మెడికల్ సీట్లలో కోత విధిస్తే సహించం
17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి
వాటిని బడా బాబుల చేతుల్లో పెడితే ఊరుకోం
విద్యార్థి సంఘాల హెచ్చరిక
ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రేపు నిరసన కార్యక్రమాలు
తిరుపతి సిటీ: రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటును అడ్డుకున్న కూటమి ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. మంగళవారం తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం బడాబాబుల చేతుల్లో పెట్టేందుకు ప్రయతి్నస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యను కార్పొరేట్ విద్యగా మార్చి.. పేద విద్యార్థులకు అందకుండా చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో వచ్చే రెండేళ్లలో రాష్ట్ర విద్యార్థులు సుమారు 1,750 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.
తక్షణమే పులివెందుల కాలేజీకి 50 సీట్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను అడ్డుకోవద్దని డిమాండ్ చేశారు. ఈ నెల 19న నిర్వహించబోతున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌ఓ, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ, వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘాలు నేతలు పాల్గొన్నారు.
పేద విద్యార్థుల కలలపై కూటమి కుట్ర: ఎంపీ
డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకునేందుకు ఎంతో శ్రమిస్తున్న పేద విద్యార్థులపై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో వైద్య విద్యను ప్రైవేటుపరం చేసి సంపన్నులకే ఎంబీబీఎస్ చేసే అవకాశం కల్పించే విధంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేయడం దారుణం.
తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకతో పోల్చిచూస్తే.. ఏపీలో కేవలం 50 శాతం సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో సైతం కోత విధిస్తే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కలి్పంచడంతోపాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment