web councelling
-
ఎంబీబీఎస్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్లకు నేటి నుంచి 2వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. రెండో విడత కౌన్సిలింగ్ తరవాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. సీట్ల ఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చారని, ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌కు అర్హులని వివరించింది. గత కౌన్సెలింగ్‌లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్కంటిన్యూ చేసినా అదే విధంగా అల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని సూచించింది. మరిన్ని వివరాలకు www.knruhs. telangana.gov.in చూడాలని తెలిపింది. -
ఏపీలో ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
-
ఏపీలో ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో నేటి నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఆద్వర్యంలో ఆన్లైన్ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకుగాను రాష్డ్ర వ్యాప్తంగా 25 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. గిరిజన విద్యార్థుల సౌకర్యార్ధం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ర్యాంకుల వారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా ఇళ్ల నుంచే ఆన్లైన్ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అత్యవసరమైతేనే హెల్ప్‌లైన్ సెంటర్లకి విద్యార్థుల రావాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్ధం నాలుగు హెల్ప్‌లైన్ నంబర్లు: 8106876345, 8106575234, 7995865456, 7995681678 అందుబాటులో ఉంచారు. (చదవండి: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం) జనరల్, బీసీ విద్యార్థులకు 1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 600 రూపాయిలు ప్రాసెసింగ్ ఫీజుగా నిర్ణయించారు. నేడు (శుక్రవారం) ఒకటో ర్యాంకు నుంచి 20,000 ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగననుండగా రేపు (24)న 20,001 ర్యాంకు నుంచి 50,000 వరకు, 25న 50,001 ర్యాంకు నుంచి 80,000 వరకు, 26న 80,001 నుంచి 1,10,000 ర్యాంకు వరకు, 27న 1,10,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. పీహెచ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ కోటా విద్యార్ధులకి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ జరగనుంది. -
27 నుంచి ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
-
12 నుంచి రెండో దశ వెబ్ ఆప్షన్లు
ఎంబీబీఎస్, బీడీఎస్ ఏ కేటగిరీ సీట్లకు.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని ఏ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల భర్తీ కోసం ఆగస్టు 12 నుంచి రెండో దశ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఆగస్టు 12, 13, 14 తేదీల్లో ఏ కేటగిరీ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ వైద్య నిబంధనల ప్రకారం ఏ కేటగిరి వైద్య సీట్లకు ఆగస్టు 18లోపు కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాళోజీ విశ్వవిద్యాలయం ఆగస్టు 14తో వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ముగిస్తోంది. -
వెబ్‌డబ్
– వెంటాడుతున్న తప్పులు – టీచర్ల బదిలీ దరఖాస్తుకు బోలెడు సమస్యలు – రేపటి వరకు గడువు పెంపు – లబోదిబోమంటున్న ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్ : పారదర్శకత అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ ప్రవేశ పెట్టింది. అయితే దరఖాస్తు మొదలుకొని స్కూల్‌కు బదిలీ అయ్యేవరకు వారిని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రారంభంలో సాంకేతిక లోపం కారణంగా చిన్నచిన్న సమస్యలు తలెత్తాయని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి మొదలు రాష్ట్రస్థాయిలో కమిషనర్ వరకు పలుమార్లు చెప్పారు. అయితే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునే గడువు సమీపిస్తున్న కొద్దీ కొత్తకొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి తప్ప పరిష్కారం కావడంలేదు. దరఖాస్తుకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో... తప్పులను సరిదిద్దే విషయంలో చిక్కుముడి వీడకపోతే వందలాది మంది ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరగనుంది. చక్రం తిప్పుతోన్న ఉద్యోగి రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించిన ప్రక్రియ సైన్స్ సెంటర్లో జరుగుతోంది. వచ్చిన సమస్యల్లో ప్రాధాన్యతను గుర్తించిæ పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కేవలం ఒక వర్గానికి చెందిన టీచర్ల సమస్యలను మాత్రం పరిగణలోకి తీసుకుంటున్నారని తెలిసింది. ఈ ప్రక్రియలో కీలకంగా మారిన ఓ ఉద్యోగి చక్రం తిప్పుతున్నారు. ఓ మంత్రితో కొందరు ఎమ్మెల్యేల సిఫార్సుతో వచ్చిన వాటికే ఈయన ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు. కొన్ని స్కూళ్లలో పోస్టులు కాపాడటం, ఇంకొన్ని స్కూళ్లలో పోస్టులు తొలగించడంలో సదరు ఉద్యోగి పాత్ర అధికంగా ఉందని తెలిసింది. అధికారులు సైతం ఈయనపైనే ఆధారపడటంతో ఎవరూ నోరు మెదపడం లేదు. మారిన షెడ్యూలు బదిలీలకు సంబంధించిన షెడ్యూలు మారింది. ఈనెల 16వ తేదీన యాజమాన్యాలు, కేటగిరి, సబ్జెక్టులు, మీడియం వారిగా ఉపాధ్యాయుల ఖాళీలలను ప్రకటిస్తారు. 17 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకుని హార్డ్‌కాపీలను సంబంధిత ఎంఈఓ, డెప్యూటీ డీఈఓలకు అందజేయాలి. 18 వరకు ఎంఈఓలు, డెప్యూటీ డీఈఓలు వాటిని పరిశీలించి తయారు చేసిన సీనియార్టీ జాబితాను డీఈఓ స్వీకరిస్తారు. 19న పెర్ఫార్మెన్స్, ఎన్టైటిల్మెంట్ పాయింట్ల ఆధారంగా తయారు చేసిన ప్రొవిజనల్ జాబితాను ప్రకటిస్తారు. 20,21 తేదీల్లో అభ్యంతరాలు చెప్పొచ్చు. ఆధారాలను డీఈఓ కార్యాలయంలో అందజేయాలి. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి 22న డీఈఓ ఓకే చేస్తారు. 22, 23 తేదీల్లో హెచ్ఎంలు, టీచర్లు ఆన్లైన్ దరఖాస్తుకు నిర్ధారణ చేయాలి. 24న వెబ్సైట్లో సీనియార్టీ జాబితా ఉంచుతారు. 25 నుంచి 27 వరకు హెచ్ఎంలు, టీచర్లు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. 29న ప్రొవిజినల్ అలాట్మెంట్ స్థానాల జాబితా వెల్లడిస్తారు. దీనిపై అభ్యంతరాలను 30న స్వీకరిస్తారు. జూలై 1, 2 తేదీల్లో జిల్లా కమిటీ అభ్యంతరాలను పరిశీలిస్తుంది. 3న ఖాళీలకు సంబంధించి తుది జాబితా ప్రకటిస్తారు. 4, 5 తేదీల్లో వెబ్ ద్వారా బదిలీ అయిన వారి ఉత్తర్వులు వెల్లడిస్తారు. జూలై 6న కొత్త స్కూళ్లలో చేరాలి. ఈ సమస్యలకు పరిష్కారమేదీ? – సర్దుబాటు కింద డీఈఓ ఉత్తర్వుల మేరకు ఇతర స్కూళ్లలో పదో తరగతి బోధించి అక్కడ వందశాతం ఉత్తీర్ణత సాధించినా టీచర్లకు పాయింట్లు పడటం లేదు. – పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ (1938), ఏపీటీఎఫ్ (257), హెచ్ఎం అసోసియేషన్, ఆపస్... ఇవీ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలు. వీటిని ధ్రువీకరిస్తూ స్వయంగా కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆన్లైన్లో మాత్రం మరో మూడు సంఘాల పేర్లు దర్శనమిస్తున్నాయి. – ఆన్లైన్లో నమోదు చేసిన సమయంలో అధికారులు చేసిన తప్పిదానికి టీచర్లు బలవుతున్నారు. ఉదాహరణకు కొత్తచెరువు మండలం బండ్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో సోషల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వెంకటాద్రి పుట్టిన తేదీ 4.8.1962. అయితే అధికారులు ఆన్లైన్లో 7.4.1962గా నమోదు చేశారు. ఈయన దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నిమార్లు ప్రయత్నించినా ‘డిటైల్స్ నాట్ ఫౌండ్’ అని వస్తోంది. ఇలాంటి బాధితులు వందలాది మంది ఉన్నారు. – బదిలీలకు అర్హత లేదంటూ రేషనలైజేషన్ ప్రభావంతో స్థానాలు కోల్పోయిన టీచర్లకు ఆన్లైన్లో దరఖాస్తు ఉంచలేదు. చేతులు దులుపుకొన్న ప్రభుత్వం - రామకృష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూలు ఇచ్చిన ప్రభుత్వం చేతులు దులుపుకొంది. క్షేత్రస్థాయిలో అనేక లోపాలున్నా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడం లేదు. దీంతో వేలాది మంది టీచర్లకు అన్యాయం జరుగుతోంది. ఆన్లైన్ విధానం వల్ల సామాన్య టీచర్లకు న్యాయం జరగాలి తప్ప అన్యాయం జరగకూడదు. అలాంటçప్పుడు ఈ వెబ్ కౌన్సెలింగ్ విధానం దండగే. -
సమస్యల పరిష్కారంలో ఏపీ సర్కార్ విఫలం
హైదరాబాద్: ఉద్యోగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ వైయస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్(వైఎస్సార్‌టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కె. జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.ఓబుళపతిలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2015 జనవరిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన కరవు భత్యం(డీఏ) ఇంత వరకు చెల్లించలేదని తెలిపారు. పదవ పీఆర్సీలో మిగిలిన జీవోలను కూడా జారీ చేయలేదన్నారు. చివరికీ ఉపాధ్యాయ బదిలీలలో పారదర్శకత, స్పష్టత లేదన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం టీచర్లను గందరగోళ పరిస్థితులలోకి నెట్టిందన్నారు. ఇప్పటికైనా బదిలీ ద్రువీకరణ పత్రాలను వెంటనే ఇచ్చి వెబ్ కౌన్సిలింగ్‌కి తెరదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.