ఏఎఫ్‌యూ: కడపలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) వైస్ చాన్సలర్ పోస్టుకు ఉన్నత విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన వారు 20 రోజుల్లోపు http:// aps che. ap. gov. in వెబ్‌సైట్ ద్వారా దరఖా స్తు చేసుకోవాలని సూచించింది.
2020లో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి ఓఎస్‌డీగా ఆచార్య డి.విజయ్‌కిశోర్‌ను నియమించగా.. ఆయన రెండేళ్లకు పైగా ఇన్‌చార్జి వీసీగా, ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఆయన మాతృసంస్థకు వెళ్లడంతో.. వైవీయూ వైస్ చాన్సలర్ సూర్యకళావతిని ఇన్‌చార్జి వీసీగా నియమించారు.
ఈ నేపథ్యంలో ఏఎఫ్‌యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, చలమారెడ్డిపల్లె వద్ద 134 ఎకరాల్లో రూ.458 కోట్లతో నిర్మించనున్న ఈ విశ్వవిద్యాలయానికి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జూలై 7న భూమి పూజ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
వైఎస్సార్ ఏఎఫ్‌యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్
Published Wed, Jun 8 2022 5:39 AM | Last Updated on Wed, Jun 8 2022 8:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment