విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ, తెలంగాణలో జూన్, జూలైలో నిర్వహించిన బీఎస్సీ (నాలుగేళ్లు, రెండేళ్ల పోస్టు బేసిక్) నర్సింగ్ డిగ్రీ ఫలితాలను మంగళవారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. కాగా విద్యార్థులు తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం ఈ నెల 10 లోగా సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి విజయకుమార్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఎస్వీ వర్సిటీ పరిధిలోని మొదటి నుంచి నాలుగో సంవత్సరం విద్యార్థులతోపాటు, పోస్టు బేసిక్ నర్సింగ్ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 29న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో హాజరుకావాలని తెలిపారు.
అలాగే ఏయూ పరిధిలోని విద్యార్థులు ఈ నెల 30న, ఓయూ (తెలంగాణ) విద్యార్థులు 31న తమ హాల్‌టికెట్, కళాశాల గుర్తింపు కార్డుతో ఉదయం 11గంటలకు వర్సిటీలో హాజరవ్వాలన్నారు. ఈ బీఎస్సీ ఫలితాలు, మరిన్ని వివరాలను (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
బీఎస్సీ నర్సింగ్ ఫలితాలు విడుదల
Published Wed, Aug 3 2016 1:22 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement