తొలగించలేదు.. నేనే రాజీనామా చేశా!
శృంగార సీడీ వివాదంలో ఢిల్లీ మాజీ మంత్రి సందీప్‌కుమార్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆయన ప్రాథమిక స్వభ్యత్వాన్ని రద్దుచేసింది. ఇద్దరు మహిళలతో సందీప్‌కుమార్ సాన్నిహిత్యంగా గడిపిన వీడియో సీడీలు వెలుగుచూడటంతో సందీప్‌కుమార్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంత్రి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. వీడియో సీడీ వివాదం నేపథ్యంలో సందీప్‌కుమార్ బర్తరఫ్ చేసినట్టు మీడియాతో కేజ్రీవాల్ పేర్కొన్నారు. కానీ, సందీప్‌కుమర్ మాత్రం తనను మంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ తొలగించలేదని, తానే ఆ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చానని చెప్పారు.
వీడియో సీడీల వివాదం నేపథ్యంలో తాను రాజీనామాకు సిద్ధమని ఆయన గత నెల 31 సీఎం కేజ్రీవాల్‌కు రాసిన లేఖ వెలుగుచూసింది. ఇక ఈ వీడియో సీడీలను వెలుగులోకి తెచ్చిన ఓంప్రకాశ్ అనే వ్యక్తి శుక్రవారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరై తన వాదనలను వినిపించాడు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఈ సీడీని తనకు అందించాడని, ఒక మధ్యవర్తిలాగా దానిని తాను సీఎం కేజ్రీవాల్‌కు పంపించానని, అంతేకానీ ఆ వీడియో సీడీ ఎవరు పంపారో తనకు తెలియదని చెప్పారు.