సాక్షి, పెదవేగి (పశ్చిమ గోదావరి) : వరినాట్ల సమయంలో రహదారుల వెంట ఎక్కడ చూసినా ప్రధానంగా వరినారు పట్టుకుని వాహన చోదకులను ఆపి, సొమ్ములు వసూలు చేయడం కన్పించేది . ఇది గోదావరి జిల్లాల్లో సంప్రదాయంగా వస్తోంది. గతంలో వరినాట్ల సమయంలో బావ వరస అయ్యేవారు చేలోకి వస్తుంటే మరదలి వరుస అయ్యేవారు ఆపి, పసుపు, కుంకుమలకు సొమ్ములు ఇవ్వాలని పట్టుబట్టేవారు. అయితే ఇది కేవలం చేలగట్లకే పరిమితం అయ్యేది. కానీ ఈ విధానం ప్రస్తుతం రోడ్డెక్కింది.
వచ్చేది ఎవరన్నది పక్కన పెట్టి వాహనాలను నిలిపేసి, బలవంతంగానైనా సొమ్ములు వసూలు చేస్తున్నారు. కొంతవుంది ఇష్టపూర్వకంగా ఇస్తున్నా, ఇంకొందరు తప్పక ఇస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వెళ్తున్న వాహనాలను ఆపుతున్న సందర్భాల్లో ఒక్కోసారి ప్రవూదాలు కూడా జరుగుతున్నాయి. ద్విచక్రవాహనాలతో పాటు ఆటో, కార్లు, ట్రాక్టర్‌ల వంటివాటిని కూడా ఆపి సొమ్ములు వసూలు చేస్తున్నారు. వచ్చిన సొమ్మును కూలీలంతా సమానంగా తీసుకుంటుంటారు. సంప్రదాయమే అయినా బలవంతంగా వసూలు చేయకుండా ఉంటే బాగుంటుందని వాహనచోదకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment