విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో నాన్ సర్వీస్, ఇన్‌సర్వీస్ సర్టిఫికెట్ల పరిశీలన ఆదివారంతో ముగిసింది. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన తెలంగాణ, ఏపీకి చెందిన దివ్యాంగ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా ఆదివారం ముగిసింది. ఏపీ అభ్యర్థులకు సంబంధించి హైదరాబాద్ జేఎన్‌టీయూలో 151, ఏయూలో 72, ఎస్వీ యూనివర్సిటీలో 49, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 379 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
తెలంగాణ కేఎన్‌ఆర్ యూనివర్సిటీ కింద జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో 430, కాకతీయ యూనివర్సిటీలో 47, ఎన్టీఆర్ యూనివర్సిటీలో 223 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో కలిపి దివ్యాంగులకు జరిగిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో 20 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తెలంగాణలో నాన్ సర్వీస్ అభ్యర్థులకు జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సోమవారం 1,001 నుంచి 4వేల ర్యాంకుల వరకు ఆహ్వానించారు.
ముగిసిన పీజీ మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Published Mon, Apr 25 2016 4:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM
Advertisement
Advertisement