Balraj
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
బాన్సువాడ: కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాల్‌రాజ్..బుధవారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కార్యకర్తలు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిజామాబాద్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న ఆయన కోలుకుంటున్నట్లు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి..కామారెడ్డి జిల్లా బాన్సువాడ టికెట్ కోసం బాల్‌రాజ్ విశ్వప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి సీటు ఖరారు చేసింది. దీంతో బాల్‌రాజ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం బాన్సు వాడలో తన ఇంట్లో కార్యకర్తలతో సమావేశం ఏర్పా టు చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 2014 నుంచి పార్టీని నమ్ముకుని కార్యకర్తలను కా పాడుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే చివరకు తనను కాదని, వేరే ప్రాంతం వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏమిటంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆమరణ దీక్షకు దిగి ఇంతలోనే.. కాంగ్రెస్ అధిష్టానం మరోమారు టికెట్ విషయంలో పునరాలోచించాలని కోరుతూ బుధవారం ఉదయం బాల్‌రాజ్ తన ఇంటి ముందు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. మధ్యాహ్నం సమయంలో తనతో పాటు దీక్షలో కుర్చున్న కార్యకర్తలను భోజనం చేయండంటూ ఇంట్లోకి పంపించారు. తాను బాత్రూమ్కు వెళ్లి వచ్చారు. వెంటనే వాంతులు చేసుకోవడం ప్రారంభించడంతో కార్యకర్తలు కంగారు పడిపోయారు. కొందరు బాత్రూం లోపలకి వెళ్లి చూశారు. మోనో–65 పురుగుల మందు డబ్బా కనిపించడంతో బాల్‌రాజ్‌ను హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీజేపీ బాన్సువాడ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఆస్పత్రికి చేరుకుని బాల్‌రాజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
సింగర్‌ను వివాహమాడిన నటుడు
చండీగఢ్: ‘‘మంచి తరుణం మించిన దొరకదు’’ అన్న చందంగా సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, సాండల్‌వుడ్ అన్న తేడా లేకుండా ఇప్పటికే చాలా మంది హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి.. లాక్డౌన్ ఇచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక ఇప్పుడు కమెడియన్, రియాలిటీ షో ఖత్రోంకీ ఖిలాడీ 10 ఫేం బాల్‌రాజ్ సియల్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. బాలీవుడ్ సింగర్ దీప్తి తులిని అతడు వివాహమాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ జలంధర్‌లో ఆగష్టు 7న తనను మెచ్చిన నిచ్చెలి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇన్నాళ్లు పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచిన బాల్‌రాజ్ భార్య దీప్తితో కలిసి ఉన్న ఇన్‌స్టాలో షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: పెళ్లి పీటలెక్కనున్న లేడీ కమెడియన్) ఇక తమ ప్రేమ- పెళ్లికి సంబంధించిన విషయాల గురించి బాల్‌రాజ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘జూలై 2019.. చండీఘడ్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో తొలిసారి దీప్తిని కలిశాను. నేను హోస్ట్ చేస్తున్న షోలో ఆమె తన మ్యూజిక్ బ్యాండ్‌తో కలిసి పాటలు పాడుతోంది. తొలి చూపులోనే తను నాకు నచ్చేసింది. కానీ ఎందుకో తనకు నేను నచ్చనేమో అనిపించింది. తర్వాత ఖత్రోంకీ ఖిలాడీ షో చేసే సమయంలో తనకు మెసేజ్ చేశాను. నాకు కావాల్సిన రిప్లై లభించలేదు. అయినా నేను వదల్లేదు. టర్కీ, గ్రీస్ టూర్‌కి వెళ్లినపుడు తనతో సంభాషణ జరిపే అవకాశం వచ్చింది. (చదవండి: హీరోయిన్‌తో బిగ్‌బాస్ విన్నర్ పెళ్లి!) అలా మా స్నేహం కొనసాగుతున్న సమయంలో నా బర్త్‌డే రోజు (జనవరి 26) గోవాలో తనకు ప్రపోజ్ చేశాను. ముందు తను ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అంగీకరించింది. పెద్దలకు విషయం చెప్పాం. మా జాతకాలు కలిశాయి. ఇంతలో లాక్డౌన్ డౌన్ వచ్చిపడింది. అయితే పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేక సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. మా ఇంటి నుంచి దీప్తి ఇంటికి కేవలం 15 నిమిషాల దూరంలోనే ఉంటుంది. కానీ తను నా జీవితంలోకి రావడానికి ఇదిగో ఇంత సమయం పట్టింది’’అంటూ నవ్వులు చిందించాడు. -
పింఛన్ల బెంగ
నిద్రహారాలు మానేసి... కంగ్టి : ఆసరా పథకం కింద పింఛన్ అందలేదని ఓ వృద్ధుడు నిద్రాహారాలు మానేసి దిగులు చెందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. మెదక్ జిల్లా కంగ్టికి చెందిన 78 ఏళ్ల గుండప్ప, రామవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే వీరి తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోవడం లేదు. కాగా ఆరు నెలల క్రితం గుండప్ప మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ప్రతి నెలా వచ్చే పింఛన్‌తోనే మందులు తెచ్చుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసే క్రమంలో పింఛన్ నిలిపేసిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో మదనపడుతున్నాడు. ఈ క్రమంలో తనకు పింఛన్ ఇప్పించాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డాడు. ఆధార్‌కార్డులో 63 సంవత్సరాల వయస్సు తప్పుగా పేర్కొనడంతోనే పింఛన్ రాలేదని, ఈ విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటానని కార్యదర్శి వృద్ధుడికి తెలియజేశాడు. అయినా వినని గుండప్ప నిద్రాహారాలు మానేశాడు. తన భర్త ప్రాణాలు పోతే మీదే బాధ్యత అంటూ గుండప్ప భార్య రామవ్వ శుక్రవారం ఎంపీడీఓ సాయిబాబాను కలిసి విలపిస్తూ తెలిపింది. గుండెలు ఆగి... కొండపాక/పెద్దశంకరంపేట : ఆసరా పథకంలో పింఛ న్లు మంజూరు కాలేదన్న దిగులుతో గుండెపోటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలు మెదక్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. కొండపాకకు చెందిన నల్ల బాల్‌రాజు (55)కు మూడేళ్ల కిందట పక్షవాతం వచ్చి ఒక కాలు, ఒక చేయి చచ్చుబడ్డాయి. అప్పటి నుంచి బాల్‌రాజ్ మంచాన పడ్డాడు. రెండేళ్ల కిందట బాల్‌రాజుకు వికలాంగ పింఛన్ మంజూరు కాగా వాటితోఆసరా పొందుతున్నాడు. అయితే కొత్త ప్రభుత్వం విడుదల చేసిన పింఛన్ జాబితాలో బాల్‌రాజు పేరు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు గ్రామ నేతలు, అధికారుల చుట్టు తిరిగినా ఫలితం లేకుండాపోయింది. అప్పటి నుంచి దిగులుతో ఉన్న బాల్‌రాజు గురువారం రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. ఉదయమైనా బాల్‌రాజ్ నిద్రలేకపోవడంతో భార్య సత్తవ్వ దగ్గరు వెళ్లి లేపేందుకు యత్నించింది. అప్పటికే భర్త మృతి చెందిన విషయం తెలిసి సత్తవ్వ భోరున విలపించింది. మృతుడికి వివాహమైన ముగ్గురు కుమార్తెలు కవిత, అనిత, రమ్య, కుమారుడు స్వామి ఉన్నారు. పెద్దశంకరంపేట మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన సంగన్నగారి సుదర్శన్ (75), అనూషమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పింఛన్ జాబితాలో తన పేరు లేకపోవడంతో మూడు రోజులుగా మదనపడుతున్నాడు. గతంతో సుదర్శన్, ఆయన భార్యకు, వితంతువువైన చిన్న కుమార్తెకు పింఛన్ వచ్చేది. అయితే ప్రస్తుత జాబితాలో ముగ్గురి పేర్లూ లేకపోవడంతో సుదర్శన్ శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. డాక్టర్ వద్దకు తరలించే లోపే మృతి చెందాడు. -
మాజీ ఎంపీటీసీ దారుణ హత్య
వీణవంక, న్యూస్‌లైన్ : మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల బాల్‌రాజు(39) ఆదివారం రాత్రి రామకృష్ణాపూర్ వాగులో దారుణహత్యకు గురయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాల్‌రాజు వారం రోజులుగా పోతిరెడ్డిపల్లి గ్రామానికి కల్లు తాగడానికి వెళ్తున్నాడు. ఎప్పట్లాగే ఆదివారం కూడా అక్కడికి వెళ్లాడు. సాయంత్రం తన గ్రామానికి చెందిన కుమార్‌ను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని తిరిగి ఇంటికి బయల్దేరాడు. వీణవంక శివారులోని వాగు వద్దకు రాగానే కుమార్ బహిర్భూమికి వెళ్తానని బైక్ దిగాడు. బాల్‌రాజ్ తన వాహనాన్ని వాగులోంచి తోసుకుంటూ వస్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో బాల్‌రాజ్ తల పగిలి, కాలు విరిగి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలాన్ని హుజూరాబాద్ డీఎస్పీ సత్యనారాయణరెడ్డి, ఎస్సై సంతోష్‌కుమార్ పరిశీలించారు. కుమార్‌ను విచారించగా తాను బహిర్భూమికి వెళ్లానని, ముగ్గురు వచ్చి చంపారని పేర్కొన్నాడు. అయితే అతడి చొక్కా చినిగి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2006లో ఎంపీటీసీ సభ్యుడిగా.. బాల్‌రాజు తన స్వగ్రామమైన నర్సింగాపూర్ నుంచి 2006లో ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అప్పటి నుంచి మండల కేంద్రంలో తనకున్న చికెన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉండేవాడని స్థాని కులు పేర్కొన్నారు. ఇది రాజకీయ హత్యనా, లేక పాత కక్షలా కారణంగా చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.