Maharashtra Tops The List Of Missing Women Cases In Country - Sakshi
Sakshi News home page

మహిళల మిస్సింగ్ కేసుల్లో ఆ రాష్ట్రమే టాప్‌.. కీలక విషయాలు వెల్లడించిన కేంద్రం

Published Wed, Jul 26 2023 6:31 PM | Last Updated on Wed, Jul 26 2023 6:42 PM

Maharashtra Tops The List Of Missing Women Cases In Country - Sakshi

ఢిల్లీ: దేశంలో మహిళల మిస్సింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. దేశంలో మహిళల మిస్సింగ్ కేసుల్లో మహారాష్ట్ర టాప్ ఉందని రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా గణాంకాలను లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

2021 లో మహారాష్ట్రలో 56,498 మంది మహిళలు అదృశ్యం  అవ్వగా, మిస్సింగ్ కేసుల్లో టాప్ 5 రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, అస్సాం ఉన్నాయి. తెలంగాణలో 2021లో 12834 మంది మహిళలు అదృశ్యం కాగా, 2021లో ఏపీలో 8969 మహిళలు అదృశ్యం అయినట్లు కేంద్రం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement