
హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ బీ–కేటగిరీలో 676 సీట్లు భర్తీ అయినట్లు కౌన్సెలింగ్ అధికారి ప్రొఫెసర్ అప్పారావు గురువారం వెల్లడించారు. ఉస్మానియా వర్సిటీలో గత 3 రోజులుగా నిర్వహించిన ప్రైవేటు కళాశాలల తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్ ముగిసిందన్నారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌కు 4,133 ర్యాంక్ వరకు పిలువగా.. నాన్ మైనార్టీలో 1,188 ర్యాంక్ వరకు 605 మంది విద్యార్థులు, మైనార్టీలో 2,805 ర్యాంక్ వరకు 71 మంది ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందినట్లు తెలిపారు. గురువారం నాటికి బీ–కేటగిరీ బీడీఎస్ కోర్సులో మొత్తం 384 సీట్లకు 20 సీట్లు మిగిలినట్లు చెప్పారు. సీ–కేటగిరీలో 3,594 ర్యాంక్ వరకు జరిగిన కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్‌లో 319 సీట్లకు 178 సీట్లు, బీడీఎస్‌లో 150 సీట్లకు 124 సీట్లు మిగిలినట్లు తెలిపారు. పూర్తి వివరాలను హెల్త్ వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment