second councelling
-
నేటి నుంచి రెండో దఫా కౌన్సెలింగ్
జేఎన్టీయూ: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో దఫా కౌన్సెలింగ్ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేశవచంద్ర తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురం, ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావచ్చన్నారు. 22వ తేదీతో కౌన్సెలింగ్ ముగుస్తుందన్నారు. ఇప్పటికే తొలి దఫా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనవారు, రెండో దఫా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సిన అవసరం లేదన్నారు. అవసరం అనుకుంటే కేవలం వెబ్ ఆప్షన్లు మాత్రమే మార్చుకోవచ్చునని సూచించారు. 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి షెడ్యూల్‌ను నిర్ధేశించారని పేర్కొన్నారు. -
పీజీ మెడికల్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్
విజయవాడ: ఏపీలో పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈనెల 11న సర్వీస్ అభ్యర్థులకు, 16, 17 తేదీల్లో నాన్-సర్వీస్ అభ్యర్థులకు రెండో విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురాధ తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని ఆయా అభ్యర్థులు పైన తెలిపిన తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని కోరారు. ఇంతకుముందు ఒరిజినల్ సర్టిఫికె ట్ల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు నేరుగా ఆప్షన్లను పెట్టుకోవచ్చని వెల్లడించారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లలో పొందవచ్చు. తెలంగాణకు సంబంధించి రెండో విడత పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని రిజిస్ట్రార్ అనురాధ తెలిపారు.