పీజీ వైద్య సీట్లకు ఉమ్మడి కౌన్సెలింగ్
- కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం
- నేడు అన్ని రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్‌స
సాక్షి, అమరావతి: ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీల్లోని పీజీ వైద్య సీట్లకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిం చాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు లోటు పాట్లు, ఏవైనా సమస్యలు ఉంటే అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ట్రా ల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, వైద్యవిద్యా సంచాలకులను ఆదేశిం చింది. ఇందు కోసం ఈ నెల 28న (నేడు)అన్ని రాష్ట్రాల అధికారు లతో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధి కారులు వీడియో కాన్ఫ రెన్‌స నిర్వ హిస్తున్నారు.
1956 ఐఎంఏ యాక్ట్‌ను సవ రించి, అన్ని కళాశాలల్లోని పీజీ సీట్లకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తే బావుంటుందని నిర్ణయించింది. దీంతోపాటు నీట్ ప్రవేశ పరీ క్షను హిందీ, ఇంగ్లిష్, అస్సామి, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళ్, తెలుగు భాషల్లో నిర్వహించే విషయంపై చర్చ జరగనుంది. పాశ్చాత్య దేశాల్లో విద్యనభ్యసించిన విద్యా ర్థులు కూడా నీట్ పరీక్ష రాసే అంశంపై చర్చి స్తారు. ఎంబీబీఎస్ సీట్ల కోసం జరిగే నీట్ ప్రవేశపరీక్షలో పాల్గొనే విద్యార్థులకు ఇంటర్మీ డియట్‌లో కనీస మార్కులు ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఇంటర్‌లో రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40శాతం మార్కులు, అన్‌రిజర్వ్‌డ్ (రిజర్వేషన్‌లేని) వారికి 50 శాతం మార్కులు ఉండాలనేది కేంద్రం అభిప్రాయం. ఈ మార్కుల శాతం ప్రధానంగా ఫిజిక్స్, కెమి స్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఉంటే సరిపోతుంద ని, అన్నిసబ్జెక్టుల్లో నిర్ణరుుంచిన శాతం మార్కు లుండాల్సిన పనిలేదని అధికారులు నిర్ణరుుంచారు.
పదవీ విరమణ వయసు పొడిగింపు
వైద్య కళాశాలల్లో పనిచేసే వైద్య అధ్యాప కులకు ఇకపై పదవీ విరమణ వయసును 70 ఏళ్లకు పొడిగించాలని కేంద్రం భావిస్తోంది. స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు.
ఎంబీబీఎస్ తర్వాత ‘నెక్ట్స్’ పరీక్ష
ఎంబీబీఎస్ పూర్తి కాగానే ఇష్టారా జ్యంగా ఎక్కడంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకుం టామంటే ఇకపై కుదరదు. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (‘నెక్‌స్ట్’) పరీక్షలో అర్హత సాధించిన వారే వైద్యం చేసేందుకు అర్హులు. ఇది రెం డు విధాలుగా ఉంటుంది. మొదటిది థీరిటి కల్ నాలెడ్‌జ (సబ్జెక్టులపై అవగాహన), రెం డోది స్కిల్ ఎవాల్యుయేషన్ (నైపుణ్యం). ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఏటా 53 వేల మంది ఎంబీ బీఎస్ పూర్తి చేసుకుంటున్న అభ్యర్థులం దరూ ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది.