ట్రిబ్యునల్‌లకు కత్తెర!
న్యూఢిల్లీ: పెద్ద సంఖ్యలో ఉన్న వివిధ ట్రిబ్యునళ్లకు కత్తెర వేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. గందరగోళానికి కారణమయ్యే అనవసర, అడ్డగోలు చట్టాలను రద్దుచేయాలనే ప్రధాని మోదీ విధానాలకు అనుగుణంగా... ఒకే విధమైన విధులు నిర్వర్తిస్తున్న ట్రిబ్యునల్‌లను విలీనం లేదా రద్దుచేసే ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ పరిధిలోని న్యాయ వ్యవహారాల విభాగం .. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు లేఖ రాసింది. ప్రస్తుతమున్న ట్రిబ్యునళ్ల, వాటిలో ఒకేవిధమైన విధులు నిర్వర్తిస్తున్న ట్రిబ్యునళ్లను విలీనం చేయడంపై సాధ్యాసాధ్యాలతో కూడిన వివరాలను అందజేయాలని కోరింది. దేశంలో దాదాపు 35 ట్రిబ్యునళ్లు ఉన్నాయి.