- ఎంబీబీఎస్‌లో సీట్లంటూ రూ.నాలుగు కోట్లు వసూలు
- స్కోడా కారులో తిరుగుతూ పేదలకు వల
- పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడు
జమ్మికుంట రూరల్: ఖరీదైన కారు.. దానిపై ఓ పార్టీ నాయకుడికి సెక్రటరీ అని రాయించుకు ని.. ఎంబీబీఎస్‌లో సీట్లు ఇప్పిస్తానంటూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని జమ్మికుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మోసగాడి వివరాలను స్థానిక టౌన్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హు జూరాబాద్ డీఎస్పీ సంజీవ్‌కుమార్ వెల్లడించా రు.
మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం మా చాపూర్ గ్రామానికి చెందిన మ్యాడబోయిన శ్రీనివాస్ ఓ ఖరీదైన స్కోడా కారుపై ఓ పార్టీ నాయకుడికి సెక్రటరీగా రాయించుకున్నాడు. ఎంసెట్‌లో ర్యాంకు రాని పిల్లల తల్లిదండ్రుల ఫోన్‌నంబర్లు సేకరించి తరచూ ఫోన్లు చేస్తున్నా డు. తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని కళాశాలల యజమానులు, డెరైక్టర్లు పరిచయం ఉన్నట్లు నమ్మిస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని కోరపల్లికి చెందిన కందికట్ల మధుసూదన్ కుమారుడు రామకృష్ణ ఎంసెట్ రాసిన విష యం తెలుసుకుని మధుసూదన్ ఫోన్ చేశాడు.
రామకృష్ణకు మహారాష్ట్రలోని సతారా(ఐఎంఆర్‌ఎస్) మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. దీంతో మధుసూదన్ 24 మే 2013న రూ. ఐదు లక్షలు ఇచ్చాడు. తిరిగి అదేనెల 31న మరో రూ.12లక్షలతోపా టు రూ.మూడు లక్షలకు మూడు చెక్కులు రాసిచ్చాడు. కొద్ది రోజులకు అడ్మిషన్ దొరికిందని, కాలేజీ ఫీజు కింద మరో రూ. నాలుగు లక్షలు తీసుకుని రావాలని శ్రీనివాస్ ఫోన్‌లో చెప్పాడు. మధుసూదన్ తన కుమారుడు రామకృష్ణను వెంటబెట్టుకుని రూ.నాలుగులక్షలతో సతార కాలేజీకి వెళ్లాడు. వారం దాటినా సీటు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన మధుసూదన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శ్రీనివాస్‌పై అనేక కేసులు
సీట్లు ఇప్పిస్తానంటూ మోసం చేసిన శ్రీనివాస్‌పై గతంలో ముషీరాబాద్, సరూర్‌నగర్, జీడిమె ట్ల, ముంబయి పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని సీఐ వివరించారు. సోమవారం హైదరాబాద్‌లో ఉన్నాడన్న సమాచారం మేరకు తనిఖీలు చేసి నిందితుడిని పట్టుకున్నామని, అతని నుంచి స్కోడాకారు, సెల్‌ఫోన్లను స్వాధీ నం చేసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. శ్రీని వాస్‌కు సహకరించిన మరో వ్యక్తి బాలభద్రుని సురేశ్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. సమా వేశంలో జమ్మికుంట టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై లు పాపయ్యనాయక్, సంజయ్ ఉన్నారు.
ఈ మోసగాడు చాలా ‘ఖరీదు’
Published Tue, Feb 3 2015 9:27 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement