స్థానికత రిజర్వేషన్‌: సుప్రీంకు తెలంగాణ సర్కార్‌ | telangana govt petition on SC over local reservation for mbbs admissions | Sakshi
Sakshi News home page

స్థానికత రిజర్వేషన్‌: సుప్రీంకు తెలంగాణ సర్కార్‌

Sep 12 2024 12:14 PM | Updated on Sep 12 2024 1:18 PM

telangana govt petition on SC over local reservation for mbbs admissions

ఢిల్లీ: స్థానికత రిజర్వేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు  రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రాన  స్థానిక రిజర్వేషన్ వర్తించవని ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణలో చదువుకోలేదన్న కారణంతో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్  నిరాకరించరాదని స్పష్టం చేసింది. 

తాజాగా హైకోర్టు తీర్పును తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని  తెలంగాణ తరఫు సీనియర్ నాయకుడు గోపాల్ శంకర్  నారాయణ సుప్రీం కోర్టును కోరింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను త్వరలోనే విచారణ జాబితాలో చేరుస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు.

చదవండి: ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌పై నీలినీడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement