additional judges
-
హైకోర్టులో ఇవాళ ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-
హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణ రంజన్ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ముగ్గురి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లు వీరు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. తరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి 26 మంది ఉన్నారు. ఈ ముగ్గురి నియామకంతో ఆ సంఖ్య 29కి చేరింది. దీంతో మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్‌కు ఉత్తరాఖండ్ సీజేగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.పంపింది ఆరుగురి పేర్లు..హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది మే15న ఆరుగురు న్యాయవాదులు మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్, ఇడంకంటి కోటిరెడ్డి, గోడె రాజాబాబు, గేదెల తుహిన్ కుమార్ పేర్లను న్యాయమూర్తుల పోస్టులకి సిఫారసు చేసింది. ఈ సిఫారసులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన కొలీజియం చర్చించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసి, ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ఉన్న వారి నుంచి కూడా కొలీజియం అభిప్రాయాలు తీసుకుంది. అనంతరం హైకోర్టు ప్రతిపాదించిన ఆరుగురిలో మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్‌కు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. వారిని న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తూ ఈ నెల 15న తీర్మానం చేసింది. వీరి నియామకాన్ని ఆమోదించిన కేంద్రం.. వారి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో వారి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ ముగ్గురు ఎప్పుడు ప్రమాణం చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. శనివారం లేదా సోమవారం ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.మహేశ్వరరావు కుంచంకుంచం కోటేశ్వరరావు, సుశీలమ్మ దంపతులకు 1973 ఆగస్టు 12న తిరుపతిలో జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా మహేశ్వరరావు అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1998లో తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1998 నుంచి 2001 వరకు అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద ఆరు నెలల పాటు జూనియర్‌గా ప్రాక్టీస్ చేశారు. అనంతరం స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, యునైటెడ్ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ, శ్రీరాం గ్రూప్ ఆఫ్ కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.చల్లా గుణరంజన్చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు 1976 జూలై 12న జన్మించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి స్వస్థలం. తండ్రి నారాయణ కూడా న్యాయవాదే. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఈయనకు సోదరుడి వరుస అవుతారు. గుణరంజన్ 2001లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సోదరుడైన కోదండరామ్ వద్దే జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కోదండరామ్ జడ్జి అయిన తరువాత ఆయన ఆఫీసును గుణ రంజన్ విజయవంతంగా నడిపించారు.సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో, పలు ట్రిబ్యునళ్ల ముందు పలు కేసుల్లో వాదనలు వినిపించారు. పర్యావరణ, విద్యుత్, ఆర్బిట్రేషన్, కంపెనీ లా, దివాళా, పన్నుల చట్టాలతో పాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. పలు సంస్థలకు న్యాయ సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు.తూట చంద్ర ధనశేఖర్తూట శైలజ, చంద్రశేఖరన్ దంపతులకు 1975 జూన్ 10న జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం. తండ్రి చంద్రశేఖరన్ గతంలో చిత్తూరు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. సత్యవేడు జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో చదివారు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో లా పూర్తి చేశారు. ధనశేఖర్ 1999లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జీపీగా కొనసాగుతున్నారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. -
3 హైకోర్టులకు 13 మంది అదనపు న్యాయమూర్తుల నియామకం
అలహాబాద్, కర్నాటక, మద్రాస్ హైకోర్టుల్లో 13 మంది అదనపు జడ్జీలు నియమితులయ్యారు. వీరిలో 11 మంది లాయర్లు కాగా ఇద్దరు న్యాయాధికారులు. వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం జనవరిలో సిఫార్సు చేసింది. వీరిలో మద్రాస్ హైకోర్టు న్యాయవాది లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి బీజేపీతో సంబంధాలున్నాయనే ఆరోపణ వివాదం రేపింది. ఈమె పేరును సిఫార్సు చేయడాన్ని మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. బార్‌కు చెందిన 21 మంది లాయర్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ‘‘తాను బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శినంటూ గౌరీ అంగీకరించారు. మైనారిటీలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. మత ఛాందస భావాలున్న ఆమె న్యాయమూర్తిగా అనర్హురాలు’’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 10న విచారణ జరగాల్సి ఉంది. దానిపై మంగళవారమే విచారణ చేపడతామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. పార్టీలతో సంబంధాలున్న వారూ జడ్జీలు కావచ్చని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు అనడం తెలిసిందే. -
హైకోర్టుకు అదనపు జడ్జీల నియామకం
హైదరాబాద్: హైకోర్టుకు గురువారం అదనపు జడ్జీల నియామకం జరిగింది. అదనపు జడ్జీలుగా నియామకం అయినవారిలో రామలింగేశ్వరరావు, శివశంకర్ రావు, సీతారామమూర్తి, రవికుమార్, దుర్గా ప్రసాద్ రావు, సునీల్ చక్రవర్తి, సత్యనారాయణ మూర్తి, సునీల్ కిషోర్, శంకర్ నారాయణ, మతి అనీష్ ఉన్నారు. -
అదనపు జడ్జీల పదవీకాలం 3 నెలల పొడిగింపు
హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొమ్మిది మంది న్యాయమూర్తులకు అదనపు జడ్జీలుగా పొడిగింపు లభించింది. దీంతో వారు అదనపు జడ్జీలుగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పొడిగింపు లభించిన వారిలో జస్టిస్ బి.శివశంకరరావు, జస్టిస్ ఎం.సీతారామ్మూర్తి, జస్టిస్ ఎస్.రవికుమార్, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్, జస్టిస్ ఎ.శంకర నారాయణ, జస్టిస్ అనిస్‌లు ఉన్నారు. మరో మూడు నెలల పాటు వీరు అదనపు జడ్జీలుగా కొనసాగుతారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చెల్లదంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న వారికి పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తుల హోదా ఇచ్చేందుకు కొలీజియం సమావేశమై చర్చించి, తగిన నిర్ణయం తీసుకునేంత వ్యవధి లేకపోవడంతో అదనపు న్యాయమూర్తులుగా ఉన్న వారికి మరో మూడు నెలల పాటు అదనపు జడ్జీలుగా పొడిగింపునిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు నెలల తరువాత వీరికి శాశ్వత న్యాయమూర్తి హోదా లభించే అవకాశం ఉంది. -
హైకోర్టు అదనపు జడ్జీలుగా 9 మంది ప్రమాణం
రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా తొమ్మిది వుంది బుధవారం ప్రవూణ స్వీకారం చేశారు. జస్టిస్ బులుసు శివశంకర్, మంథాట సీతారామమూర్తి, సరిపెళ్ల రవికుమార్, ఉప్మాక దుర్గాప్రసాద రావు, తాళ్లూరి సునీల్ చౌదరి, మల్లవోలు సత్యనారాయణమూర్తి, మిస్రిలాల్ సునీల్ కిశోర్ జైశ్వాల్, అంబటి శంకర నారాయణ, అనీస్‌ల చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా ప్రమాణం చేయించారు. బుధవారం ఉదయం పదిన్నరకు జరిగిన ప్రవూణ స్వీకార కార్యక్రవూనికి హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులతో పాటు కొత్త జడ్జీల కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యూరు. అనంతరం జస్టిస్ రోహిణితో కలసి జస్టిస్ సునీల్ చౌదరి, జస్టిస్ అశుతోష్ మొహంతాతో కలసి జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డితో కలసి జస్టిస్ జైశ్వాల్, జస్టిస్ సుభాష్‌రెడ్డితో కలసి జస్టిస్ శంకరనారాయణ, జస్టిస్ కేసీ భానుతో కలిసి జస్టిస్ అనీస్ కేసుల విచారణలో పాలుపంచుకున్నారు. మిగిలిన నలుగురు న్యాయువుూర్తులు సింగిల్ జడ్జిలుగా కేసులను విచారించారు. -
హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణం
హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన తొమ్మిది మంది బుధవారం ప్రమాణం చేశారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయించారు. జిల్లా జడ్జీలుగా ఉన్న 9 మందిని పదోన్నతిపై హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బులుసు శివశంకరరావు, ఎం.సీతారామమూర్తి, సరిపెళ్ల రవికుమార్, ఉప్మాక దుర్గాప్రసాదరావు, తాళ్లూరి సునీల్ చౌదరి, మల్లవోలు సత్యనారాయణమూర్తి, మిస్రిలాల్ సునీల్ కిషోర్ జైస్వాల్, అంబటి శంకర నారాయణ, అనీస్ అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసినవారిలో ఉన్నారు.