collecting money
-
సీవీ ఆనంద్ పేరుతో డబ్బు వసూళ్లు!
సాక్షి, మహబూబ్‌నగర్: గతంలో హైదరాబాద్ పోలీస్ మాజీ కమిషనర్‌గా పనిచేసిన సీవీ ఆనంద్ పేరుతో నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా కొందరు పోలీసులకు ఫోన్ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. అలాగే కొందరు రాజకీయ నాయకులకు సదరు వ్యక్తి నేరుగా ఫోన్ చేసి డబ్బులు పంపించాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొందరు పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులతోనూ డబ్బులు కావాలని అడిగినట్టు తెలిసింది. ఇటీవల ఓ వ్యక్తితో రూ.ఐదు లక్షలు వసూలు చేసినట్టు మహబూబ్‌నగర్ పోలీసులు గుర్తించారు. దీనిపై వారు లోతైన విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఒక్కడి హస్తమే ఉందా.. ఇంకా ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. దీనిపై మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా సీవీ ఆనంద్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న విషయం వాస్తవమేనని, దీనిపై రెండు, మూడు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
కరోనా అని చెప్పి.. డబ్బులు గుంజి
కర్నూలు (టౌన్): సాధారణ మరణం చెందినా.. కరోనా అని చెప్పి మృతుని కుటుంబ సభ్యులను భయాందోళలకు గురిచేసి డబ్బు గుంజిన అంబులెన్స్ యజమానితో పాటు మరో ఇద్దరిని పోలీసులు కటాకటాలకు పంపించారు. ఈ సంఘటనకు సంబంధించి గురువారం మూడో పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ తబ్రేజ్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 14 వ తేదీ కర్నూలు నగరంలోని రెవెన్యూ కాలనీకి చెందిన సాయినాథరావు అనే వ్యక్తి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెనొప్పితో మృతిచెందాడు. అయితే కాటం జయరాజు (అంబులెన్స్ యజమాని, బుధవారపేట), తాటిపాటి చిన్న తిరుపాల్ (బోయగేరి, బుధవారపేట), జగ్గుల వెంకట గిరి ( స్వీపర్, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి) అనే ముగ్గురు.. సాయినాథరావు భార్య నీరజాబాయి, వారి బంధువులకు కరోనాతో మృతి చెందినట్లు చెప్పారు. తామే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని రూ. లక్ష డిమాండ్ చేశారు. చివరికి రూ. 91 వేలు కుదుర్చుకొని రూ. 50 వేలు ఫోన్‌పే ద్వారా మిగతా రూ. 41 వేలు నగదు రూపంలో తీసుకున్నారు. అయితే కరోనాతో చనిపోయిన వారికి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందన్న విషయాన్ని మృతుని బంధువు ఆంజనేయులు తెలుసుకొని.. మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ...కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి పాత కాన్పుల వార్డు వద్ద ఉన్న నిందితులను అరెస్టు చేశారు. అంబులెన్స్‌తో పాటు బాధితుల నుంచి తీసుకున్న మొత్తం రూ. 69 వేలు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు సీఐ వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. -
సంప్రదాయాన్ని వదిలిపెట్టలేదుగా
సాక్షి, పెదవేగి (పశ్చిమ గోదావరి) : వరినాట్ల సమయంలో రహదారుల వెంట ఎక్కడ చూసినా ప్రధానంగా వరినారు పట్టుకుని వాహన చోదకులను ఆపి, సొమ్ములు వసూలు చేయడం కన్పించేది . ఇది గోదావరి జిల్లాల్లో సంప్రదాయంగా వస్తోంది. గతంలో వరినాట్ల సమయంలో బావ వరస అయ్యేవారు చేలోకి వస్తుంటే మరదలి వరుస అయ్యేవారు ఆపి, పసుపు, కుంకుమలకు సొమ్ములు ఇవ్వాలని పట్టుబట్టేవారు. అయితే ఇది కేవలం చేలగట్లకే పరిమితం అయ్యేది. కానీ ఈ విధానం ప్రస్తుతం రోడ్డెక్కింది. వచ్చేది ఎవరన్నది పక్కన పెట్టి వాహనాలను నిలిపేసి, బలవంతంగానైనా సొమ్ములు వసూలు చేస్తున్నారు. కొంతవుంది ఇష్టపూర్వకంగా ఇస్తున్నా, ఇంకొందరు తప్పక ఇస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వెళ్తున్న వాహనాలను ఆపుతున్న సందర్భాల్లో ఒక్కోసారి ప్రవూదాలు కూడా జరుగుతున్నాయి. ద్విచక్రవాహనాలతో పాటు ఆటో, కార్లు, ట్రాక్టర్ల వంటివాటిని కూడా ఆపి సొమ్ములు వసూలు చేస్తున్నారు. వచ్చిన సొమ్మును కూలీలంతా సమానంగా తీసుకుంటుంటారు. సంప్రదాయమే అయినా బలవంతంగా వసూలు చేయకుండా ఉంటే బాగుంటుందని వాహనచోదకులు పేర్కొంటున్నారు. -
విందు కోసం..
