
ఈ రోజుల్లో ప్రేమకథ!
కాలం మారే కొద్దీ మానవ సంబంధాలన్నీ కనుమరుగవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమకి ఎలాంటి స్థానం ఉంది? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఇక సె....లవ్’. సాయి రవి, దీప్తి జంటగా నాగరాజ్ దర్శకత్వంలో గన్నవరపు చంద్రశేఖర్, డుంగ్యోత్ పీర్యా నాయక్, గ్యార రవి నిర్మించిన ఈ చిత్రం పాటలను దర్శకుడు నాగేశ్వరరెడ్డి విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సంగీత దర్శకుడు మధు ఈ సినిమా కోసం మంచి పాటలు అందించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశాం. జూన్ 10న విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ‘‘రవిరాజా పినిశెట్టి, ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకుల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాను. దర్శకుడిగా నాకిది తొలి చిత్రం’’ అని దర్శకుడు చెప్పారు.