ఎంబీబీఎస్‌ సీట్లకు వెబ్‌ కౌన్సిలింగ్‌  | Kaloji Narayana Rao Health University Announced Web Counseling For MBBS Seats | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ సీట్లకు వెబ్‌ కౌన్సిలింగ్‌ 

Published Fri, Apr 1 2022 1:54 AM | Last Updated on Fri, Apr 1 2022 1:54 AM

Kaloji Narayana Rao Health University Announced Web Counseling For MBBS Seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌ సీట్లకు నేటి నుంచి 2వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. రెండో విడత కౌన్సిలింగ్‌ తరవాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారని, ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌కు అర్హులని వివరించింది. గత కౌన్సెలింగ్‌లో సీట్‌ అలాట్‌ అయి జాయిన్‌ కాకపోయినా, చేరి డిస్‌కంటిన్యూ చేసినా అదే విధంగా అల్‌ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని సూచించింది. మరిన్ని వివరాలకు  www.knruhs. telangana.gov.in చూడాలని తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement