాలు పెంచుకునేలా మూడేళ్ల పాటు వారికి చేయూతనివ్వాలి. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో అక్రిడిటేషన్‌కు వీలుగా ప్రమాణాలు పెంచుకోవాలి. మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యా సంస్థలు న్యాక్ అక్రిడిటేషన్ సాధించాలి. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ► కళాశాలల్లో కోర్సులన్నీ నేటి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలి. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్ అందించే బాధ్యత స్కిల్ యూనివర్సిటీ తీసుకోవాలి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ► ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలి. ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కలిసి కరిక్యులమ్ రూపొందించాలి. హై ఎండ్ స్కిల్స్‌లో భాగంగా సాప్ట్వేర్ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాలి. కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్ లాంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి. సెంట్రల్ ఆంధ్రాలో అకడమిక్ స్టాఫ్ కాలేజ్ ► బోధనా సిబ్బంది సామర్థ్యం మెరుగు పరచడానికి తిరుపతి, విశాఖపట్నంలలో ఉన్న అకడమిక్ స్టాఫ్ కాలేజీలను బలోపేతం చేయాలి. వీటితో పాటు సెంట్రల్ ఆంధ్రా పరిధిలో ఒక చోట అకడమిక్ స్టాఫ్ కాలేజీ ఏర్పాటు చేయాలి. ► కొన్ని ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు తీసికట్టుగా ఉన్నాయని.. మరికొన్ని కాలేజీలు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా కాలేజీల్లోని బోధన సిబ్బంది, వసతి, సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలి. అందులో చదివే విద్యార్థుల హాజరును మరొక ప్రమాణంగా తీసుకుని ఆయా కాలేజీలపై ఒక నిర్ణయానికి రావాలి. డ్రాపవుట్లకు తావులేకుండా చర్యలు ► పిల్లలు చదువులు ప్రారంభించిన తర్వాత ఏ దశలోనూ డ్రాప్ అవుట్ అన్న పరిస్థితే రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. పిల్లలను బడికి పంపితే చాలు.. నేరుగా తల్లి అకౌంట్లోకి అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బు జమ చేస్తోంది. టెన్త్ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్ వైపు వెళ్తున్న వారికి కూడా విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తోంది. ► మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఇతర చదువులు చదువుతున్న వారికి పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తోంది. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. అలాగే వసతి దీవెన కూడా అందిస్తున్న రాష్ట్రం ఏపీనే. ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడా చదువులు మానేయాల్సిన పరిస్థితి అన్నది లేదు. ఫలితంగా జీఈఆర్ (గరిష్ట చేరికల నిష్పత్తి) తప్పకుండా పెరుగుతుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల సాధనలో ఇవి ప్రతిబింబించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ► ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, విద్యా శాఖ సలహాదారు ఏ.సాంబశివారెడ్డి, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కేసి.రెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రతి కాలేజీలో బోధన, వసతుల పరంగా నాణ్యత పెరగాలి: సీఎం జగన్
-
జూన్ నాటికి ఉన్నత విద్యాశాఖలో పోస్టులు భర్తీ చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కే సి రెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీఎం వైఎస్ జగన్ సూచనలు ఇవే.. - డిగ్రీ విద్యార్థుల నైపుణ్యం పెంచాలి.. డిగ్రీ చదువుతున్నవారి నైపుణ్యాలను బాగా పెంచాలి. వివిధ కోర్సులను పాఠ్యప్రణాళికలో ఇంటిగ్రేట్ చేయాలి. విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి వాటిని కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ ఉండాలి. సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ కరిక్యులమ్‌లో భాగం కావాలి. ఈ తరహా కోర్సుల వలన డిగ్రీ పూర్తయ్యేనాటికి స్వయం ఉపాధి అందుతుంది. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలి. స్వయం ఉపాధిని కల్పించే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం టైఅప్ చేసుకోవాలి. రిస్క్ ఎనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలి. వచ్చే జూన్ నాటికి పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలి. - పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము. ఈ ఖాళీల భర్తీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుని జూన్ నాటికి నియామక ప్రక్రియను ప్రారంభించేలా చూడాలి. ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నాము. ఈ నేపధ్యంలో సిబ్బంది భర్తీ కూడా త్వరితగతిన చేపట్టాలి. ఆ మేరకు మరింత చురుగ్గా పనిచేయాలి. - కాలేజీల్లో ప్రమాణాలు పెరగాలి.. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రతి కాలేజీలో కూడా బోధనపరంగా, వసతులు పరంగా నాణ్యత పెరగాలి. ప్రతి విద్యా సంస్థ కూడా నాక్ అక్రిడిటేషన్ సాధించాలి. మూడేళ్లలో కాలేజీల ప్రమాణాలు పెంచుకునేలా వారికి చేయూత నివ్వాలి. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో ప్రమాణాలు పెంచుకోవాలి. మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యాసంస్థలు నాక్ అక్రిడిటేషన్ సాధించాలి. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి. అప్పుడే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుంది. - 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు.. కళాశాలల్లో కోర్సులన్నీ నేటి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలి. కళాశాలలకు అనుమతుల విషయంలో కూడా యూనిఫామ్ పాలసీ ఉండాలి. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్ అందించే బాధ్యత స్కిల్ యూనివర్సిటీ తీసుకోవాలి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలి. హై ఎండ్ స్కిల్స్‌లో భాగంగా.. సాప్ట్వేర్ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాలి. కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి. విద్యార్ధులకు సర్టిఫికేషన్ ఉంటేనే ఎంప్లాయిమెంట్ పెరుగుతుంది. ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కలిపి కరిక్యులమ్ రూపొందించాలి. సోలార్ పార్క్‌లు, సోలార్ మోటార్లు, ప్యానెల్స్ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇవి అందుబాటులో ఉండాలి. ఈ మేరకు కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలి. వచ్చే జూన్ లక్ష్యంగా ఈ తరహా కోర్సులు ఏర్పాటు చేయాలి. కొన్ని ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు తీసికట్టుగా ఉన్నాయని, మరికొన్ని కాలేజీలు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయని సమావేశంలో చర్చ జరిగింది. ఈ క్రమంలో బోధన సిబ్బంది, వసతి, సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలని, అందులో చదివే విద్యార్థుల హాజరును మరొక ప్రమాణంగా తీసుకుని ఆయా కాలేజీలపై ఒక నిర్ణయానికి రావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. బోధన సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న అకడమిక్ స్టాఫ్ కాలేజీని బలోపేతం చేయడం సహా సెంట్రల్ ఆంధ్రా పరిధిలో ఒక చోట అకడమిక్ స్టాఫ్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. - డ్రాప్ అవుట్ పరిస్థితి ఉండకూడదు.. పిల్లలు చదువులు ప్రారంభించిన తర్వాత ఏ దశలోనూ డ్రాప్ అవుట్ అన్న పరిస్థితే రాకుండా ఈ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంది. పిల్లలను బడికి పంపితే చాలు.. నేరుగా తల్లి అకౌంట్లోకి అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బు జమచేస్తోంది. టెన్త్ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్ వైపు వెళ్తున్న వారికి కూడా విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తోంది. ఇక మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఇతర చదువులు చదువుతున్న వారికి పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తోంది. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. అలాగే వసతి దీవెన కూడా అందిస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే. ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడా కూడా చదువులు మానేయాల్సిన పరిస్థితి అన్నది లేదు. ఫలితంగా జీఈఆర్ రేషియో తప్పకుండా పెరుగుతుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల సాధనలో ఇవి ప్రతిబింబించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. - యూనివర్శిటీల్లో రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయాలి. సమర్థులైన బోధనా సిబ్బందిని నియమించేందుకు, తద్వారా బోధనా ప్రమాణాలను విశ్వవిద్యాలయాల్లో పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. - ట్రిపుల్ ఐటీలపైనా సీఎం సమీక్ష ట్రిపుల్ ఐటీలలో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. చదవండి: (మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం ప్రారంభం) -
ఆర్‌సెట్‌లో ఏ, బీ కేటగిరీలకు సమానంగా సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీఆర్‌సెట్‌లో సీట్ల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. పీహెచ్డీ కోర్సుల్లోని సీట్లలో 50 శాతం ఏ–కేటగిరీలో, బీ కేటగిరీలో 50 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు జీవో నంబర్–1 విడుదల చేశారు. పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్లను గతంలో ఆయా యూనివర్సిటీలే నేరుగా నిర్వహించేవి. కానీ గత ఏడాది నుంచి అన్ని యూనివర్సిటీలకు కలిపి ఉన్నత విద్యామండలి ద్వారా ఆర్‌సెట్‌ను నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి సీట్లు కేటాయిస్తున్నారు. ఈ సీట్లను ఏ, బీ కేటగిరీలుగా భర్తీ చేస్తున్నారు. ఏ–కేటగిరీ సీట్లను జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్వహించే నెట్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్స్ (సీఎస్ఐఆర్) యూజీసీ నెట్, ఐఐటీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్), రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్టేట్ లెవల్ ఎలిజిబులిటీ టెస్ట్ (సెట్) తదితర ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన వారితో ఆర్‌సెట్‌లో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తుంటారు. ఇక బీ–కేటగిరీ సీట్లను ఆర్‌సెట్‌లో మెరిట్ సాధించిన పీజీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు కేటాయిస్తుంటారు. గతంలో ఇచ్చిన జీవో నంబర్ 45 ప్రకారం ఆర్సెట్లోని సీట్లలో ఏ–కేటగిరీ అభ్యర్థులతో 25 శాతం సీట్లను, మరో 75శాతం సీట్లను బీ–కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేసేవారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన తమకు 25 శాతం సీట్లు ఇవ్వడం వల్ల నష్టపోతున్నామని పలువురు అభ్యర్థులు విన్నవించడంతో ప్రభుత్వం రెండు కేటగిరీలకు సమానంగా సీట్లు వచ్చేలా 50 శాతం చొప్పున కేటాయింపు చేసింది. ఈ మేరకు గత జీవోను సవరిస్తూ కొత్తగా జీవో నంబర్–1ని విడుదల చేశారు. ఒక కేటగిరీలో మిగిలిన సీట్లను మరో కేటగిరీలోని అభ్యర్థుల ద్వారా భర్తీ చేసే వెసులుబాటు కల్పించారు. -
వైఎస్సార్ ఏఎఫ్‌యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్
ఏఎఫ్‌యూ: కడపలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) వైస్ చాన్సలర్ పోస్టుకు ఉన్నత విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన వారు 20 రోజుల్లోపు http:// aps che. ap. gov. in వెబ్సైట్ ద్వారా దరఖా స్తు చేసుకోవాలని సూచించింది. 2020లో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి ఓఎస్డీగా ఆచార్య డి.విజయ్కిశోర్ను నియమించగా.. ఆయన రెండేళ్లకు పైగా ఇన్చార్జి వీసీగా, ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఆయన మాతృసంస్థకు వెళ్లడంతో.. వైవీయూ వైస్ చాన్సలర్ సూర్యకళావతిని ఇన్చార్జి వీసీగా నియమించారు. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, చలమారెడ్డిపల్లె వద్ద 134 ఎకరాల్లో రూ.458 కోట్లతో నిర్మించనున్న ఈ విశ్వవిద్యాలయానికి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జూలై 7న భూమి పూజ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. -
ఏపీ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ తొలగించింది. ప్రతీ ఏటా ఇంటర్ మార్కులు ఆధారంగా ఎంసెట్‌లో 25శాతం వెయిటేజ్ ఇస్తున్న ఉన్నత విద్యామండలి.. కోవిడ్ కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఈ ఏడాది వెయిటేజ్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం ఎంసెట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే.. అగ్రికల్చర్, ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. -
తెలుగు అకాడమీ.. ఇకపై తెలుగు సంస్కృత అకాడమీ
సాక్షి, అమరావతి: తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉన్నత విద్యాశాఖ శనివారం ఉత్తర్వులిచ్చింది. దీనికి నలుగురు సభ్యులతో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసింది. ఎస్వీ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డి.భాస్కరరెడ్డి, డా.రాజకుమార్ నేరెళ్ల, డా.ఎం.విజయశ్రీ, డా.కప్పనగంతు రామకృష్ణలను గవర్నింగ్ సభ్యులుగా నియమించింది. ఎక్స్ ఆఫీషియో మెంబర్‌గా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. యూజీసీ నామినీగా తిరుపతి నేషనల్ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధరశర్మను నియమించారు. -
టాప్ టెన్‌లో నిలవాలి
రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత విద్యను పటిష్టం చేస్తున్నాం. అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్, నాడు–నేడు పనులతో విద్యా రంగం రూపురేఖలనే మార్చేస్తున్నాం. అన్ని వసతుల మధ్య పిల్లలు విద్యనభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇదే సందర్భంలో వర్సిటీ స్థాయిలో కూడా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాలి. ఇందుకు దేశంలోని టాప్ 10 వర్సిటీల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలి. అవసరమైన వాటిని మన వర్సిటీల్లో అమలు చేయాలి. మన విశ్వవిద్యాలయాలు కూడా దేశంలోని టాప్ 10 జాబితాలో నిలిచేలా కార్యాచరణ రూపొందించాలి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: యూనివర్సిటీలలో అన్ని ప్రమాణాలు పెరగాలని, దేశంలో టాప్ టెన్‌లో మన యూనివర్సిటీలు నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఐఐటీల స్థాయిలో ట్రిపుల్ ఐటీలుండాలని, అందుకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలని చెప్పారు. ఉన్నత విద్య అభివృద్ధిలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో యూనివర్సిటీలను మెరుగుపరచడంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆ దిశలోనే పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. విద్యార్థులకు మేలు చేసేలా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యా, ఆరోగ్య సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని, దీనిపై అధికారులు మూడు నాలుగు సార్లు సమావేశమై విధివిధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు అవసరమైన బిల్లులను రూపొందించి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో 70 శాతం సీట్లు కనీ్వనర్ కోటాలో, మిగిలిన 30 శాతం సీట్లు పేమెంట్ (మేనేజ్మెంట్) కోటాలో ఉండేలా ఆలోచన చేయాల్సిందిగా ఆదేశించారు. దీని వల్ల పేద విద్యార్థులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయని, అంతే కాకుండా ప్రతి కాలేజీ స్వయం సమృద్ధితో నడుస్తుందని చెప్పారు. దీంతో నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఐఆర్ఎఫ్ ప్రమాణాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ర్యాంకింగ్ ఇంకా మెరుగు పడాలి ► జేఎన్టీయూ రెండు యూనివర్సిటీలు (కాకినాడ, అనంతపురం), ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు, ట్రిపుల్ ఐటీలను ఇప్పడున్న పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితిలోకి తీసుకువెళ్లడంపై కార్యాచరణ రూపొందించండి. ► ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్ని నిధులు అవసరమో చెప్పండి. కడపలో రానున్న ఆర్కిటెక్చర్ యూనివర్శిటీపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఏయూ ప్రస్తుతం 19వ స్థానంలో, ఎస్వీ యూనివర్సిటీ 38వ స్థానంలో ఉన్నాయి. రెండేళ్లలో వీటి స్థానాలు గణనీయంగా మెరుగు పడడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టండి. ప్రతిభావంతుల ఎంపిక ► ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఉత్తమ స్థానాల్లో ఉన్న యూనివర్సిటీలలో పద్ధతులను అధ్యయనం చేయండి. మౌలిక సదుపాయాలు, బోధనా పద్ధ్దతులు, బోధనా సిబ్బంది తదితర అంశాల్లో ఆచరించాల్సిన పద్ధతులపై దృష్టి పెట్టండి. ► ప్రతిభ ఉన్న వారినే యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిగా నియమించాలి. ప్రతిభావంతులను ఎంపిక చేయడానికి తగిన చర్యలు తీసుకోండి. రిక్రూట్మెంట్ కోసం పటిష్టమైన పద్ధతులను రూపొందించండి. విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం ► విదేశాల్లోని అత్యుత్తమ యూనివర్సిటీల పద్ధతులను, విధానాలను కూడా అధ్యయనం చేసి వాటిని మన యూనిర్సిటీల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వారి పాఠ్య ప్రణాళికలను ఇక్కడ అనుసంధానం చేసుకోవడంపైనా దృష్టి పెట్టాలి. ► బోధనతో పాటు కోర్సులకు సంబంధించి విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోండి. ట్రిపుల్ ఐటీల్లో బిజినెస్ కోర్సులు ► ట్రిపుల్ ఐటీల్లో ప్రస్తుతం 22,946 మంది విద్యార్థులు ఉన్నారు. శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ ఐటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ట్రిపుల్ ఐటీలకు సంబంధించి రూ.180 కోట్లకు పైగా నిధులను మళ్లించారు. ► మళ్లీ ట్రిపుల్ ఐటీలు మెరుగు పడాలి. ఇప్పుడున్న మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలి. దీని కోసం కార్యాచరణ రూపొందించండి. ట్రిపుల్ ఐటీల్లో మంచి బిజినెస్ కోర్సులను ప్రవేశ పెట్టడంపైనా దృష్టి పెట్టండి. ఈ కోర్సులు అత్యుత్తమంగా ఉండాలి. ఇంజినీరింగ్ కోర్సులు మంచి నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించేలా చూడాలి. విద్య, ఆరోగ్య వ్యవస్థలు బావుండాలి ► రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరో 16 మెడికల్ కాలేజీలను తీసుకు వస్తున్నాం. మెడికల్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. ఆ కాలేజీలను మెరుగ్గా నిర్వహించడానికి చక్కటి విధానాలు పాటించాలి. ► విద్యా, ఆరోగ్య వ్యవస్థ బాగు పడాలనే తపనతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. అందు కోసం పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఈ సంస్థలన్నింటినీ అత్యుత్తమంగా నడుపుకునేలా చక్కటి విధానాలను తీసుకురావాలి. ► గ్రామ సచివాలయాల సిబ్బందికి ఇచ్చే శిక్షణను ట్రిపుల్ ఐటీలతో కలిసి నిర్వహించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యాక్రమాలను కూడా ట్రిపుల్ ఐటీలు నిర్వహించాలి. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్సీహెచ్ఈ) చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీ పోస్టులన్నీ 'రీ రేషనలైజేషన్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పునఃప్రారంభించడంపై ఉన్నత విద్యామండలి దృష్టి సారిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పోస్టుల భర్తీకి జారీ చేసిన జీవోలు, నోటిఫికేషన్లను న్యాయస్థానం ఇటీవల రద్దు చేయడంతో కొత్తగా ప్రక్రియను ప్రారంభించనున్నారు. గత సర్కారు ఇష్టానుసారంగా పోస్టుల హేతుబద్ధీకరణ చేపట్టడంతో న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి. ఆ లోపాలను సవరించి వర్సిటీల వారీగా పోస్టుల హేతుబద్ధీకరణ చేపట్టాలని మండలి భావిస్తోంది. రేషనలైజేషన్, రిజర్వేషన్లు, రోస్టర్ విధానం, వయోపరిమితి తదితర అంశాలపై న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం వ్యవహరిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియను చేపట్టనున్నామన్నారు. నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ వర్సిటీ పోస్టుల హేతుబద్ధీకరణపై యూజీసీ మార్గదర్శకాలతో పాటు ప్రభుత్వ నిబంధనలను పాటించనున్నారు. వర్సిటీలకే బాధ్యత అప్పగించనున్నారు. హేతుబద్ధీకరణ ముగిశాక కొత్తగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మెరిట్ అభ్యర్థులను గుర్తించేందుకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని భావిస్తున్నారు. వర్సిటీ పోస్టులను పూర్తి పారదర్శకంగా, మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలిని ఆదేశించారు. కమిటీ సిఫార్సులంటూ క్యాడర్ మార్పు రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో 1,385 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియలో గత ప్రభుత్వం అక్రమాలు, అవకతవకలకు తావిచ్చింది. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని పక్కన పెట్టి కమిటీ ద్వారా పోస్టుల హేతుబద్ధీకరణ చేసింది. కమిటీ సిఫార్సులంటూ నిబంధనలకు విరుద్ధంగా 570 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా క్యాడర్ మార్పు చేసింది. ఒక విభాగం పోస్టును మరో విభాగానికి తరలించింది. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తమ సామాజిక వర్గానికి ప్రొఫెసర్ పోస్టులు ప్రొఫెసర్ పోస్టులను తమ సామాజికవర్గం వారితో గత ప్రభుత్వ పెద్దలు భర్తీ చేయించారు. అనంతపురం జేఎన్టీయూలో 9 ప్రొఫెసర్ పోస్టులలో ఏడింటిని ఒకే సామాజికవర్గం వారితో భర్తీ చేశారు. కృష్ణా వర్సిటీలో 4 ప్రొఫెసర్ పోస్టులు, రాయలసీమ వర్సిటీలో 4 ప్రొఫెసర్ పోస్టులతోపాటు మరికొన్ని వర్సిటీల్లో కూడా తమ వారితో భర్తీ చేశారు. రేషనలైజేషన్ జీవోలు, నోటిఫికేషన్లను న్యాయస్థానం రద్దు చేసినందున ఈ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు కూడా రద్దు కానున్నాయి. -
100% ఫీజు రీయింబర్స్మెంట్
‘పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం..’ అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తు.చ. తప్పకుండా అమల్లోకి తెస్తూ బడుగు, బలహీనవర్గాలు, దళిత, గిరిజన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపి కబురందించారు. వృత్తి విద్యసహా ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్ధుల ఫీజులను పూర్తిస్థాయిలో 100 శాతం రీయింబర్స్మెంట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి జగన్ సంతకం చేసిన నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల ఫీజులపై జీవో 38 విడుదల చేసింది. – సాక్షి, అమరావతి ఈ విద్యా సంవత్సరానికి గతేడాది ఫీజులే.. రాష్ట్రంలో విద్యారంగ సంస్కరణలపై ప్రభుత్వం నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కాలేజీ ఫీజులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని నియమించింది. విద్యా సంస్థల్లో ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, ఫీజులు తదితర అంశాలపై కమిటీ క్షుణ్నంగా అధ్యయనం చేస్తోంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రమాణాల పరిశీలన, ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కోసం చట్టబద్ధమైన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మధ్యంతర ఫీజులను ప్రకటించింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఫార్మాడీ, ఫార్మాడీ (పీబీ), బీఆర్క్, బీ.ఫార్మా, ఎం.ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2018–19 విద్యాసంవత్సరానికి అమలు చేసిన ఫీజులే 2019–20 విద్యా సంవత్సరానికి కూడా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎంసెట్ వెబ్ ఆప్షన్లకు కసరత్తు 2018–19 ఫీజులే ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల ప్రవేశాలను సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని జీవోలో పేర్కొన్న నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఎంసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఫీజులు 30 శాతం పెంచిన టీడీపీ సర్కారు టీడీపీ అధికారంలో ఉండగా కాలేజీల యాజమాన్యాలకు మేలు కలిగేలా ఫీజులను 30 శాతం మేర పెంచింది. అదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మాత్రం పెంచకపోవడం గమనార్హం. రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసింది. అదిపోగా మిగతా భారం మొత్తం విద్యార్ధి భరించాల్సి వచ్చేది. ఫలితంగా ఒక్కో విద్యార్థి కుటుంబం కోర్సు పూర్తయ్యే సరికి రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షలకు వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయేది. యాజమాన్యాలు అడిగిందే తడవుగా సరైన పరిశీలన చేయకుండానే గత ప్రభుత్వం ఫీజులను పెంచిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు కనిష్ట ఫీజు రూ.35 వేల నుంచి రూ.60 వేల లోపు ఉండే కాలేజీలు 225కిపైగా ఉండగా వాటి సంఖ్య ఏకంగా 25 వరకు పడిపోయింది. రూ.70 వేలనుంచి రూ.లక్ష లోపు ఫీజులు వసూలు చేసే కాలేజీల సంఖ్య ఏకంగా 200కి పెరిగింది. ఎం.ఫార్మాలో కనిష్ట ఫీజు రూ.64 వేలు ఉన్న కాలేజీ ఒక్కటి మాత్రమే కాగా మిగతా కాలేజీల్లో రూ.1.10 లక్షలకు పైగానే ఫీజులను చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇక గత ఎన్నికలకు ముందు ఫీజు రీయింబర్స్‌మెంటును రూ.45 వేలకు పెంచుతామంటూ ఒక జీవోను విడుదల చేసి విద్యార్ధులను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి గత ప్రభుత్వం రూ.35 వేల ఫీజు రీయింబర్స్‌మెంటును కూడా కాలేజీలకు చెల్లించకపోవడంతో రూ. వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. పూర్తి ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఇప్పటికే కోర్సు పూర్తిచేసి కొలువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులు సర్టిఫికెట్లు అత్యవసరం కావడంతో అప్పు చేసి చెల్లిస్తున్నారు. తల్లిదండ్రులకు ఎంతో ఊరట పేద విద్యార్థుల చదువులకు అండగా ఉండేందుకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ చదువుల కోసం అప్పుల ఊబిలో కూరుకుపోయే దుస్థితి తల్లిదండ్రులకు తప్పుతుందని విద్యార్ధులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫీజులెలా చెల్లించాలని ఆందోళన చెందకుండా చదువులపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంటున్నారు. మరోపక్క ఫీజులతో పాటు విద్యార్ధుల వసతి, భోజనాలకోసం ఏటా రూ.20 వేలు చొప్పున చెల్లించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో విద్యార్ధుల చదువులపై తల్లిదండ్రులకు భరోసా ఏర్పడుతోంది. ప్రమాణాలు పాటించని కాలేజీలు ప్రస్తుత ఫీజుల నిర్ధారణ విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కనీస ప్రమాణాలు పాటించకపోవడంతోపాటు మౌలిక సదుపాయాలూ లేని కాలేజీలకు రూ.