Deepthi
-
వీణల విందుగా...
వీణ రాగాల వెన్నెలలో పులకించిపోయిన దీప్తికి– వీణ పాఠమేప్రాణమై పోయింది. వీణ విహంగ రెక్కలపై ఆమె కొత్త ప్రపంచాలను చూసింది. ‘ఈ తరం అమ్మాయిలు కూడా వీణ నేర్చుకుంటున్నారా!’ అనేది కొందరి ఆశ్చర్యం. నేర్చుకుంటే ఎంత బాగుంటుందో దీప్తిలాంటి అమ్మాయిలు తమ విజయాల ద్వారా నిరూపిస్తున్నారు...తాను ఒకటి తలిస్తే వీణ ఒకటి తల్చింది!అవును.. మచిలీపట్నానికి చెందిన మొదలి చంద్రశేఖర్ దగ్గర గాత్రం, కీబోర్డు నేర్చుకుందామని వెళ్లిన అప్పికట్ల దీప్తి అంతలోనే మనసు మార్చుకుంది. వీణపై ఆసక్తి పెంచుకుంది. పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది. సాధారణంగా చాలామందికి నేర్చుకోవడంలో ఆరంభ శూరత్వం ఉంటుంది. అయితే దీప్తి విషయంలో అలా జరగలేదు. ‘ఇంకా ఏదో నేర్చుకోవాలి’ అనే తపనతో ఎప్పటికప్పుడు ఉత్సాహంగా పాఠాలు నేర్చుకునేది. దీప్తి ప్రస్తుతం విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతోంది.‘ఇంజినీరింగ్ చదివే అమ్మాయికి వీణలెందుకు.. చదువు దెబ్బతింటుంది కదా!’ అనేది కొందరి సందేహం. ‘చదువు దెబ్బతినదు. మరింత చదువుకోవాలనిపిస్తుంది’ అంటుంది దీప్తి. ఎందుకంటే వీణరాగాల సాధనలో ఒత్తిడి తగ్గి మనసు తేలిక అవుతుంది. ఏకాగ్రత అంతకంతకూ పెరుగుతుంది. ఏది చదివినా ఇట్టే గుర్తుండి పోతుంది అంటుంది దీప్తి. నాలుగు సంవత్సరాలపాటు కర్ణాటక సంగీత సంప్రదాయ వీణ కోర్సును చదివి ఫస్ట్ క్లాస్‌లో సర్టిఫికెట్‌ను సాధించిన దీప్తి ఆ తరువాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో వీణలో డిప్లమో చేసింది.నేర్చుకోవడం ఒక ఎత్తయితే, ప్రేక్షకులు మెచ్చేలా ప్రదర్శన ఇవ్వడం మరో ఎత్తు. మొదటిసారిగా సంగీత కళాకచేరిలో మంచి మార్కులు కొట్టేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ‘యువభేరి’ లో బహుమతులు సాధించింది. ఎన్నో పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకుంది. తెలంగాణ రాజ్‌భవన్ లో వీణ వాద్య కచేరి చేసి గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ ప్రశంసలు అందుకుంది. వీణ వాద్య ప్రతిభతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు త్రివిధ దళాధిపతుల ప్రశంసలు అందుకుంది. ‘రాష్ట్రపతి భవన్ లో వీణ ప్రదర్శన ఇవ్వడం, ప్రముఖులను దగ్గరి నుంచి చూడడం, వారి ఆశీర్వాదం అందుకోవడం మరచిపోలేని అనుభూతి’ అంటుంది దీప్తి. చదువూ, సంగీతంలోనే కాదు కరాటేలోనూ రాణిస్తున్న దీప్తి మరిన్ని కళలలో విజయాలు సాధించాలని ఆశిద్దాం. ధ్యానం లాంటి వీణవీణ అనేది కేవలం కచేరీల కోసం కాదు. నా దృష్టిలో వీణ వాద్య సాధన అనేది ఒకలాంటి ధ్యానం. వీణరాగాల వెలుగులో మనసు ఉత్తేజితం అవుతుందన్నది కాదనలేని సత్యం. – అప్పికట్ల దీప్తి – అంబటి శేషుబాబు సాక్షి, మచిలీపట్నం -
ఖేల్‌రత్న, అర్జున అవార్డు గ్రహీతలకు వైఎస్ జగన్ అభినందనలు
అర్జున అవార్డుకు ఎంపికైన జ్యోతి యర్రాజీకి వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ పేరు తెచ్చిన ఈ అథ్లెట్‌ను అభినందించారు. కఠిన శ్రమ, అంకితభావం, నిబద్ధత వల్లే జ్యోతి ఈస్థాయికి చేరుకుందని ప్రశంసలు కురిపించారు.జాతీయ స్థాయిలో రికార్డులుట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు, 400 మీటర్ల హార్డిల్స్ విభాగంలో సరికొత్త బెంచ్ మార్కులు సృష్టిస్తున్న జ్యోతి యర్రాజీ క్రీడా నైపుణ్యాలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా కొనియాడారు. విశాఖపట్నంలోని సాధారణ కుటుంబంలో జన్మించి.. జాతీయ స్థాయిలో రికార్డులు సాధించిన జ్యోతి దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అదే విధంగా.. జ్యోతి యర్రాజీ భవిష్యత్తులోనూ తన విజయపరంపరను కొనసాగించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రపంచ వేదికపై సత్తా చాటి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని జ్యోతిని విష్ చేశారు.మొదటి భారత అథ్లెట్‌గా జ్యోతి రికార్డుకాగా విశాఖ వాసి జ్యోతి యర్రాజీని ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడామంత్రిత్వ శాఖ గురువారం ఇందుకు సంబంధించి గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా అథ్లెటిక్స్ విభాగంలో జ్యోతి కి అర్జున అవార్డు వచ్చింది. ఈ నెల 17 వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా జ్యోతి పురస్కారం అందుకోనుంది.ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలను జ్యోతి యర్రాజీ సొంతం చేసుకుంది. వరల్డ్ ర్యాంకింగ్స్ కోటాలో ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న ఆమె..100 మీటర్ల హర్డిల్స్‌లో బరిలోకి దిగింది. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడిన మొదటి భారత అథ్లెట్‌గా ఆమె రికార్డులకెక్కింది.దీప్తి జీవాంజికి వైఎస్ జగన్ అభినందనలుజ్యోతి యర్రాజీతో పాటు అర్జున అవార్డు గెలుచుకున్న తెలంగాణ పారా అథ్లెట్, వరంగల్‌కు చెందిన దీప్తి జీవాంజికి కూడా వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.ఖేల్‌రత్న అవార్డులకు ఎంపికైన వారికి శుభాకాంక్షలుఅదే విధంగా.. ఖేల్‌రత్న అవార్డులకు ఎంపికైన దొమ్మరాజు గుకేశ్(చెస్), మనూ భాకర్(షూటింగ్), హర్మన్‌ప్రీత్ సింగ్(హాకీ), ప్రవీణ్ కుమార్(పారా అథ్లెట్)లను కూడా వైఎస్ జగన్ ఈ సందర్భంగా అభినందించారు. అసాధారణ విజయాలతో వీరంతా దేశం గర్వించేలా చేశారని... రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు, అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. భారతీయ క్రీడలను మరింత ఎత్తుకు తీసుకుని వెళ్లటంలో వీరి కృషి అభినందనీయమని వైఎస్ జగన్ ప్రశంసించారు.చదవండి: జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన -
నేను చనిపోతున్నా.. నా బిడ్డ జాగ్రత్త
జ్యోతినగర్(రామగుండం): ‘అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి.. ప్రేమ వివాహం చేసుకుని మీకు దూరంగా ఉన్నా.. మొదట్లో ఎంతో ప్రేమగా చూసుకున్న మా ఆయన నిత్యం వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక పోతున్నా. నేను చనిపోతున్నా.. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి’.. అంటూ సెల్ఫీ వీడియో తీసి ఒక వివాహిత బలవన్మరణానికి పాల్ప డింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద పల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్‌లో నివసిస్తున్న నరేందర్ (32), గోదావరిఖనికి చెందిన దేవర కొండ దీప్తిని 2021న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. నరేందర్, దీప్తి స్థానిక అన్నపూర్ణ కాలనీలోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయి తే, కట్నం తీసుకు రావాలని నరేందర్ కొంతకాలంగా దీప్తిని వేధిస్తున్నాడు. ఇదే విషయమై శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన దీప్తి.. భర్త వేధిస్తున్నందున చనిపోతున్నానని సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియో తీసింది. ఉరేసుకున్న దీప్తిని గమనించిన నరేందర్ తన మిత్రుల సాయంతో ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కాగా, తన బిడ్డను నరేందర్ చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని.. దీప్తి తండ్రి దివాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్, ఎస్ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. -
సీరియల్లో మాత్రమే అలా.. నిజ జీవితంలో అదిరిపోయే గ్లామర్‌తో ఫిదా
-
పారా అథ్లెట్ దీప్తికి సీఎం రేవంత్ భారీ నజరానా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వరంగల్‌కు చెందిన పారా అథ్లెట్ దీప్తి జీవన్ జీ.. పారిస్‌లో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో సత్తా చాటారు. మహిళల 400 మీటర్ల టీ20 క్లాస్‌లో దీప్తి కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో అథ్లెట్ దీప్తికి సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరానా ప్రకటించారు.ఒలంపిక్స్‌లో సత్తా చాటినందుకు గాను దీప్తికి రూ. కోటి నగదుతో పాటు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అలాగే, దీప్తి కోచ్‌కు రూ. 10 లక్షల నజరానా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని పారా గేమ్స్ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. -
శెభాష్ బిడ్డా: హేళనలు, అవమానాల నుంచి పారిస్ పతకం దాకా (ఫొటోలు)
-
లేలేత అందచందాలతో మైమరిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా (ఫొటోలు)
-
చందనను ట్రాప్ చేశారా? అలా చెయ్యమంది ఎవరు?
కరీంనగర్: ఇంట్లో నగలు, నగదు ఉన్న సమయంలోనే ప్రియుడితో కలిసి పరార్ కావాలన్న ఆలోచన చందనకు ఎవరు కల్పించారు? ఈ దిశలో ఆమెను ఎవరైనా గైడ్ చేశారా? ప్రేమ మోజులో ఆ యువతి వారి ట్రాప్‌లో పడిపోయిందా? ప్రియుడితో కలిసి వెళ్లకుండా అడ్డుకున్న అక్కను చివరకు హతమార్చే పరిస్థితికి దిగజారిందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతనెల 29 వేకువజామున పట్టణంలోని భీమునిదుబ్బలో ప్రియుడు ఉమర్ షేక్‌తో కలిసి చందన తన అక్క దీప్తిని సినీఫక్కీలో హత్యచేసిన కేసులో వెలుగులోకి వస్తున్న కోణాలు ఆసక్తి రేపుతున్నాయి. నాలుగేళ్ల పరిచయం.. ► 2019లో చందన బీటెక్ చదవడం కోసం హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో చేరింది. ► తన కంటే ఒక ఏడాది సీనియర్ ఉమర్ షేక్ సుల్తాన్ డిటెయిన్ కావడంతో చందనకు పరిచయం అయ్యాడు. ► అప్పటినుంచి వీరి ప్రేమాయణం సాగుతున్నట్లు సమాచారం. ► హాస్టల్లో ఉంటూ చందన తరచూ ఉమర్ షేక్ సుల్తానా ఇంటికి వెళ్లివస్తుండేదని తెలిసింది. ► ఈక్రమంలో వీరి ప్రేమ వ్యవహారం కొన్నాళ్లకు దీప్తికి తెలిసింది. ► ఆ తర్వాత ఇంట్లోనూ అందరికీ తెలిసి గొడవలు జరిగినట్లు సమాచారం. ► దీంతో చందన తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లు దీప్తి, చందనకు వివాహాలు చేయాలని సన్నాహాలు ప్రారంభింంచారు. ► ఆయన ఆంధ్రాకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడే సంబంధాలు చూస్తున్నారు. ► పెళ్లి చేసుకోవాలని ఇంట్లో పెరుగుతున్న ఒత్తిడి గురించి చందన తన ప్రియుడికి చెప్పినట్లు సమాచారం. ► అయితే, ‘మనకు జాబ్ లేదు.. ఎలాబతుకుతాం’ అని డబ్బు, నగలు తీసుకొచ్చేలా ఉమర్ షేక్.. చందన దృష్టి మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమా.. గతనెల 28వ తేదీన ఉదయం హైదరాబాద్ నుంచి కోరుట్లకు బయలుదేరిన విషయాన్ని ఉమర్ షేక్ తన తల్లి ఆలియా, చెల్లె ఫాతిమాకు చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే, ఆ యువకుడు, అతడి కుటుంబానికి చందనపై కేవలం ప్రేమ మాత్రమే ఉండి ఉంటే నగలు, డబ్బు అవసరం లేదని చెప్పి ఉండవచ్చు కదా? అనే సందేహాలు వేధిస్తున్నాయి. సోమవారం రాత్రి దీప్తి మద్యం మత్తులో ఉన్న సమయంలో చందన, ఉమర్ కలిసి నగలు, డబ్బు సర్దే పనిచేయకుండా చడీచప్పుడు కాకుండా పరారై ఉంటే.. దీప్తి హత్యకు ఆస్కారం ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమర్ షేక్ తల్లి గతంలో లెక్చరర్‌గా పనిచేసినట్లు సమాచారం. విద్యాధికులైన ఉమర్ షేక్ కుటుంబీకులు.. చందన, ఉమర్ కలిసి మంగళవారం నగలు, డబ్బులతో కారులో హైదరాబాద్ చేరుకోగానే.. ఇది తప్పని చెప్పి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాకుండా అంతాకలిసి నగలు, డబ్బులతో తప్పించుకునే ప్రయత్నం చేయడం.. చందనను గుర్తుపట్టకుండా బుర్కా వేసి కారులో తీసుకెళ్లడం.. టోల్గేట్లకు చిక్కకుండా అడ్డదారుల్లో పయనించడం.. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందన్న అభిప్రాయాలకు ఊతమిస్తోంది. రిమాండ్‌కు నిందితులు.. దీప్తి హత్య, డబ్బులు, నగలు ఎత్తుకెళ్లిన కేసులో నిందితులు బంక చందన, ఆమె ప్రియుడు ఉమర్‌షేక్ సుల్తానా, ఇతడి తల్లి ఆలియా, చెల్లి ఫాతిమాతోపాటు బంధువు హఫీజ్‌ను ఆదివారం మధ్యాహ్నం జడ్జి వద్ద పోలీసులు హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నిందితులపై ఐపీసీ 302, 201, 120(బీ),380 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆయన వివరించారు. -
దీప్తిది హత్యే! కొలిక్కి వచ్చిన కోరుట్ల టెక్కీ కేసు
సాక్షి, జగిత్యాల: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోరుట్ల టెక్కీ దీప్తి మర్డర్ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారం వల్లే.. దీప్తిని ఆమె సోదరి చందనే హత్య చేసినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ప్రాథమిక విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తుండగా.. సాయంత్రం పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. తన ప్రియుడితో వెళ్లిపోయే క్రమంలో.. దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి, చున్నీ చుట్టి వెళ్లిపోయినట్టు చందన ఒప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. కోరుట్ల దీప్తి కేసులో.. సోదరి చందన, ఆమె ప్రియుడు, ప్రియుడి తల్లి, అతని తరపు మరో బంధువు, కారు డ్రైవర్ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నాలుగు బృందాలుగా విడిపోయి.. కోరుట్లలోని భీమునిదుబ్బకు చెందిన బంక దీప్తి ఆగస్టు 29వ తేదీన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే రాత్రి ఆమె చెల్లెలు చందన అదృశ్యమైంది. ఓ యువకుడితో కలిసి బస్టాండ్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. ఈలోపు ఇంట్లో మందు బాటిల్స్ దొరకడం, బస్టాండ్ సీసీటీవీ ఫుటేజీలో ఉంది చందన కాదని నిర్ధారణ కావడం, సోదరిని తాను చంపలేదని చందన సోదరుడికి వాయిస్ మెసేజ్ పంపడం.. చందన ఆచూకీ విషయంలో రకరకాల ప్రచారం కేసును మరింత గందరగోళంగా మార్చేశాయి. దీంతో.. చందన దొరికితేనే ఈ కేసు మిస్టరీ వీడుతుందని పోలీసులు భావించారు. అయినప్పటికీ.. పోలీసులు మాత్రం దీప్తి కేసు దర్యాప్తులో ట్రాక్ తప్పలేదు. దీప్తి తండ్రి శ్రీనివాసరెడ్డి తన చిన్న కూతురు చందనతో పాటు ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా కేసును దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో మూడు, నాలుగు బృందాలుగా విడిపోయి దీప్తి సోదరి చందన జాడ కోసం వెతికారు. ఈ క్రమంలో.. ఒంగోలు వైపు వెళ్తున్నట్లు సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. టంగుటూరులోని టోల్‌గేట్‌ను తప్పించుకుని ఆలకూరపాడు వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాలతో.. తనిఖీలు చేపట్టగా.. ఒంగోలులోని ఓ లాడ్జిలో వాళ్లను పట్టుకుని జగిత్యాల పోలీసులకు అప్పగించారు. నిందితులను జగిత్యాలకు తీసుకువచ్చి పోలీసులు విచారించారు. ప్రేమకు నిరాకరణ.. దీప్తితో గొడవ చందన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చేసింది. ఆ సమయంలో ఓ సీనియర్‌తో ఆమె ప్రేమలో పడింది. అయితే ఇద్దరి మతాలు వేరు. అందుకే వాళ్ల ప్రేమ-పెళ్లికి చందన తల్లిదండ్రులు, అక్క దీప్తి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఊరికి వెళ్లిన టైంలో.. దీప్తితో చందన గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆపై ముక్కూ, మూతికి ప్లాస్టర్ వేసిందని, ఊపిరి ఆడక దీప్తి మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో చందన, ఆమెతో ఉన్న ముగ్గురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. ఆపై డీఎస్సీ భాస్కర్ ఈ కేసుకు సంబంధించి నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి.. పూర్తి వివరాలు సాయంత్రం మీడియాకు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు?
కోరుట్ల: సంచలనం రేపిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బంక దీప్తి(24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటనలో నిందితులుగా భావిస్తున్న బంక చందన(21), ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పరిసరాల్లో తలదాచుకున్న వీరిద్దరినీ పోలీసులు పట్టుకుని కోరుట్లకు తరలిస్తున్నట్లు తెలిసింది. మూడు రోజులుగా గాలింపు..! ► పట్టణానికి చెందిన బంక దీప్తి మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. ► అప్పటినుంచి ఆమె చెల్లెలు చందన పరారీలో ఉండటం కలకలం రేపిన క్రమంలో పోలీసులు ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. ► అక్క దీప్తి చనిపోవడంలో తన ప్రమేయం లేదని చందన తన తమ్ముడు సాయికి వాయిస్ మేసేజ్ పంపిన క్రమంలో ఆమె సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ► బుధ, గురువారాల్లో మెట్పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు పోలీసు బృందాలు చందన ఆచూకీ కోసం హైదరాబాద్‌లో గాలించాయి. ► అక్కడ నుంచి చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ మకాం మార్చినట్లు గుర్తించినట్లు తెలిసింది. చందనతోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు పాస్‌పోర్ట్‌లు ఉండటం వారు రూ.2 లక్షల నగదు, సుమారు రూ.90 లక్షల విలువైన బంగారం ఇంటి నుంచి తీసుకెళ్లారని తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఫిర్యాదుతో ఆ డబ్బుతో వారిద్దరూ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు లుక్ అవుట్ నోటిసులు జారీచేశారు. హైదరాబాద్– బెంగళూర్ మార్గంలో.. ఆంధ్రాలో బంక చందన బంధువులు ఒంగోలు జిల్లాకు చెందిన వారు కావడంతో ఆంధ్రప్రదేశ్‌కు ఆమె వెళ్లి ఉంటుందని భావించిన పోలీసులు ఆ దిశలో గాలింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచి బెంగళూర్ మార్గంలో అనంతపురం, ప్రకాశం జిల్లా పరిసరాల్లో చందన ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్లు గురువారం రాత్రి పోలీ సులు గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున చందన ఆంధ్రాలోని ప్రకాశం జిల్లా పరిసరాల్లో ఉన్నట్లుగా గుర్తించి పకడ్బందీ ప్రణాళికతో అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి వారిద్దరినీ కోరుట్లకు తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న చందన, ఆమె బాయ్ఫ్రెండ్లు వాస్తవాలు వెల్లడిస్తే దీప్తి అనుమానాస్పద మృతి వెనుక అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం విచారణ చేయనున్నట్లు సమాచారం. -
కోరుట్ల దీప్తి కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో చందన, ఆమె ప్రియుడు
సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల దీప్తి మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హైదరాబాద్ శివారులో మృతురాలి సోదరి చందన, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్తి కేసులో నిందితురాలిగా భావిస్తున్న చెల్లెలు చందనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు బృందాలుగా మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో కీలకం కానున్న పోస్ట్ మార్టం రిపోర్ట్.. వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం ఇంట్లో ఆమె చెల్లెలు చందన, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి రాత్రి ఇంట్లో మద్యం పార్టీ చేసుకున్న మృతురాలు దీప్తి.. అనుమానాస్పదంగా మృతి చెందింది. చదవండి: కోరుట్ల దీప్తి కేసులో కీలక పరిణామం చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయంలో రూ. 