
రూ. 70 లక్షలకు రిటైర్డ్ అడిషనల్ డీజీ టోపీ!
హైదరాబాద్: ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని మోసగించిన ఓ రిటైర్డ్ పోలీసు అధికారిపై బుధవారం కేసు నమోదు అయింది. వివరాలు.. ఓఎన్‌జీసీలో పనిచేస్తున్న ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఎంబీబీఎస్ సీటుకోసం రిటైర్డ్ అడిషనల్ డీజీ మదన్‌లాల్‌ను ఆశ్రయించాడు. రూ. 70 లక్షలు ఇస్తే మెడిసిన్ సీటు ఇప్పిస్తానని మదన్ లాల్ నమ్మబలికాడు. దాంతో ఉదయ్ కుమార్ అతడు అడిగిన మొత్తం రూ. 70 లక్షలను ముట్టజెప్పాడు.
అయితే సీటు ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వమని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో బాధితుడు హైటెక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉదయకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 403, 406, 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.