లక్షల్లో ఫీజులను నిర్ణయించడంపై తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఏఐసీటీఈ నిబంధనలను కాలేజీలు పట్టించుకోవడం లేదు. ఫీజులు, ప్రవేశాల నియంత్రణ మండలికి తప్పుడు పత్రాలు సమర్పించి ఫీజులను పెంచుకుంటున్నాయనే విమర్శలున్నాయి. ఒకే రకమైన కోర్సును బోధించే కాలేజీల ప్రమాణాల్లో వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. విద్యార్ధులకు సమాన విద్యావకాశాలు కల్పించాలన్న రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు ఇది ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో అన్ని కాలేజీలు సమాన ప్రమాణాలు పాటించాలని, ఒకే రకమైన నిర్వహణ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విద్యాసంవత్సరం వరకు గత ఏడాది ఫీజులనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల అనంతరం కొత్త ఫీజుల విధానం అమల్లోకి రానుంది. -
వీసీల ఎంపికకు సెర్చ్ కమిటీలు
ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీలకు వైస్ చాన్స్లర్లను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీల్లో ఒకరిని వర్సిటీ పాలకమండలి నామినీగా, మరొకరిని యూజీసీ నామినీగా, ఇంకొకరిని ప్రభుత్వ నామినీగా నియమిస్తూ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య గురువారం జీవోలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్నత విద్యా శాఖ వీసీ పోస్టుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటి వరకు 60 వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఒక్కో వర్సిటీ వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను సెర్చ్ కమిటీలు పరిశీలించి ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం పంపించనున్నాయి. మరోవైపు శాతవాహన వర్సిటీ వీసీ ఎంపికకుగానూ త్వరలోనే సెర్చ్ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. వర్సిటీలవారీగా సెర్చ్ కమిటీల్లో సభ్యులు ఉస్మానియా వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, యూజీసీ నామినీగా ఇగ్నో మాజీ వీసీ ప్రొఫెసర్ హెచ్‌పీ దీక్షిత్, ప్రభుత్వ నామినీగా ఆర్థిక శాఖ కార్యదర్శి కె.రామకృష్ణారావు. కాకతీయ వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్, యూజీసీ నామినీగా భారతీ విద్యా పీఠ్ వీసీ ప్రొఫెసర్ శివాజీరావు, ప్రభుత్వ నామినీగా విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య. పాలమూరు విశ్వవిద్యాలయం: వర్సిటీ నామినీగా ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశరావు, యూజీసీ నామినీగా యూజీసీ సభ్యుడు డాక్టర్ వీఎస్ చౌహాన్, ప్రభుత్వ నామినీగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య. మహాత్మాగాంధీ వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు, యూజీసీ నామినీగా యూజీసీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ దేవరాజ్, ప్రభుత్వ నామినీగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం: వర్సిటీ నామినీగా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు, యూజీసీ నామినీగా యూజీసీ సభ్యుడు డాక్టర్ వీఎస్ చౌహాన్, ప్రభుత్వ నామినీగా రంజీవ్ ఆర్ ఆచార్య. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశరావు, యూజీసీ నామినీగా హర్యానా సెంట్రల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుహాడ్, ప్రభుత్వ నామినీగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ: విశ్వవిద్యాలయం నామినీగా ఆ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్, యూజీసీ నామినీగా ఇగ్నో మాజీ వీసీ ప్రొఫెసర్ హెచ్‌పీ దీక్షిత్, ప్రభుత్వ నామినీగా ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు. తెలంగాణ విశ్వవిద్యాలయం: వర్సిటీ నామినీగా కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్ లింగమూర్తి, యూజీసీ నామినీగా కలకత్తా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సురంజన్ దాస్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉంటారు.