సాక్షి, విజయవాడ: బిఏ ఓరియెంటల్ లాంగ్వేజ్(ఓల్) పూర్తి చేసిన వారికి బీఈడీలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ అభినందించారు.
బిఈడి సోషల్ స్టడీస్ మెథడాలజీలోకి ప్రవేశం కల్పించేందుకు అనుమతి, అర్హత ఉన్న అభ్యర్థులకు ఏపీఎడ్ సెట్ దరఖాస్తుల గడువును మే 15 వరకు పొడిగింపు, జూన్ మూడో వారంలో ఈ పరీక్ష నిర్వహణకు సన్నాహాలు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్ర సారస్వత పరిషత్, ఓరియంటల్ విద్యార్థుల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి , కమిషనర్ సురేష్ నాయర్, ఏపీఎడ్ సెట్ కన్వీనర్ సుధీర్‌రెడ్డిలకు పరిషత్ ధన్యవాదాలు తెలిపింది.
చదవండి: ‘చిరు’ధాన్యాల సాగుకు పెద్ద ప్రోత్సాహం
Comments
Please login to add a commentAdd a comment