సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మిస్సైన మహిళలు, బాలికల వివరాలను కేంద్రంగా తప్పుగా ప్రకటించిందని ఉమెన్స్ సేఫ్టీ అడిషనల్ డీజీ షికా గోయల్ అన్నారు. 99 శాతం మిస్సవుతున్న కేసుల్లో సీరియస్ కారణాలు లేవని.. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు ఆర్థిక సమస్యలతోనే అదృశ్యమవుతున్నారని గోయల్ పేర్కొన్నారు.
గత నాలుగేళ్లుగా తెలంగాణలో మిస్సవుతున్న వారి రికవరీ 87 శాతం. మిస్సవుతున్న వారి కోసం స్పెషల్ సెల్ ద్వారా. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసింది. మహిళల భద్రతకు భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు 24 గంటలూ పనిచేస్తున్నారని ఆమె తెలిపారు.
చదవండి: బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారంటూ వార్తలు.. లేఖలో అసలు విషయం చెప్పిన ఉత్తమ్
Comments
Please login to add a commentAdd a comment