సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) పీజీ, యూజీ ప్రవేశ పరీక్షలు త్వరలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో వివిధ కాలేజీల్లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా 558 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 83,275 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అందులో ప్రభుత్వ కాలేజీలు 289 ఉంటే, వాటిలో 43,435 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 269 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 39,840 ఎంబీబీఎస్ సీట్లున్నాయి.
ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం అంటే, 6,515 సీట్లను అన్ని రాష్ట్రాలు నేషనల్ పూల్‌కు ఇస్తాయి. వాటిని జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కేటాయిస్తారు. జాతీయస్థాయిలో రెండుసార్లు కౌన్సెలింగ్ జరిగాక, నేషనల్ పూల్‌లో మిగిలిన సీట్లను తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కిస్తారు. ఇదిలావుంటే తెలంగాణలో 34 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 5,240 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 11 ప్రభుత్వ కాలేజీల్లో 1,790 సీట్లు, 23 ప్రైవేట్ కాలేజీల్లో 3,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి.
ప్రభుత్వంలోని సీట్లల్లో 15 శాతం అంటే 268 సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్తాయి. ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లల్లో 50 శాతం కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన 35 శాతం బీ కేటగిరీ కింద నిర్ణీత ఫీజుతో భర్తీ చేస్తారు. 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద తమకు ఇష్టమైన వారికి ప్రైవేట్ యాజమాన్యాలు కేటాయించుకునే వెసులుబాటుంది.
‘మనూ’ కొత్త వైస్ చాన్స్‌లర్ ఐనుల్ హసన్
హెచ్‌సీయూకు బసుత్కర్ జే రావు..
రాయదుర్గం: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) నూత న వైస్ చాన్స్‌లర్‌గా ప్రముఖ పర్షియన్ పండితుడు ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ విశ్వవిద్యాలయానికి లేఖ రాసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా తిరుపతిలోని ఇండి యన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్)లో బయాలజీ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ బసుత్కర్ జే రావు నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment