సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 147 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. జాతీయ మెడికల్ కమి షన్ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల మేరకు.. 69 ఏళ్ల వయసున్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ మేరకు వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి నోటిఫికే షన్‌లో పేర్కొన్నారు.
ఈ పోస్టులకు ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అదే రోజున తుది జాబితా ప్రకటిస్తారు. ఎంపికైనవారు ఈ నెల 23వ తేదీ నాటికి ఆయా చోట్ల చేరాల్సి ఉంటుంది. ఏడాది పాటు ఆయా కాలేజీలు, ఆస్పత్రుల్లో ప్రొఫె సర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా కాంట్రాక్టు విధానంలో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికలో తెలంగాణకు చెందినవారికి ప్రాధాన్యమిస్తారు. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థుల వయసు 69 ఏళ్లు దాటకూడదు.
రూ. లక్షా 90 వేల వరకు వేతనం
అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు నెలకు రూ.50 వేలు వేత నం ఇస్తారు. మిగతా విభాగాల అసోసియేట్ ప్రొఫె సర్లకు రూ.లక్షన్నర, ప్రొఫెసర్లకు రూ.1.90 లక్షలు ఇస్తారు. ఇవి కాంట్రాక్టు నియామకాలు కావడం వల్ల.. ఆయా పోస్టులకు ప్రమోషన్లు, రెగ్యులర్ నియామకాలు జరిగితే వీరిని తొలగిస్తారు. అనాట మీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున భర్తీ చేస్తారు.
ఫిజియాలజీలో 9 ప్రొఫె సర్, ఏడు అసోసియేట్ ప్రొఫెసర్.. బయోకెమి స్ట్రీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున.. ఫార్మకాలజీలో ఏడు అసోసియేట్, పాథాలజీలో 9 అసోసియేట్, మైక్రోబయాలజీలో ఏడు అసోసియేట్, జనరల్ మెడిసిన్‌లో 9 ప్రొఫె సర్, డెర్మటాలజీలో 4 అసోసియేట్, సైకియాట్రీలో 9 అసోసియేట్, రెస్పిరేటరీ మెడిసిన్‌లో ఐదు అసోసియేట్, జనరల్ సర్జరీలో 9 ప్రొఫెసర్, ఆర్థోపెడిక్స్‌లో 9 అసోసియేట్, గైనకాలజీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 9 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment