
లవర్స్‌డేకి లవ్ !
సాయి, దీప్తి జంటగా నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇక సె..లవ్’. జైహిత సమర్పణలో గన్నవరపు చంద్రశేఖర్, డుంగ్రోతు పీర్యానాయక్, గ్యార రవి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 10న విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మా చిత్రం సమాజానికి చేటు చేస్తుందని, వివాహ వ్యవస్థ మీద గౌరవం లేనట్లుగా ఈ చిత్ర కథాంశం ఉందన్న కారణాలతో మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డ్ తిరస్కరించింది. దీంతో రివైజింగ్ కమిటీకి వెళ్లి విడుదలకు అనుమతి పొందాం. బ్యానర్.. హీరో.. దర్శక నిర్మాతలను బట్టి సెన్సార్ రూల్స్ మారతాయా? మా సినిమాను స్త్రీ స్వేచ్ఛ, మహిళాభ్యుదయం కోణంలో చూడాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మధు, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి.