గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో 200 ఎంబీబీఎస్ సీట్లు కొనసాగింపునకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతి వచ్చింది. గుంటూరు వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, ప్రభుత్వం 2013లో రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు వైద్య కళాశాలతోపాటు పలు వైద్య కళాశాలలకు 50 సీట్లు అదనంగా కేటాయించింది. అదనంగా కేటాయించిన 50 ఎంబీబీఎస్ సీట్లకు వసతులు కల్పించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండటంతో అదనపు సీట్లకు కోత విధించేందుకు ఎంసీఐ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించి గుంటూరు వైద్య కళాశాలలో 200 సీట్లను కొనసాగించేలా అనుమతి పొందింది.