central medical health department
-
మాక్‌డ్రిల్‌తో భారత్ అప్రమత్తం.. కొత్తగా 5,676 కేసులు, 15 మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత మూడు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో 5,676 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ లో ముగ్గురు చొప్పున, కేరళలో ఇద్దరు, గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,000కి చేరింది. ప్రస్తుతం దేశంలో 37,093 యాక్టివ్ కేసులు ఉండగా, కేరళలో 13,745, మహారాష్ట్రలో 4,667, ఢిల్లీ- 2,338, తమిళనాడు- 2,099, గుజరాత్- 1,932, హరియాణా – 1,928, కర్ణాటక – 1,673, ఉత్తర్ ప్రదేశ్‌లో 1,282 కేసులు ఉన్నాయి. ఇక మిగిలిన ఇతర రాష్ట్రాల్లో వెయ్యికి లోపే కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్త కోవిడ్ మాక్‌డ్రిల్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు చేసుకుంటున్న నేపథ్యంలో సోమవారం కోవిడ్ మాక్‌డ్రిల్ జరిగింది. పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ సన్నద్ధతను పరిశీలించారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సందర్శించారు. వివిధ విభాగాధిపతులు, సిబ్బందితో ఆయన మాట్లాడారు. వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ‘రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాక్‌డ్రిల్‌కు భారీ స్పందన లభించింది. ఆరోగ్య శాఖల మంత్రులు ఆస్పత్రుల్లో సన్నద్ధత, సౌకర్యాలపై సమీక్షలు జరిపారు’అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వివరించింది. చదవండి: రెండో గండం దాటేస్తారా!? 38 ఏళ్ల సంప్రదాయం.. బీజేపీ ఏం చేస్తుందో? త్వరలో అందుబాటులోకి కోవోవ్యాక్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారీ కోవిడ్ టీకా కోవోవ్యాక్స్‌ను కోవిన్ పోర్టల్‌లో చేర్చేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆమోదం తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవోవ్యాక్స్ ధర రూ. 225గా ఉంటుందని పేర్కొన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వేయించుకున్న పెద్దలు కోవోవ్యాక్స్‌ను బూస్టర్ డోస్‌గా తీసుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. కోవోవ్యాక్స్‌ను ఇప్పటికే డీసీజీఐ, డబ్ల్యూహెచ్‌వో, యూఎస్ఎఫ్డీఏ ఆమోదం లభించిందని గుర్తు చేశాయి. -
దేశంలో 21 శాతం పైనే పాజిటివిటీ రేటు
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా పది రోజులుగా అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతోంది. సగటున రోజుకు 21 శాతం పైనే పాజిటివిటీ రికార్డవుతోంది. మరోవైపు దేశంలో 72 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే మృతుల్లో 75 శాతం మంది కూడా ఆ పది రాష్ట్రాలకు చెందినవారేనని తేలింది. కొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే కూడా ఎక్కువగా మరణాలు నమోదవుతున్నాయని తాజా గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు క్రమంగా కరోనా తీవ్రత తగ్గే అవకాశముందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరుకు కాస్త అదుపులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. -
పిల్లలకు కరోనా వస్తే.. ఈ మందులు వాడొద్దు
సాక్షి, అమరావతి: కరోనా బారినపడిన చిన్నారులకు రకరకాల యాంటీవైరల్, యాంటీబయోటిక్స్ మందులను ఉపయోగించవద్దని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. నెలల వయసుండే చిన్నారులు రకరకాల యాంటీవైరల్ మందులను తట్టుకునే పరిస్థితి ఉండదని పేర్కొంది. చిన్నారులకు ప్రత్యేక ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌ను నిర్దేశించింది. పిల్లల్లో ప్రధానంగా జ్వరం లక్షణాలు గమనిస్తూ, ఆక్సిజన్ సాంద్రత పరిశీలిస్తుండాలని సూచించింది. ఆ ప్రొటోకాల్ ప్రకారం.. ఈ మందులు అవసరం లేదు ప్రస్తుతం కొన్ని మందులు పెద్దవాళ్లు వాడుతున్నారు. వీటిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఫావిపిరావిర్, ఐవెర్‌మెక్టిన్, లోపినవిర్/రిటొనవిర్, రెమ్‌డెసివిర్, తోసిలిజుమాబ్, ఇంటర్ఫెరాన్ వంటివి పిల్లలకు అవసరం లేదు. పైగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల చిన్నారుల్లో కనిపించిన ఫలితాల డేటా ఇంతవరకు లేదు. చిన్నారుల్లో తరచూ 100.4 జ్వరం వస్తుంటే లక్షణాలున్నట్టు గుర్తించాలి. ఈసీజీ, ఎకో వంటి పరీక్షలు చేయించవచ్చు. పల్సాక్సీమీటర్ ద్వారా ఆక్సిజన్ శాతం పరీక్షించి ఆక్సిజన్ సాంద్రత 94 కంటే తక్కువగా ఉంటేనే సివియర్‌గా గుర్తించాలి. తల్లిదండ్రులు తమ ముక్కు, నోటికి దగ్గరగా బిడ్డను ఎత్తుకుని తిరగకూడదు. దీనివల్ల తల్లిదండ్రులు వదిలే గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. పారాసిటమాల్ విధిగా.. పిల్లల్లో జ్వరం వస్తుంటే ప్రతి 4–6 గంటలకు పారాసిటమాల్ 10–15 ఎంజీ వేయవచ్చు. వెచ్చని సెలైన్ గార్గల్స్ వంటి గొంతుకు సంబంధించిన చికిత్స చేసుకోవచ్చు. యాంటీబయోటిక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. తల్లిదండ్రులు బిడ్డలో లక్షణాలు నిర్ధారించుకోవడానికి శరీరం నీలిరంగులోకి మారడం, మూత్ర విసర్జనలో తేడా, ఆక్సిజన్ సాంద్రత తగ్గడం వంటివి చూసి తెలుసుకోవాలి. -
‘కోవిడ్’పై అమిత్ షా సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కేంద్ర వైద్య శాఖాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భళ్లాలు పాల్గొన్నారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడంపై ఆయన పలు విషయాలు ఆరా తీశారు. కోవిడ్‌ను అడ్డుకునేందుకు ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాల్సిందిగా సూచించారు. ఆయా రాష్ట్రాలకు కేంద్రం నుంచి చేయదగ్గ సహాయాలను అందించాలని కోరినట్లు అధికారులు చెప్పారు. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,417 కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 19,94,947కు చేరుకుంది. -
ధైర్యం నింపాలి
సాక్ష, అమరావతి: కోవిడ్–19 విపత్తు లాక్డౌన్ నేపథ్యంలో దేశంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వలస కూలీల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ బుధవారం రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు. లేఖలో ఆమె ఇంకా ఏమన్నారంటే... ► వలస వెళ్లిన ప్రదేశంలో చిక్కుకుపోయిన కూలీల కోసం అక్కడే సహాయ శిబిరాలను/ షెల్టర్ హోమ్స్‌ను ఏర్పాటు చేయాలి. ఆ శిబిరాల్లో వైద్య సదుపాయాలతో పాటు నాణ్యమైన భోజనం, రక్షిత మంచినీరు, పారిశుధ్య సదుపాయాలు కల్పించాలి. ► శిబిరాల్లోని వలస కూలీలు మానసికంగా దృఢంగా ఉండేలా మనో వికాస సైకాలజిస్టులు, శిక్షణ పొందిన కౌన్సిలర్స్ ద్వారా ధైర్యం నింపాలి. వారిలో భయాలను తొలగించాలి. ► రోజువారీ కష్టంతో పొట్ట నింపుకునే నిరుపేదలైన వారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించక మానవీయ కోణంతో చూడాలన్నారు. ► వలస కూలీల క్యాంపుల దగ్గర వలంటీర్లను ఏర్పాటు చేసి ముఖ్యంగా మహిళలు, పిల్లల పట్ల దయాగుణంతో వ్యవహరించాలి. వలస కూలీలను ఆదుకుంటాం సీఎం జగన్ పిలుపునకు ఎంఎన్సీల అనూహ్య స్పందన కరోనా కారణంగా ఉపాధి లేక అల్లాడుతున్న వలస కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ పిలుపుతో బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) ముందుకొస్తున్నాయి. కరోనా వల్ల దాదాపు అన్ని రంగాలు స్తంభించిన వేళ ప్రభుత్వం ఆదుకుంటున్నా.. వలస కూలీలు సహాయ సహకారాలను ఆశిస్తున్నారని, వారికి సాయం అందేలా చూడాలన్న సీఎం ఆదేశాల మేరకు కనెక్ట్ టూ ఆంధ్రా సీఈవో వి.కోటేశ్వరమ్మ వివిధ కంపెనీలకు లేఖలు రాశారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, టాటా సన్స్ అండ్ ట్రస్ట్‌కు లేఖలు పంపగా.. సాయం అందించేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అన్నవరం లలిత బ్రాండ్ రైస్ కంపెనీలు ముందుకు వచ్చినట్లు సీఈవో తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. బియ్యం, పంచదార, నూనె వంటి 15రకాల సరుకులున్న ఐదు వేల కిట్లు అందిస్తామని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సంస్థ 10 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు అందించేందుకు ముందుకొచ్చింది. అన్నవరం నుంచి లలితా బ్రాండ్ కంపెనీ 10 టన్నుల బియ్యాన్ని అందించనుంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే 17,655 వలస కుటుంబాలకు చెందిన 53,583 మంది వలస కూలీలు ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ రెండు రోజుల్లో కిట్లను అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
నేషనల్ పూల్‌లోని సీట్లకు కేంద్రమే కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: నేషనల్ పూల్‌లో ఉన్న పీజీ వైద్య సీట్లకు కేంద్రమే కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల అధికారులకూ తెలియజేసింది. పీజీ వైద్యసీట్ల భర్తీకి జాతీయస్థాయిలో నిర్వహించిన అర్హత పరీక్ష (నీట్) ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. జమ్మూ– కశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలు ఈఏడాది జాతీయ పూల్‌లోకి వచ్చాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ 50 శాతం సీట్లను నేషనల్ పూల్‌కు ఇవ్వాలి. మిగతా రాష్ట్రాలు ఇచ్చే 50 శాతం పీజీ వైద్య సీట్లకూ మన అభ్యర్థులు పోటీ పడవచ్చు. మిగతా 50 శాతం సీట్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భర్తీ చేసుకుంటాయి. ఇందులో కూడా కొన్ని నిబంధనలు విధించారు. మొదటిసారి కౌన్సెలింగ్‌కు వచ్చిన అభ్యర్థి సీటు ఎంపిక చేసుకోకపోయినా రెండోసారి కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. రెండో సారి కూడా సీటు ఎంపిక చేసుకోకపోతే ఆ అభ్యర్థిని తదుపరి విడతల్లో కౌన్సెలింగ్‌కు అనుమతించరు. సీటు ఎంచుకున్న అభ్యర్థి ఐదు రోజుల్లోగా కళాశాలలో చేరకపోతే సీటు రద్దు చేస్తారు. -
సీఎం ఆరోగ్య కేంద్రాల అవినీతిపై విచారణ!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ముసుగులో జరుగుతున్న అవినీతి తుట్టె కదిలింది. కార్పొరేట్ సంస్థలకు రూ.కోట్లు ౖకైంకర్యం అవుతున్న తీరుపై పలువురు ప్రైవేటు వ్యక్తులు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు ఫిర్యాదులు చేశారు. స్పందించిన సీవీసీ తాజాగా వీటిపై విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిధిలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను కొద్ది నెలల కిందట ఏర్పాటు చేశారు. మొత్తం మూడు జోన్లుగా విభజించి అపోలో సంస్థకు రెండు జోన్లు, ధనుష్–ఈ వైద్య కన్సార్టియం సంస్థకు ఒక జోన్ కేటాయించారు. ఒక్కో కేంద్రానికి సగటున నెలకు రూ. 4.08 లక్షలను జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి చెల్లిస్తున్నారు. కానీ వీటి సేవలు సక్రమంగా అందడం లేదు. టెండర్లలో కూడా పలు అవకతవకలు జరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అనుచరుడిగా చెప్పుకుంటున్న ఈ–వైద్య సంస్థ ప్రతినిధి కోసం ఏకంగా మూడు దఫాలు టెండర్లు రద్దు చేసి మళ్లీ నిర్వహించినట్టు అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కొందరు వ్యక్తులు సీవీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీవీసీ విచారణకు ఆదేశించింది. నెలరోజుల్లోగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు కేంద్ర విజిలెన్స్ కమిషన్‌తో పాటు ఉప రాష్ట్రపతి కార్యాలయానికి కూడా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలపై ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపై స్పందించిన ఉపరాష్ట్రపతి కార్యాలయం.. ఫిర్యాదుదారులకు ప్రత్యుత్తర సమాచారం పంపింది. అంతేగాకుండా దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
పీజీ వైద్య సీట్లకు ఉమ్మడి కౌన్సెలింగ్
- కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం - నేడు అన్ని రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స సాక్షి, అమరావతి: ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీల్లోని పీజీ వైద్య సీట్లకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిం చాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు లోటు పాట్లు, ఏవైనా సమస్యలు ఉంటే అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ట్రా ల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, వైద్యవిద్యా సంచాలకులను ఆదేశిం చింది. ఇందు కోసం ఈ నెల 28న (నేడు)అన్ని రాష్ట్రాల అధికారు లతో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధి కారులు వీడియో కాన్ఫ రెన్స నిర్వ హిస్తున్నారు. 1956 ఐఎంఏ యాక్ట్‌ను సవ రించి, అన్ని కళాశాలల్లోని పీజీ సీట్లకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తే బావుంటుందని నిర్ణయించింది. దీంతోపాటు నీట్ ప్రవేశ పరీ క్షను హిందీ, ఇంగ్లిష్, అస్సామి, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళ్, తెలుగు భాషల్లో నిర్వహించే విషయంపై చర్చ జరగనుంది. పాశ్చాత్య దేశాల్లో విద్యనభ్యసించిన విద్యా ర్థులు కూడా నీట్ పరీక్ష రాసే అంశంపై చర్చి స్తారు. ఎంబీబీఎస్ సీట్ల కోసం జరిగే నీట్ ప్రవేశపరీక్షలో పాల్గొనే విద్యార్థులకు ఇంటర్మీ డియట్‌లో కనీస మార్కులు ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఇంటర్లో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 40శాతం మార్కులు, అన్రిజర్వ్డ్ (రిజర్వేషన్లేని) వారికి 50 శాతం మార్కులు ఉండాలనేది కేంద్రం అభిప్రాయం. ఈ మార్కుల శాతం ప్రధానంగా ఫిజిక్స్, కెమి స్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఉంటే సరిపోతుంద ని, అన్నిసబ్జెక్టుల్లో నిర్ణరుుంచిన శాతం మార్కు లుండాల్సిన పనిలేదని అధికారులు నిర్ణరుుంచారు. పదవీ విరమణ వయసు పొడిగింపు వైద్య కళాశాలల్లో పనిచేసే వైద్య అధ్యాప కులకు ఇకపై పదవీ విరమణ వయసును 70 ఏళ్లకు పొడిగించాలని కేంద్రం భావిస్తోంది. స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఎంబీబీఎస్ తర్వాత ‘నెక్ట్స్’ పరీక్ష ఎంబీబీఎస్ పూర్తి కాగానే ఇష్టారా జ్యంగా ఎక్కడంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకుం టామంటే ఇకపై కుదరదు. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (‘నెక్స్ట్’) పరీక్షలో అర్హత సాధించిన వారే వైద్యం చేసేందుకు అర్హులు. ఇది రెం డు విధాలుగా ఉంటుంది. మొదటిది థీరిటి కల్ నాలెడ్‌జ (సబ్జెక్టులపై అవగాహన), రెం డోది స్కిల్ ఎవాల్యుయేషన్ (నైపుణ్యం). ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఏటా 53 వేల మంది ఎంబీ బీఎస్ పూర్తి చేసుకుంటున్న అభ్యర్థులం దరూ ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. -
200 ఎంబీబీఎస్ సీట్లు కొనసాగింపునకు ఓకే
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో 200 ఎంబీబీఎస్ సీట్లు కొనసాగింపునకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతి వచ్చింది. గుంటూరు వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, ప్రభుత్వం 2013లో రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు వైద్య కళాశాలతోపాటు పలు వైద్య కళాశాలలకు 50 సీట్లు అదనంగా కేటాయించింది. అదనంగా కేటాయించిన 50 ఎంబీబీఎస్ సీట్లకు వసతులు కల్పించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండటంతో అదనపు సీట్లకు కోత విధించేందుకు ఎంసీఐ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించి గుంటూరు వైద్య కళాశాలలో 200 సీట్లను కొనసాగించేలా అనుమతి పొందింది.