ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ రవిరాజ్
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించడంతోపాటు విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేయాలన్న నిర్ణయానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పాలకమండలి ఆమోదం తెలిపింది. పాలకమండలి 220వ సమావేశం మంగళవారమిక్కడ జరిగింది.
వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాల కొండయ్య, డీఎంఈ టి.వేణుగోపాలరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ సోమరాజు పాల్గొన్నారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. వైద్యవిద్యకు సంబంధించిన కోర్సును లోడు చేసిన ట్యాబ్‌లను ఫస్టియర్ నుంచి థర్డ్ ఇయర్ విద్యార్థులకు అందజేయాలని నిర్ణయించామన్నారు. అన్ని వైద్య కళాశాలల్లో వైఫై సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వర్సిటీ రిజిస్ట్రార్ నియామకంపై చర్చించామని, తుది నిర్ణయాన్ని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ పోస్టుకు పదిమంది దరఖాస్తు చేసుకోగా, నలుగురికి తగిన అర్హతలున్నట్లు వెల్లడించారు.
వైద్య విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు
Published Wed, Apr 20 2016 1:26 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement