Counseling Center
-
భార్యాభర్తలు విడాకుల దాకా రావడానికి కారణాలివి...
కేస్ స్టడీ మంగమ్మగారు ఒక మాజీ కార్పొరేటర్. ప్రస్తుతం ఒక ‘కౌన్సెలింగ్ సెంటర్’ ఏర్పాటు చేయాలనుకున్నారు. విడాకుల సంఖ్య ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో అసలు జంటలెందుకు విడిపోతున్నారో తెలుసుకొని వారికి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి, సాధ్యమైనంతమంది జంటలను కోర్టు గుమ్మం తొక్కకుండా చేయడమే ఆ సెంటర్ స్థాపనలో ఉన్న ముఖ్యోద్దేశం. వారికి తెలిసిన న్యాయవాదిని కలిసి విషయం వివరించి జంటలు విడిపోవడానికి ప్రధాన కారణాలు తెలుసుకొని చర్చించుకొని ఒక అవగాహనకు వచ్చారు. అసలు జంటలు విడాకులదాకా రావడానికి గల ప్రధాన కారణాలు గురించి న్యాయవాది తెలిపిన వివరాలు. 1) ఇన్‌కంపాటబిలిటీ (అనుభవ రాహిత్యం) 2) అసహనం 3) అనుమానం 4) అధికారం (మేల్ డామినేషన్) 5) అహంకారం 6) వైవాహికేతర సంబంధాలు 7) దురలవాట్లు 8) వరకట్న డిమాండ్స్ 9) అంటువ్యాధులు 10) తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల అనవసరపు జోక్యం మొదలైనవి. ఇక ఒక్కొక్క కారణం గురించి అధ్యయనం చేయాలని, వాటి గురించి చర్చించాలని నిర్ణయించుకొని ఒక గుడ్కాజ్ గురించి సెంటర్ అత్యంత త్వరలో ఏర్పాటు చేయాలని వెను తిరిగారు మంగమ్మగారు. యాసిడ్ దాడులకు పాల్పడినా, అందుకు సహకరించినా... పదేళ్ల జైలు, జరిమానా లీగల్ కౌన్సెలింగ్ మేడమ్, మేము ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థినులం. మా కాలేజీలో ఒక అల్లరి మూక ఉంది. అమ్మాయిలను ప్రేమించామని వెంటపడటమే వారి పని. ఇటీవల వారి ఆగడాలు ఎక్కువైనాయి. ప్రేమించలేదని కొందరు అమ్మాయిలను దారి కాచి మరీ వేధిస్తున్నారు. మొన్నటికి మొన్న చేతిలో ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఏదో ద్రవం నింపుకొని వచ్చి కాలేజీ దారిలో కొందరిని భయభ్రాంతులకు గురి చేశారు. మా యాజమాన్యం పట్టించుకోలేదు. ఆ ఆకతాయి ముఠా వెనుక పెద్దల అండదండ లున్నాయ్. ఆ బాటిల్స్‌లోని ద్రవం యాసిడ్ అని మా అనుమానం. అదే నిజమైతే మా గతేం కాను? చాలా భయంగా ఉంది. యాసిడ్ దాడులకు సంబంధించి చట్టాలేమైనా ఉన్నాయా? దయచేసి తెలుపగలరు? - ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల బృందం, కాకినాడ భయపడకండి. ఇటువంటి సమయాల్లో ధైర్యంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా చాకచక్యంగా ఎదుక్కోవాలి. తగిన జాగ్రత్త అవసరం. స్వప్నిక, ప్రణీతల సంఘటన మీకు గుర్తుండి ఉంటుంది. అలాగే ఢిల్లీ గ్యాంగ్‌రేప్ కూడా. అదే ‘నిర్భయ’ ఉదంతం. ఢిల్లీ గ్యాంగ్ రేప్‌కి ముందు మనకు యాసిడ్ దాడులకు సంబంధించి ప్రత్యేక చట్టాలు/ఐపిసి సెక్షన్స్ లేవు. ఆ సంఘటన తర్వాత వెల్లువెత్తిన నిరసనల ఫలితంగా జస్టిస్ వర్మ కమిషన్ రిపోర్ట్‌ను/రికమెండేషన్స్‌ను అనుసరించి ‘నిర్భయ చట్టం’ లేక ‘క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013’ రావడం జరిగింది. దానిలో యాసిడ్ దాడులను చేర్చడం జరిగింది. సెక్షన్ 326 ఐ.పి.సి.కి ఎ, బి లను చేర్చడం జరిగింది. 326ఎ ప్రకారం ఎవరైనా యాసిడ్ దాడులకు పాల్పడి/యాసిడ్ పోసి తీవ్రమైన గాయాలు కలుగచేస్తే 10 సం॥జైలు శిక్ష లేక యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. దాంతో పాటు బాధితురాలికి, నిందితుడికి జరిమానా విధించి ఆ సొమ్మును అందచేస్తారు. సెక్షన్ 326బి ప్రకారం ఎవరైనా యాసిడ్ పోసినా/పోసే ప్రయత్నం చేసినా 5 నుండి 7 సం॥జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. మీరు వెంటనే పోలీస్‌లను ఆశ్రయించండి. వారు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వండి. వీలుంటే వారి దుశ్చర్యలను మీ సెల్ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నం చేయండి. వారు వెళ్లే దారిలో మీరు ఒంటరిగా సంచరించకండి. మేడమ్, నేనొక పాఠశాల హెడ్ మాస్టర్‌ను. మాది బాలికల పాఠశాల. మా స్కూల్ ఉండే లైన్లో మా విద్యార్థినులు కొంతమంది ఒక చోట ఆగిపోయి తదేకంగా చూడడం గమనించాను. వారు వెళ్లిపోయిన తర్వాత నేను వెళ్లి, వారిని అంతగా ఆకర్షించిన విషయమేమిటా అని చూస్తే, ఒక పెద్ద వాల్‌పోస్టర్ ఉంది. ఒక సినిమాకు సంబంధించినది. ఇద్దరు యువతీ యువకులు అత్యంత అభ్యంతరకరమైన భంగిమలో ఉన్న దృశ్యం. నా మనస్సు చాలా బాధపడింది. విద్యార్థినులు ఇప్పుడిప్పుడే టీనేజ్‌లోకి వస్తున్నవాళ్లు. వారి మనస్సుపై ఇలాంటి అసభ్యకరమైన పోస్టర్స్ ఎంత దుష్ర్పభావం చూపిస్తాయో తలచుకుంటే భయమేస్తుంది. ఒక బాధ్యతగల హెడ్ మాస్టర్‌గా నేనేమీ చేయలేనా? - జి.వి.రంగారెడ్డి, హైదరాబాద్ మీలాంటి బాధ్యతగల గురువులుండబట్టే మన వ్యవస్థ ఈ మాత్రమైనా ఉంది. మీ మనసును కలచివేసిన పోస్టర్‌ను తొలగించాలంటే మీరు తప్పకుండా పూనుకోవాలి. మీకా అధికారం ఉంది. దీనికి సంబంధించిన చట్టం కూడా ఉంది. అదే ప్రొహిబిషన్ ఆఫ్ ఆబ్సీస్ అండ్ అబ్జక్షనబుల్ పోస్టర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ 1997. ఈ చట్టాన్ని అనుసరించి: - వీక్షకులను నైతికంగా పతనం చేసేవి - లైంగిక వాంఛలను ప్రేరేపించేవి - వీక్షకులను సంస్కారహీనులుగా చేసేవి - మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు, మానభంగాలను ప్రేరేపించేవి - శృంగార భావాన్ని అసభ్యరీతిలో ప్రదర్శించేవి తదితర చిత్రాలను ‘అసభ్యకరమైన పోస్టర్లు’ అంటారు. పై నేరాలకు పాల్పడిన వారికి 6 నెలలు జైలు, 6 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. మీరు హైదరాబాద్ సిటీలో ఉంటున్నారు కనుక ‘కమీషనర్ ఆఫ్ పోలీస్’ వారికి ఫిర్యాదు చేయండి. మేడమ్, నా చెల్లెలి వివాహమై 8 సం॥అయ్యింది. పెళ్లి అయిన ఏడాది తర్వాత అతను చెప్పా పెట్టకుండా ఎటో వెళ్లిపోయాడు. ఇద్దరి మధ్య ఏ గొడవలూ లేవు. ఎన్నో రకాలుగా అతని ఆచూకీ కనుక్కొనే ప్రయత్నం చేశాం. అతని అమ్మానాన్నలు కూడా ఎంతో సహకరించారు. స్టేషన్లో మిస్సింగ్ కేస్ కూడా పెట్టాం. అయినా ఆచూకీ దొరకలేదు. దాదాపు 7 సం॥నిండిపోయాయి. చెల్లికి సంతానం లేదు. అమ్మానాన్నలు పెద్దవారైపోయారు. చెల్లెలి భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంది. ఏంచేయమంటారు? - ఒక సోదరుడు, ఆదోని ఒక వ్యక్తి తన ఆచూకి, యోగక్షేమాలు తెలియవలసిన వారికి 7 సం॥నుండి తెలీకుండా పోయినప్పుడు అతను చట్టప్రకారం చనిపోయిన వ్యక్తిగానే పరిగణింపబడతాడు. మీరు వెంటనే పై కారణం వల్ల వివాహాన్ని రద్దు పరచమని కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టువారు ‘పేపర్ నోటిఫికేషన్’ ఆర్గర్ ఇచ్చి, తర్వాత వివాహాన్ని రద్దు చేస్తారు. మీ చెల్లికి పునర్వివాహం చేయవచ్చు. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
మెడికల్ సీట్ల భర్తీలో గందరగోళం
సీట్లు పొందినా కౌన్సెలింగ్‌కు రాని మూడు కళాశాలలు 550 సీట్లకు గాను 250 సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్ హైదరాబాద్: సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఎంబీబీఎస్ సీట్లు పొందిన ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాల కోసం మంగళవారం జరిగిన కౌన్సెలింగ్ గందరగోళానికి దారితీసింది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో పలువురు అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్, కొంతమంది అభ్యర్థుల తల్లిదండ్రులు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఒకే సామాజిక వర్గానికి 97 సీట్లు ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు. తాము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరించామని జేఎన్టీయూ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు గతంలో మంచి ర్యాంకులొచ్చినా సీటు రాకపోవడంతో యాజమాన్య కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు చాలామంది మంగళవారం కౌన్సెలింగ్‌కు వచ్చారు. తమకు మంచి ర్యాంకులు వచ్చినా సీట్లు దక్కలేదని, ఇప్పుడేమో సరైన ర్యాంకులు రాని వారికి కన్వీనర్ కోటాలో సీట్లు ఇవ్వడం దారుణమన్నారు. చేతులెత్తేసిన మూడు కళాశాలలు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సీట్లు పొందినా మూడు కళాశాలలు సీట్లు తీసుకునేందుకు నిరాకరించాయి. రెండు రాష్ట్రాల్లోని 5 కళాశాలల్లో 550 సీట్లకు సుప్రీం అనుమతి ఇచ్చింది. అరుుతే 250 సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్ జరిగింది. కాటూరి, జెమ్స్, బీఆర్కే కళాశాలలు తమకు సీట్లు వద్దంటూ కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి తప్పుకున్నారుు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ కళాశాలల్లో ఏడాదికి కేవలం రూ.10 వేలు వసూలు చేయాలి. అంతేకాదు రూ.10 కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఎంసీఐకి ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లోనే పై మూడు కళాశాలలు తమకు సీట్లు అక్కర్లేదని చెప్పేశాయి. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ ప్రారంభం కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కేంద్రంలో అడ్మిషన్ల ప్రక్రియకు హాజరైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు వర్సిటీ గేటు ముందు ధర్నాకు దిగారు. నిబంధనల మేరకు మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియను మంగళవారమే ముగించాల్సి ఉండగా.. వర్సిటీ అధికారులు సోమవారం అర్థరాత్రి తరువాత నోటిఫికేషన్‌ను వెబ్సైట్లో పెట్టారు. అరుుతే ఏపీలోని జెమ్స్, కాటూరి మెడికల్ కళాశాలల యాజమాన్యాలు తాము సుప్రీం తీర్పు మేరకు ప్రవేశాలకు కల్పించలేమని పేర్కొంటూ వర్సిటీ అధికారులకు లేఖలు సమర్పించాయి. దీంతో ఏపీలోని మైనార్టీ కళాశాలైన ఫాతిమా మెడికల్ కళాశాలలో మాత్రమే సీట్లు భర్తీ చేశారు. దీంతో ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో సీట్లే లేకుండా పోయాయి. ఏయూ అభ్యర్థులు తెలంగాణలోని మల్లారెడ్డి, మెడిసిటీ కళాశాలల్లోని 15 శాతం అన్ రిజర్వుడ్ సీట్ల కోసం పోటీపడాల్సి వచ్చింది. అరుుతే ఆ సీట్లు ఓయూ ప్రాంత అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో కైవసం చేసుకున్నారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియకు హాజరైన అభ్యర్థులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యూరు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్ కేటగిరీ అభ్యర్థులకు కూడా కౌన్సెలింగ్ నిర్వహించారు. -
కౌన్సెలింగ్ కేంద్రంలోనే వెబ్ ఆప్షన్లు
విజయనగరం టౌన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఈ నెల 17 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించేందుకు ఆదేశాలు వచ్చాయని కౌన్సెలింగ్ అధికారులు టీఆర్ఎస్ లక్ష్మి, ఆర్.భాస్కరరావు, సత్యనారాయణ గురువారం తెలిపారు. వెబ్ ఆప్షన్ల కోసం కౌన్సెలింగ్ కేంద్రాలపైనే ఆధారపడాలని సూచించారు. వన్‌టైమ్ పాస్ వర్డ్ విధానం ద్వారా దళారుల బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ప్రైవేట్ ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ఆప్షన్లు ఇస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేశామన్నారు. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలున్నా.. నేరుగా నివృత్తి చేసుకోవడంతో పాటు తప్పొప్పులు సరిదిద్దుకోవచ్చన్నారు. ఈ నెల 30న సీట్ల కేటాయింపు, సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభానికి రంగం సిద్ధమైందన్నారు. గురువారం 75 వేల ఒకటో ర్యాంకు నుంచి 90 వేల ర్యాంకు వరకూ కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. ఇందులో 181 మంది అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయించుకున్నారని చెప్పారు. శనివారం 90 వేల ఒకటో ర్యాంకు నుంచి లక్షా 5 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 23వ ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతుందని చెప్పారు. -
బతుకు... బతికించు
నాన్నకు కాసింత జ్వరం వస్తే ఆ కన్న కూతురు తట్టుకోలేదు. దగ్గరుండి మాత్రలు వేసి, తల్లిలా గోరుముద్దలు తినిపిస్తేనే గానీ ఆమెకు శాంతి లభించదు. అదే కూతురు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంటే ఆ తండ్రి ఎంత క్షోభ అనుభవిస్తాడు? ‘అమ్మా... నాకు ఉద్యోగం వచ్చేసిందిగా... మరేం ఫర్వాలేదు. మన జీవితాలు మారిపోతాయి. నీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటానమ్మా...’అని ప్రేమగా చేతిలో చేయి వేసి చెప్పిన కొడుకు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణం తీసుకుంటే ఆ తల్లిపేగు ఎంతగా బాధపడుతుంది? ‘ఇంకొంచెం కష్టపడితే చాలురా... ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీని బాగా చూసుకుంటా’ అని చెప్పిన మిత్రుడు తెల్లారితే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపిస్తే స్నేహితులు ఎంత నరకం అనుభవిస్తారు? జీవితంలో అన్ని ప్రశ్నలకూ ఆత్మహత్యలో సమాధానం వెతుక్కునే వారు ఆఖరుకు తమ వారికి ఇలాంటి ప్రశ్నలనే మిగిల్చి వెళుతున్నారు. జిల్లాలోనూ ఆత్మహత్యల ఘటనలు ఎక్కువైపోతున్నాయి. విజయనగరం క్రైం: కాలేజ్‌లో లెక్చరర్ తిట్టారని ఒక విద్యార్థిని, భర్త వేధింపులు తాళలేక మరో వి వాహిత, ఉద్యోగం రాలేదని ఓ యువకుడు... ఇలా కారణాలేవైనా నిండు ప్రాణా లు బలి తీసుకుంటున్నారు. సమస్యలతో పోరాడలేక జీవితాన్ని బల వంతంగా ముగించేస్తున్నారు. క్షణికావేశంలో కొం దరు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అయినవారి గుండెల్లో ఆరని మంట రగులుస్తున్నాయి. తీరని వేదన మిగులుస్తున్నాయి. కష్టాలు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్య వల్ల సమస్యలు వస్తాయి గానీ సమసిపోవని నిపుణులు చెబుతున్నారు. ఇంకా... ముందుగా తెలియజేస్తారు... ఆత్మహత్యకు మొదటి కారణం ఒత్తిడి. తమకు ఆత్మహత్య ఆలోచన వస్తున్నప్పుడు ఆ ప్రయత్నాలను సీరియస్‌గా చేయాలకున్న వ్య క్తులు వివిధ రకాల సిగ్నల్స్‌తో తమ వారిని తెలియజేస్తారు. తమకు ఇష్టమైన వస్తువులను ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలని చూడవచ్చు. ఉత్తరాలూ రాయవచ్చు. ఆత్మహత్య చేసుకుంటాడు అన్న అనుమానం ఉన్న వారిని ఒంటరిగా ఉండనీయకూడదు. తమ విలువ కుటుంబంలో ఎంత ఉందో తెలుసుకోవాలని కొందరు సరదాగా ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. కాని ఒక్కోసారి సీరియస్ అవ్వవచ్చు. తరచూ ఆ మాటలు అనే వారిని వీలైనంత ఆదరణ, అత్మీయత, ప్రేమను కలుగుజేయాలి. కొందరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావాలని తమ మాటల్లోనే నెగ్గాలని భావిస్తారు. వారిది హిస్టిరికల్ పర్సనాలిటీ. ఇలాంటి వారికి లొంగుతూ వెళ్తే వారు అలాగే కొనసాగుతారు. అసూయ, ఓర్వలేని తనం తన మాట నెగ్గకపోతే నానా హైరానా చేసే వారు అందరి దృష్టి తమవైపు తిప్పుకోవడం కోసం ఏ పనైనా చేస్తారు. తాము ఎవరిని ఆకర్షించాలని అనుకుంటున్నారో వారి సమక్షంలోనే చేయాలనుకుంటారు. డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకునే వారికి వీరు పూర్తి వ్యతిరేకం. ప్రస్తుతం దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే..? మీకు తెలిసిన వారికి ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే మొదట అత్మీయులకు బాధను చెప్పుకోవాలి. అలా చెప్పుకోనేలా ఆత్మీయులు వారిని ప్రోత్సహించాలి. వీలైనంత వరకు ఒంటరిగా ఉండనీయరాదు. ఏ మాత్రం అనుమానం వచ్చిన సైకాలజిస్ట్‌ను కలవడం ఉత్తమం. డిప్రెషన్లో ఉన్నప్పుడు... ఆత్మహత్యలు ఒత్తిడిలో ఉన్నప్పుడు చేసుకుంటారు. అలాంటి వారిని ముందుగానే గుర్తించవచ్చు. ప్రత్యేక పరిస్థితులను బట్టి ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న వారు ముందుగానే ఇండికేషన్ ఇస్తారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచంలో గుండె జబ్బు తర్వాత రెండో వ్యాధిగా మానసిక వ్యాధిని గుర్తించారు. ప్రతి ఆరు నిముషాలకు ఒక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకోకుండా డిప్రెషన్లో ఉన్నవారిని ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా మార్చవచ్చును. - డాక్టర్ ఎస్.వి.రమణ, సైకాలజిస్ట్ ప్రశాంతి మానసిక వ్యాధుల కౌన్సిలింగ్ కేంద్రం