missing women
-
ఆ వివరాలను కేంద్రం తప్పుగా ప్రకటించింది: షికా గోయల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మిస్సైన మహిళలు, బాలికల వివరాలను కేంద్రంగా తప్పుగా ప్రకటించిందని ఉమెన్స్ సేఫ్టీ అడిషనల్ డీజీ షికా గోయల్ అన్నారు. 99 శాతం మిస్సవుతున్న కేసుల్లో సీరియస్ కారణాలు లేవని.. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు ఆర్థిక సమస్యలతోనే అదృశ్యమవుతున్నారని గోయల్ పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణలో మిస్సవుతున్న వారి రికవరీ 87 శాతం. మిస్సవుతున్న వారి కోసం స్పెషల్ సెల్ ద్వారా. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసింది. మహిళల భద్రతకు భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు 24 గంటలూ పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. చదవండి: బీఆర్ఎస్లోకి వెళ్తున్నారంటూ వార్తలు.. లేఖలో అసలు విషయం చెప్పిన ఉత్తమ్ -
మహిళల మిస్సింగ్ కేసుల్లో ఆ రాష్ట్రమే టాప్.. కీలక విషయాలు వెల్లడించిన కేంద్రం
ఢిల్లీ: దేశంలో మహిళల మిస్సింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. దేశంలో మహిళల మిస్సింగ్ కేసుల్లో మహారాష్ట్ర టాప్ ఉందని రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా గణాంకాలను లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2021 లో మహారాష్ట్రలో 56,498 మంది మహిళలు అదృశ్యం అవ్వగా, మిస్సింగ్ కేసుల్లో టాప్ 5 రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, అస్సాం ఉన్నాయి. తెలంగాణలో 2021లో 12834 మంది మహిళలు అదృశ్యం కాగా, 2021లో ఏపీలో 8969 మహిళలు అదృశ్యం అయినట్లు కేంద్రం పేర్కొంది. -
నరబలి కేసు: ఆ 26 మంది మహిళల ‘మిస్సింగ్’ వెనుక షఫీ హస్తం?
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన కేరళలోని పతనంతిట్ట జిల్లా నరబలి కేసు దర్యాప్తులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ చేతిలో చాలా మంది బలైపోయినట్లు తెలుస్తోంది. నరబలి కేసు బయటపడిన క్రమంలో కనిపించకుండా పోయిన మహిళల కుటుంబాలు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నాయి. వారు కనిపించకుండా పోవటం వెనక నరబలి నిందితుడు షపీ హస్తం ఉండి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఎలంతూర్ గ్రామంలో ఇద్దరు మహిళలను బలిచ్చిన కేసులో షఫీ, భగవల్ సింగ్, అతడి భార్య లైలాను అక్టోబర్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కనిపించకుండా పోయిన మహిళల విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు.. వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అలప్పుజా జిల్లాలో 2013 నుంచి కనిపించకుండా పోయిన బింధు పద్మనాభన్ అనే మహిళ బంధువులు.. కేరళ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించారు. ఆమె మిస్సింగ్‌కు కొద్ది రోజుల ముందు షఫీకి సంబంధించిన ఓ వ్యక్తితో బింధును చూసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై షఫీని ప్రశ్నించామని, ఎలాంటి సమాధానం రాలేదని పోలీసులు తెలిపారు. బింధు పద్మనాభన్‌కు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. కందకరపల్లిలో ఒంటరిగా ఉంటున్నారని బంధువులు తెలిపారు. ఆమె కనిపించకుండా పోయినట్లు 2013లో కేసు నమోదైంది. 2017లో మరోమారు ఆమె ఆస్తులను నకిలీ పత్రాలను ఉపయోగించి సీజ్ చేశారని బాధితురాలి సోదరుడు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు సంఘటనలో 2014లో అనుమానాస్పద స్థితిలో మరణించిన కే. సరోజిని నివాసం.. ఎలాంతూర్ నిందితులకు కొన్ని కిలోమీటర్ల దూరమే ఉంటుంది. దీంతో ఆమె కేసులో మళ్లీ దర్యాప్తు చేపట్టాలని బంధువులు కోరుతున్నారు. కనిపించకుండా పోయిన మహిళల కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో గత ఐదేళ్లలో నమోదైన మిస్సింగ్ కేసులన్నీ తిరిగి దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నారు. పతనంతిట్ట జిల్లాలో 12, ఎర్నాకులం జిల్లాలో 14 కేసులు గత ఐదేళ్లలో నమోదైనట్లు సీనియర్ అధికారోకరు తెలిపారు. ఈ 26 మంది మహిళల మిస్సింగ్ వెనుక షఫీ హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: కేరళలో కలకలం రేపుతున్న మహిళల నరబలి.. తల నరికి, నాలుక కోసి.. -
36 గంటలు గడిచినా.. లభించని సింధూజ ఆచూకీ
సాక్షి, మహబూబ్‌నగర్: శనివారం ఉదయం కలుగొట్ల వాగులో కారు కొట్టుకు పోయిన ఘటనలో గల్లంతయిన సింధూజ రెడ్డి ఆచూకీ 36 గంటలు గడిచిన ఇంకా లభించలేదు. ఏపీలోని కడప జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డి కుటుంబం బెంగుళూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే క్రమంలో కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద కరోనా పరీక్షలు చేస్తారేమోనని భయపడి అడ్డదారిలో వచ్చేందుకు యత్నించారు. ఈ క్రమంలో కారును జాతీయ రహదారి నుంచి గ్రామాల మీదగా మళ్లించారు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి కలుగొట్ల మీదగా కారుని పోనిచ్చారు. జోరు వాన...పైగా చీకట్లో కలుగోట్ల వాగు ఉధృతిని అంచనా వేయలేక వేగంగా వాగు దాటించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతిలో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న శివకుమార్ రెడ్డి, అతడి స్నేహితుడు జిలానీ బాషా ప్రాణాలతో బయటపడ్డారు. శివకుమార్ రెడ్డి భార్య సింధూజ గల్లంతు కావడంతో నిన్నటి నుంచి గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో డిఎస్పీ యాదగిరి,స్థానిక ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. నిన్న రాత్రి ఏడు గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా సింధూజ ఆచూకీ లభించలేదు. దీంతో మళ్లీ ఆదివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఇంతవరకు ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
తప్పిపోయిన మహిళల ఆచూకీ లభ్యం
కర్నూలు: శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన నలుగురు మహిళల ఆచూకీ లభించింది. కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు మహిళలు డిసెంబర్ నెలలో శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళల ఆచూకీ లభించినట్లుతెలిసింది. చిన్నగోనహాల్ కు చెందిన ముగ్గురు మహిళలు, ఎమ్మిగనూను లక్ష్మీపేటకు చెందిన మరో మహిళకు సంబంధించిన వివరాలు డిసెంబర్ 29 వ తేదీ నుంచి తెలియకపోవడంతో బంధువులు ఆందోన చెందారు. కనీసం ఆ మహిళ సెల్ ఫోన్లు పూర్తిగా స్తంభించిపోవడంతో బంధువుల ఆదోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ మహిళల ఆచూకీ లభించడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. -
నలుగురు మహిళల ఆచూకీ గల్లంతు
ఎమ్మిగనూరు: శబరిమల యాత్రకు బయల్దేరిన నలుగురు మహిళలు ఆచూకీ గల్లంతయ్యింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆ మహిళలు గత డిసెంబర్ నెల్లో శబరిమలకు పయనం అయ్యారు. అయితే అదే నెల 29 వ తేదీ నుంచి ఆ మహిళల సెల్ ఫోన్ పనిచేయడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆచూకీ గల్లంతైన వారిలో ఆదోని మండలం చిన్నగోనహాల్ కు చెందిన ముగ్గురు మహిళలు ఉండగా, ఎమ్మిగనూను లక్ష్మీపేటకు చెందిన మరో మహిళ ఉన్నారు. దీనిపై మహిళల కుటుంబ సభ్యులు ఆదోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.