వారంతా ఉన్నత విద్యావంతులు. మంచి స్నేహితులు. అందరూ కలిసి విందు చేసుకున్నారు. అయితే డబ్బు తక్కువపడడంతో హైవేపైకి వచ్చి ఆర్టీఏ అధికారులమంటూ వాహనదారులను బెదిరించి డబ్బు వసూలు చేశారు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు. కల్లూరు: నగర శివారు గోశాల వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులమంటూ వాహన డ్రైవర్లను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఉలిందకొండ ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. మద్దూర్‌నగర్‌కు చెందిన చాకలి ఇనుకొండ వంశీ మహేష్, గురుబ్రహ్మ నగర్‌కు చెందిన పెండేకల్ రమణాచారి, లక్ష్మీటౌన్‌షిప్ వాసి కొండేటి సందీప్, బాబాబృందావన్‌నగర్ వాసి కవడపు నరహరి, గణేష్‌నగర్–2 నివాసి జి. అరుణ్‌కుమార్ యాదవ్, శకుంతలా కళ్యాణమంటపం వెనకనున్న రాజేశ్వరినగర్ వాసి వడ్డె వెంకటేష్‌ప్రసాద్ మంచి స్నేహితులు. ఈనెల 21న అందరూ కలిసి విందు ఏర్పాటు చేసుకున్నారు. పార్టీకి డబ్బు తక్కువ రావడంతో గోశాల వద్ద జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులమని, డబ్బివ్వాలంటూ ట్యాంకర్ డ్రైవర్ పుల్ల మాబాషాపై దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామని ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా సందీప్ ట్రాన్స్‌కోలో జూనియర్ లైన్మెన్, నరహరి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఏవియేషన్ ఆఫీసర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తుండగా, జి. అరుణ్‌కుమార్ పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ ఫైనలియర్ చదుతున్నాడు. వంశీ మహేష్, వడ్డె వెంకటేష్‌ప్రసాద్ బీటెక్ ఫెయిలయ్యారు. -
ఈ మోసగాడు చాలా ‘ఖరీదు’
- ఎంబీబీఎస్‌లో సీట్లంటూ రూ.నాలుగు కోట్లు వసూలు - స్కోడా కారులో తిరుగుతూ పేదలకు వల - పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడు జమ్మికుంట రూరల్: ఖరీదైన కారు.. దానిపై ఓ పార్టీ నాయకుడికి సెక్రటరీ అని రాయించుకు ని.. ఎంబీబీఎస్‌లో సీట్లు ఇప్పిస్తానంటూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని జమ్మికుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మోసగాడి వివరాలను స్థానిక టౌన్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హు జూరాబాద్ డీఎస్పీ సంజీవ్‌కుమార్ వెల్లడించా రు. మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం మా చాపూర్ గ్రామానికి చెందిన మ్యాడబోయిన శ్రీనివాస్ ఓ ఖరీదైన స్కోడా కారుపై ఓ పార్టీ నాయకుడికి సెక్రటరీగా రాయించుకున్నాడు. ఎంసెట్‌లో ర్యాంకు రాని పిల్లల తల్లిదండ్రుల ఫోన్‌నంబర్లు సేకరించి తరచూ ఫోన్లు చేస్తున్నా డు. తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని కళాశాలల యజమానులు, డెరైక్టర్లు పరిచయం ఉన్నట్లు నమ్మిస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని కోరపల్లికి చెందిన కందికట్ల మధుసూదన్ కుమారుడు రామకృష్ణ ఎంసెట్ రాసిన విష యం తెలుసుకుని మధుసూదన్ ఫోన్ చేశాడు. రామకృష్ణకు మహారాష్ట్రలోని సతారా(ఐఎంఆర్ఎస్) మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. దీంతో మధుసూదన్ 24 మే 2013న రూ. ఐదు లక్షలు ఇచ్చాడు. తిరిగి అదేనెల 31న మరో రూ.12లక్షలతోపా టు రూ.మూడు లక్షలకు మూడు చెక్కులు రాసిచ్చాడు. కొద్ది రోజులకు అడ్మిషన్ దొరికిందని, కాలేజీ ఫీజు కింద మరో రూ. నాలుగు లక్షలు తీసుకుని రావాలని శ్రీనివాస్ ఫోన్లో చెప్పాడు. మధుసూదన్ తన కుమారుడు రామకృష్ణను వెంటబెట్టుకుని రూ.నాలుగులక్షలతో సతార కాలేజీకి వెళ్లాడు. వారం దాటినా సీటు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన మధుసూదన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్‌పై అనేక కేసులు సీట్లు ఇప్పిస్తానంటూ మోసం చేసిన శ్రీనివాస్‌పై గతంలో ముషీరాబాద్, సరూర్‌నగర్, జీడిమె ట్ల, ముంబయి పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని సీఐ వివరించారు. సోమవారం హైదరాబాద్‌లో ఉన్నాడన్న సమాచారం మేరకు తనిఖీలు చేసి నిందితుడిని పట్టుకున్నామని, అతని నుంచి స్కోడాకారు, సెల్ఫోన్లను స్వాధీ నం చేసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. శ్రీని వాస్కు సహకరించిన మరో వ్యక్తి బాలభద్రుని సురేశ్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. సమా వేశంలో జమ్మికుంట టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై లు పాపయ్యనాయక్, సంజయ్ ఉన్నారు.