Sai Ravi
-
లవర్స్‌డేకి లవ్ !
సాయి, దీప్తి జంటగా నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇక సె..లవ్’. జైహిత సమర్పణలో గన్నవరపు చంద్రశేఖర్, డుంగ్రోతు పీర్యానాయక్, గ్యార రవి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 10న విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మా చిత్రం సమాజానికి చేటు చేస్తుందని, వివాహ వ్యవస్థ మీద గౌరవం లేనట్లుగా ఈ చిత్ర కథాంశం ఉందన్న కారణాలతో మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డ్ తిరస్కరించింది. దీంతో రివైజింగ్ కమిటీకి వెళ్లి విడుదలకు అనుమతి పొందాం. బ్యానర్.. హీరో.. దర్శక నిర్మాతలను బట్టి సెన్సార్ రూల్స్ మారతాయా? మా సినిమాను స్త్రీ స్వేచ్ఛ, మహిళాభ్యుదయం కోణంలో చూడాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మధు, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి. -
ఈ రోజుల్లో ప్రేమకథ!
కాలం మారే కొద్దీ మానవ సంబంధాలన్నీ కనుమరుగవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమకి ఎలాంటి స్థానం ఉంది? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఇక సె....లవ్’. సాయి రవి, దీప్తి జంటగా నాగరాజ్ దర్శకత్వంలో గన్నవరపు చంద్రశేఖర్, డుంగ్యోత్ పీర్యా నాయక్, గ్యార రవి నిర్మించిన ఈ చిత్రం పాటలను దర్శకుడు నాగేశ్వరరెడ్డి విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సంగీత దర్శకుడు మధు ఈ సినిమా కోసం మంచి పాటలు అందించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశాం. జూన్ 10న విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ‘‘రవిరాజా పినిశెట్టి, ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకుల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాను. దర్శకుడిగా నాకిది తొలి చిత్రం’’ అని దర్శకుడు చెప్పారు. -
పాత కథలకు ‘ఇక సె..లవ్’
వెండితెరపై ఇప్పటిదాకా వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందన్నారు దర్శకుడు నాగరాజు. ఆయన దర్శకత్వంలో సాయి రవి, దీప్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇక సె..లవ్’. గ్రీన్ సన్ ఇన్నోవేటివ్స్, జైహిత క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఏప్రిల్ మొదటి వారంలో చిత్రీకరణ పూర్తవుతుంది. మే నెలలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి. శ్రీనివాస రెడ్డి.