సాక్షి, హైదరాబాద్: నీట్ ఫలితాలు వెలువడ్డాయి. ఇక త్వరలో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎంత ర్యాంకుకు ఎంబీబీఎస్‌లో కన్వినర్ కోటాలో సీటు వస్తుందన్న దానిపై విద్యార్థుల్లో చర్చ జరుగుతోంది. పైగా గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలో 9 కొత్తగా వస్తున్నాయి.
అంటే 900 ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయి. అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు పెరుగుతాయి. గతేడాది లెక్క ప్రకారం చూసినా 2 లక్షల ర్యాంకు దాటినా రిజర్వు కేటగిరీలో సీటు వచ్చే అవకాశముంది. అలాగే అన్ రిజర్వుడు కేటగిరీలోనూ 1.25 లక్షల ర్యాంకుకూ కన్వీనర్ సీటు వచ్చే అవకాశం ఉంది.
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిపుణుల అంచనా ప్రకారం జాతీయస్థాయిలో రెండు లక్షలకుపైగా ర్యాంకులు వచ్చి న వారికి కూడా కన్వినర్ కోటాలో సీ ట్లు వస్తాయని చెబుతున్నారు. అలాగే జాతీయ స్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చి న వారి కి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లోనూ బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అంటున్నారు.
రాష్ట్రంలోని 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు
రాష్ట్రంలో 2023–24 వైద్య విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ప్రకటించింది. 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి.
మంగళవారం ‘నీట్’ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో సీట్లపై స్పష్టత వచ్చి ంది. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచి నీట్‌లో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీచేస్తామని విశ్వవిద్యాలయం వెల్లడించింది. ‘నీట్’ర్యాంకుల ప్రకటన అనంతరం రాష్ట్రస్థాయిలో తమకెంత ర్యాంకు వస్తుందోనన్న ఆసక్తి, ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది.
15 శాతం సీట్లు అఖిల భారత కోటాకు కేటాయింపు...
ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వినర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు సీట్ల కేటాయింపు జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment