సింగర్‌ను వివాహమాడిన నటుడు | Actor Balraj Syal Gets Married To Singer Deepti Tuli Shares Photo | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలెక్కిన సెలబ్రిటీ జంట

Published Sun, Sep 6 2020 2:34 PM | Last Updated on Sun, Sep 6 2020 2:55 PM

Actor Balraj Syal Gets Married To Singer Deepti Tuli Shares Photo - Sakshi

చండీగఢ్‌: ‘‘మంచి తరుణం మించిన దొరకదు’’ అన్న చందంగా సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌, సాండల్‌వుడ్‌ అన్న తేడా లేకుండా ఇప్పటికే చాలా మంది హీరోలు తమ బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి.. లాక్‌డౌన్‌ ఇచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక ఇప్పుడు కమెడియన్‌, రియాలిటీ షో ఖత్రోంకీ ఖిలాడీ 10 ఫేం బాల్‌రాజ్‌ సియల్‌ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. బాలీవుడ్‌ సింగర్‌ దీప్తి తులిని అతడు వివాహమాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ జలంధర్‌లో ఆగష్టు 7న తనను మెచ్చిన నిచ్చెలి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇన్నాళ్లు పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచిన బాల్‌రాజ్‌ భార్య దీప్తితో కలిసి ఉన్న ఇన్‌స్టాలో షేర్‌ చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశాడు. దీంతో ఈ జంటకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: పెళ్లి పీట‌లెక్క‌నున్న లేడీ క‌మెడియ‌న్‌)

ఇక తమ ప్రేమ- పెళ్లికి సంబంధించిన విషయాల గురించి బాల్‌రాజ్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘జూలై 2019.. చండీఘడ్‌లో షూటింగ్‌ చేస్తున్న సమయంలో తొలిసారి దీప్తిని కలిశాను. నేను హోస్ట్‌ చేస్తున్న షోలో ఆమె తన మ్యూజిక్‌ బ్యాండ్‌తో కలిసి పాటలు పాడుతోంది. తొలి చూపులోనే తను నాకు నచ్చేసింది. కానీ ఎందుకో తనకు నేను నచ్చనేమో అనిపించింది. తర్వాత ఖత్రోంకీ ఖిలాడీ షో చేసే సమయంలో తనకు మెసేజ్‌ చేశాను. నాకు కావాల్సిన రిప్లై లభించలేదు. అయినా నేను వదల్లేదు. టర్కీ, గ్రీస్‌ టూర్‌కి వెళ్లినపుడు తనతో సంభాషణ జరిపే అవకాశం వచ్చింది. (చదవండి: హీరోయిన్‌తో బిగ్‌బాస్‌ విన్నర్ పెళ్లి‌!)

అలా మా స్నేహం కొనసాగుతున్న సమయంలో నా బర్త్‌డే రోజు (జనవరి 26) గోవాలో తనకు ప్రపోజ్‌ చేశాను. ముందు తను ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అంగీకరించింది. పెద్దలకు విషయం చెప్పాం. మా జాతకాలు కలిశాయి. ఇంతలో లాక్‌డౌన్‌ డౌన్‌ వచ్చిపడింది. అయితే పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేక సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. మా ఇంటి నుంచి దీప్తి ఇంటికి కేవలం 15 నిమిషాల దూరంలోనే ఉంటుంది. కానీ తను నా జీవితంలోకి రావడానికి ఇదిగో ఇంత సమయం పట్టింది’’అంటూ నవ్వులు చిందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement