పీజీ మెడికల్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ | Scheduele for PG medical second councelling releases | Sakshi
Sakshi News home page

పీజీ మెడికల్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్

Published Sat, May 7 2016 9:12 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

Scheduele for PG medical second councelling releases

విజయవాడ: ఏపీలో పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈనెల 11న సర్వీస్ అభ్యర్థులకు, 16, 17 తేదీల్లో నాన్-సర్వీస్ అభ్యర్థులకు రెండో విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురాధ తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని ఆయా అభ్యర్థులు పైన తెలిపిన తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని కోరారు.

ఇంతకుముందు ఒరిజినల్ సర్టిఫికె ట్ల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు నేరుగా ఆప్షన్లను పెట్టుకోవచ్చని వెల్లడించారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్లలో పొందవచ్చు. తెలంగాణకు సంబంధించి రెండో విడత పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని రిజిస్ట్రార్ అనురాధ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement