సీట్లు పొందినా కౌన్సెలింగ్‌కు రాని మూడు కళాశాలలు
550 సీట్లకు గాను 250 సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్
హైదరాబాద్: సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఎంబీబీఎస్ సీట్లు పొందిన ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాల కోసం మంగళవారం జరిగిన కౌన్సెలింగ్ గందరగోళానికి దారితీసింది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో పలువురు అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లా పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్, కొంతమంది అభ్యర్థుల తల్లిదండ్రులు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఒకే సామాజిక వర్గానికి 97 సీట్లు ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు. తాము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరించామని జేఎన్‌టీయూ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు గతంలో మంచి ర్యాంకులొచ్చినా సీటు రాకపోవడంతో యాజమాన్య కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు చాలామంది మంగళవారం కౌన్సెలింగ్‌కు వచ్చారు. తమకు మంచి ర్యాంకులు వచ్చినా సీట్లు దక్కలేదని, ఇప్పుడేమో సరైన ర్యాంకులు రాని వారికి కన్వీనర్ కోటాలో సీట్లు ఇవ్వడం దారుణమన్నారు.
చేతులెత్తేసిన మూడు కళాశాలలు
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సీట్లు పొందినా మూడు కళాశాలలు సీట్లు తీసుకునేందుకు నిరాకరించాయి. రెండు రాష్ట్రాల్లోని 5 కళాశాలల్లో 550 సీట్లకు సుప్రీం అనుమతి ఇచ్చింది. అరుుతే 250 సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్ జరిగింది. కాటూరి, జెమ్స్, బీఆర్‌కే కళాశాలలు తమకు సీట్లు వద్దంటూ కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి తప్పుకున్నారుు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ కళాశాలల్లో ఏడాదికి కేవలం రూ.10 వేలు వసూలు చేయాలి. అంతేకాదు రూ.10 కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఎంసీఐకి ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లోనే పై మూడు కళాశాలలు తమకు సీట్లు అక్కర్లేదని చెప్పేశాయి. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ ప్రారంభం కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కేంద్రంలో అడ్మిషన్ల ప్రక్రియకు హాజరైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు వర్సిటీ గేటు ముందు ధర్నాకు దిగారు. నిబంధనల మేరకు మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియను మంగళవారమే ముగించాల్సి ఉండగా.. వర్సిటీ అధికారులు సోమవారం అర్థరాత్రి తరువాత నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌లో పెట్టారు. అరుుతే ఏపీలోని జెమ్స్, కాటూరి మెడికల్ కళాశాలల యాజమాన్యాలు తాము సుప్రీం తీర్పు మేరకు ప్రవేశాలకు కల్పించలేమని పేర్కొంటూ వర్సిటీ అధికారులకు లేఖలు సమర్పించాయి.
దీంతో ఏపీలోని మైనార్టీ కళాశాలైన ఫాతిమా మెడికల్ కళాశాలలో మాత్రమే సీట్లు భర్తీ చేశారు. దీంతో ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో సీట్లే లేకుండా పోయాయి. ఏయూ అభ్యర్థులు తెలంగాణలోని మల్లారెడ్డి, మెడిసిటీ కళాశాలల్లోని 15 శాతం అన్ రిజర్వుడ్ సీట్ల కోసం పోటీపడాల్సి వచ్చింది. అరుుతే ఆ సీట్లు ఓయూ ప్రాంత అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో కైవసం చేసుకున్నారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియకు హాజరైన అభ్యర్థులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యూరు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో స్పోర్ట్స్, ఎన్‌సీసీ, క్యాప్ కేటగిరీ అభ్యర్థులకు కూడా కౌన్సెలింగ్ నిర్వహించారు.
మెడికల్ సీట్ల భర్తీలో గందరగోళం
Published Wed, Oct 1 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement