Additional dg
-
ఆ వివరాలను కేంద్రం తప్పుగా ప్రకటించింది: షికా గోయల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మిస్సైన మహిళలు, బాలికల వివరాలను కేంద్రంగా తప్పుగా ప్రకటించిందని ఉమెన్స్ సేఫ్టీ అడిషనల్ డీజీ షికా గోయల్ అన్నారు. 99 శాతం మిస్సవుతున్న కేసుల్లో సీరియస్ కారణాలు లేవని.. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు ఆర్థిక సమస్యలతోనే అదృశ్యమవుతున్నారని గోయల్ పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణలో మిస్సవుతున్న వారి రికవరీ 87 శాతం. మిస్సవుతున్న వారి కోసం స్పెషల్ సెల్ ద్వారా. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసింది. మహిళల భద్రతకు భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు 24 గంటలూ పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. చదవండి: బీఆర్ఎస్లోకి వెళ్తున్నారంటూ వార్తలు.. లేఖలో అసలు విషయం చెప్పిన ఉత్తమ్ -
‘విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు’
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాతంగా జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సీసీ కెమరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద అదనపు బలగాలను కూడా మోహరించామని అన్నారు. పాస్‌లు ఉన్నవారినే కౌంటింగ్ సెంటర్లలోనికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అన్ని కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని కోరారు. సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి 2014లో 1600కు పైగా కేసులు నమోదు కాగా, ఈ సారి 1500కు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డికి భద్రత కల్పించాలని ఆ పార్టీ నేతలు డీజీపీని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. కౌంటింగ్ సెంటర్లలోకి సెల్‌ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. -
రూ. 70 లక్షలకు రిటైర్డ్ అడిషనల్ డీజీ టోపీ!
హైదరాబాద్: ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని మోసగించిన ఓ రిటైర్డ్ పోలీసు అధికారిపై బుధవారం కేసు నమోదు అయింది. వివరాలు.. ఓఎన్జీసీలో పనిచేస్తున్న ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఎంబీబీఎస్ సీటుకోసం రిటైర్డ్ అడిషనల్ డీజీ మదన్‌లాల్‌ను ఆశ్రయించాడు. రూ. 70 లక్షలు ఇస్తే మెడిసిన్ సీటు ఇప్పిస్తానని మదన్ లాల్ నమ్మబలికాడు. దాంతో ఉదయ్ కుమార్ అతడు అడిగిన మొత్తం రూ. 70 లక్షలను ముట్టజెప్పాడు. అయితే సీటు ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వమని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో బాధితుడు హైటెక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉదయకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 403, 406, 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సింగపూర్ వెళ్లిన చంద్రబాబు
-
బాలిక హత్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం...
వినుకొండ : ముక్కుపచ్చలారని బాలికపై అతి కిరాతంగా లైంగికదాడి జరిపి, హత్య చేసిన సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని సీబీసీఐడీ అడిషనల్ డీజీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వినుకొండ పట్టణ శివారు రాజీవ్ రజక కాలనీకి చెందిన మైనర్ బాలిక లక్ష్మీతిరుపతమ్మ ఇంటి వద్ద ఆడుకుంటుండగా అపహరణకు గురైన బాలిక 14వ తేదీన శావల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామ సమీపంలోని నక్కలగండివాగు వద్ద మృతదేహమై కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం విధితమే. ఈ ఘటనపై స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తక్షణమే విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో సీబీసీఐడి అడిషన్ డీజీ తిరుమలరావు సిబ్బందితో కలిసి శావల్యాపురం మండలం కనుమర్లపూడి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని రాజీవ్ రజక కాలనీలోని బాలిక పెంపుడు తల్లి లింగమ్మను విచారించారు. సంఘటనకు ముందుగా జరిగిన విషయాలను అడిగి తెల్సుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంకటేశ్వర్లును పట్టణ పోలీసు స్టేషన్లో ఆయన విచారించారు. అదేవిధంగా బాలిక శవాన్ని పోస్టు మార్టం నిర్వహించిన డాక్టర్ లక్ష్మణరావును వివరాలు అడిగి తెల్సుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విచారణకు సంబంధించి జిల్లా రూరల్ ఎస్పీకి పలు సూచనలు చేశామని, ఆ దిశగా విచారణ చేయాలని సూచించినట్లు చెప్పారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్‌తో మాట్లాడామని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్పీ సత్యనారాయణ, ఐజీ రామకృష్ణ, సీఐడీ డిఎస్పీ రఘు, నర్సరావుపేట డిఎస్పీ డి ప్రసాదు, సీఐడీ సీఐ శివప్రసాదు, లీగల్ అడ్వైజర్ తదితరులు ఉన్నారు.