2 లక్షల నగదు, రూ.90 లక్షలు విలువ చేసే కిలోన్నర బంగారు నగలు, పాస్‌పోర్టు తీసుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. చందన బాయ్‌ఫ్రెండ్ హైదరాబాదీగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. చందన ఫోన్‌కాల్ డేటా ఆధారంగా బాయ్ ఫ్రెండ్ వివరాలు పోలీసులు సేకరించారు. ఇద్దరి సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండటంతో ఆచూకీ కనుక్కోవడం కష్టతరంగా మారింది. దీప్తి, చందనలకు మద్యం బాటిళ్లు ఎవరు తెచ్చి ఇచ్చారన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. హైదరాబాద్ బాయ్ ఫ్రెండ్ తీసుకుని వచ్చాడా? లేక స్థానికంగా ఉన్న ఎవరైనా కొనుక్కుని తెచ్చారా? అన్న విషయం తేలలేదు -
కోరుట్ల దీప్తి కేసులో కీలక పరిణామం
కోరుట్ల: బంక దీప్తి అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలిగా భావిస్తున్న చెల్లెలు చందనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కోరుట్లలోని తన ఇంట్లో మంగళవారం మ ధ్యాహ్నం సాఫ్ట్వేర్ ఇంజినీర్ బంక దీప్తి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీప్తి చనిపోవడం, ఆమె చెల్లెలు చందన కనిపించకపోవడంతో ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పరారైనట్లు పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో ఆమె ఆ చూకీ కోసం రెండు రోజులుగా గాలింపు చేపట్టారు. చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయంలో రూ. 2 లక్షల నగదు, రూ.90 లక్షలు విలువ చేసే కిలోన్న ర బంగారు నగలు, పాస్‌పోర్టు తీసుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. చందన బాయ్‌ఫ్రెండ్ హైదరాబాదీగా పోలీసులు గుర్తించిన ట్లు తెలిసింది. చందన ఫోన్‌కాల్ డేటా ఆధారంగా బాయ్ ఫ్రెండ్ వి వరాలు పోలీసులు సేకరించారు. ఇద్దరి సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండటంతో ఆచూకీ కనుక్కోవడం కష్టతరంగా మారింది. దీప్తి, చందనలకు మద్యం బాటిళ్లు ఎవరు తెచ్చి ఇచ్చారన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. హైదరాబాద్ బాయ్ ఫ్రెండ్ తీసుకుని వచ్చాడా? లేక స్థానికంగా ఉన్న ఎవరైనా కొనుక్కుని తెచ్చారా? అన్న విషయం తేలలేదు. కోరుట్లలో ఉన్న వైన్‌షాపుల వద్ద సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించినప్పటికీ సోమవారం సాయంత్రం రెండు, మూడుసార్లు విద్యుత్ సరాఫరా లో అంతరాయం కలగడంతో సీసీ కెమెరాల్లో ఎలాంటి రికార్డులు లేనట్లు తెలిసింది. ఇప్పటికే కోరుట్ల సర్కిల్లోని ఇద్దరు ఎస్సైలు తమ బృందాలతో క లిసి చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ కోసం హైదరాబాద్‌లో గాలింపులు చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ సెల్‌ఫోన్ సిమ్‌కార్డు కేవైసీ అడ్రస్ ప్రకారం వెతకగా అక్కడ ఎవరి ఆచూకీ దొరకలేదని సమాచారం. చందన పాస్‌పోర్టును వెంట తీసుకెళ్లడం, డబ్బులు, బంగారం వెంట ఉండటంతో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి విదేశాలకు పరారవుతారన్న సందేహాలతో ఎయిర్‌పోర్ట్‌లకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తె లిసింది. చందన బీటెక్ రెండో సంవత్సరంలోనే డిటెయిన్ అయినట్లు సమాచారం. ఈ విషయం ఇంట్లో తెలియకుండా దాచిపెట్టి హైదరాబాద్‌లో రెండేళ్లు బీటెక్ చేస్తున్నట్లుగా ఇంట్లో వారిని నమ్మించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా పుకార్లు రావడం కలకలం రేపింది. ఈ విషయమై కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించగా చందన కోసం రెండు పోలీసు బృందాల గాలింపులు కొనసాగిస్తున్నాయని ఎవరిని అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. -
నా తప్పేం లేదు.. నాకు అక్కను చంపే ఉద్దేశమే లేదు..
‘సాయి... నేను, దీప్తి అక్క మద్యం తాగాలని అనుకున్నం.. కానీ నేను తాగలేదు.. అక్కనే తాగింది.. నేను నా ఫ్రెండ్‌తో తెప్పించా.. అది ఒప్పుకుంటా.. ఇంకా అక్కవాళ్ల బాయ్‌ఫ్రెండ్‌ను పిలుస్తా అంటే నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంది.. సరే లే నీ ఇష్టం అన్నా.. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోదామనుకున్నా.. నిజమే.. అది నేను ఒప్పుకుంటా.. అక్కకు చెప్పి వెళదామనుకున్నా.. కానీ.. అప్పటికే అక్క హాఫ్ బాటిల్ వోడ్కా కంప్లీట్ చేసింది.. అంతకుముందే ఫోన్లో మాట్లాడింది.. తర్వాత సోఫాలోకి వెళ్లి పడుకుంది.. నేను లేపితే లేవలేదు.. పడుకుంది కదా.. అని డిస్టర్బ్ చేయలేదు.. చాన్స్ దొరికింది కదా అని.. నేనే ఇంట్లో నుంచి వెళ్లిపోయా.. నా తప్పేం లేదు.. నాకు అక్కను చంపే ఉద్దేశమే లేదు.. ఇలా అవుతుందని అనుకోలేదు.. అక్కను నేనెందుకు చంపుతా.. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇంట్లో నుంచి తీసుకెళ్లా’ – తన తమ్ముడు సాయి మొబైల్‌కి చందన పంపిన వాయిస్ మెసేజ్ ఇది.. జగిత్యాల: చందన తాను అక్కను చంపలేదని తమ్ముడు సాయికి వాయిస్ మేసేజ్ పంపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెసేజ్ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. కోరుట్ల బస్టాండ్‌లో మంగళవారం ఉదయం కనిపించిన సీసీ ఫుటేజీ చిత్రాలు.. చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌వి కావనే సమాచారంతో విచారణ గందరగోళంగా మారింది. అయితే, చందన బాయ్ ఫ్రెండ్ కారులో వచ్చి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చందన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు. ఆమె వాయిస్ మేసేజ్ వచ్చిన సెల్‌ఫోన్ ఆధారంగా రెండు బృందాలు హైదరాబాద్‌కు చేరుకుని గాలింపు చేపట్టాయి. దీప్తి ఒంటిపై గాయాలు..!? ► అనుమానాస్పదంగా మృతి చెందిన దీప్తి ఒంటిపై స్వల్పగాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు సమాచారం. ► దీప్తి టీషర్ట్ కింద శరీరం కాస్త కమిలిన గాయాలు, చెంపపై గీసుకుపోయినట్లుగా ఓ చిన్నగాయం ఉన్నట్లు తెలిసింది. ► దీంతోపాటు దీప్తి చేతులు కట్టేసినట్లుగా మణికట్టు వద్ద గాయం ఉన్నట్లు సమాచారం. ► ఒకవేళ చేయి విరిగి ఉంటే బంక దీప్తి హత్యకు గురైందన్న అంశానికి మరింత బలం చేకూరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ► సాధారణంగా పోస్టుమార్టం నివేదికకు సంబంధించిన షార్ట్ రిపోర్టు అదే రోజు అందించే ఆనవాయితీ ఉన్నా.. వైద్యులు ఈ విషయంలో కుదరదని చెప్పినట్లు తెలిసింది. డబ్బులు, నగలు మాయం బంక శ్రీనివాస్‌రెడ్డి(దీప్తి తండ్రి) ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, సుమారు 50 తులాల వరకు బంగారు ఆభరణాలు మాయమైనట్లు సమాచారం. ఇంట్లోనుంచి వెళ్లిపోయిన చందన.. డబ్బులు తాను తీసుకున్నట్లు వాయిస్ మేసేజ్‌లో చెప్పినా.. బంగారం విషయం ఎత్తలేదు. బంగారం సైతం చందన తీసుకెళ్లి ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చందన తన క్లాస్మేట్ ఒకరితో కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటోందని, అతడితో కలిసి డబ్బులు, నగలు తీసుకు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దారి మళ్లిస్తున్నారా? చందన తమ్మునికి పంపిన వాయిస్ మేసేజ్‌లో దీప్తి తన బాయ్‌ఫ్రెండ్‌కు పోన్ చేసి ఇంటికి రమ్మంటానని చెప్పిందని, తాను వద్దన్నానని చెప్పిన తీరు సంఘటనను దారి మళ్లించేందుకేనా? అనే అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. వాయిస్ మేసేజ్‌తో ఇంట్లో నుంచి చందన వెళ్లిపోయిన తర్వాత వేరెవరో వచ్చి ఉంటారన్న రీతిలో అనుమానాలు వచ్చేలా ఉండటం గమనార్హం. చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసి దీప్తి చనిపోవడానికి తమకు సంబంధం లేదని నమ్మించడానికి ఈ రకంగా మేసెజ్ పెట్టారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ దిశలో పోలీసు దీప్తి సెల్‌ఫోన్ డాటాను పరిశీలిస్తున్నారు. -
Korutla Death Mystery: కోరుట్ల టెక్కీ దీప్తి కేసులో సరికొత్త ట్విస్ట్
జగిత్యాల: కోరుట్ల సాఫ్ట్వేర్ దీప్తి మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. దీప్తి అనుమానాస్పద మృతి తర్వాత ఓ యువకుడితో వెళ్లిపోయిన దీప్తి సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. తాము మద్యం సేవించిన మాట వాస్తవమేనని, కానీ తాను అక్కను చంపలేదంటూ.. తన సోదరుడు సాయికి చందన ఆ వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. ‘‘అరేయ్ సాయి నేను చందక్కను రా.. నిజమెంటో చెప్పాలారా. దీప్తిక్క నేను తాగుదామనుకున్నాం. కానీ, నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ, అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌ను పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా.. నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నాం. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాం. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయిన. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు.. నన్ను నమ్ము సాయి.. నా తప్పేం లేదు.. ప్లీజ్‌రా నమ్మురా మేం రెండు బాటిల్స్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగా. అక్క వోడ్కా తాగింది. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయిన ఇట్లా అయితదనుకోలేదు. నేనెందుకు చంపుత సాయి.. నేనేందుకు మర్డర్ చేస్తా!.’’ అంటూ వాయిస్ మెసేజ్‌లో ఉంది. దీప్తి ఒంటిపై గాయాలు కోరుట్ల దీప్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీప్తి శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఎడమ చేయి కూడా విరిగిపోయి ఉండడంతో.. ఇదే హత్యేననే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కిచెన్‌లో వోడ్కా, బ్రీజర్ బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు ఉండటంతో రాత్రి వేళ దీప్తి, చందన కలిసి మద్యం సేవించారా..? అనే అనుమానాలు వ్యక్తం కాగా.. తాజా ఆడియోక్లిప్‌తో అవి నిర్ధారణ అయ్యాయి. చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగి ఆ గొడవలో తగలరాని చోట దెబ్బతగిలి దీప్తి చనిపోయిందా..? అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. మృతురాలు దీప్తి సోదరి చందన దొరికితేనే ఈ కేసు చిక్కుముడి వీడేది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాళ్లు నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో చందన ఆచూకీ కోసం రెండు బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. మరోవైపు చందనతో ఉన్న యువకుడు ఎవరు? అనే దానిపైనా ఆరాలు తీస్తున్నారు. కేసు నేపథ్యం ఇదే.. ఆంధ్రకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులు సుమారు పాతికేళ్లుగా కోరుట్లలోని భీమునిదుబ్బలో స్థిరపడ్డారు. ఇటుకబట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాస్‌రెడ్డికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు సాయి బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు దీప్తి(24) పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్‌ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచి పనిచేస్తోంది. చిన్నకూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. సోమవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి– మాధవి హైదరాబాద్‌లోని బంధువుల గృహాప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు తండ్రితో అక్కాచెల్లెళ్లు ఫోన్లో మాట్లాడారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించగా పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ కాలేదు. చిన్నకూతురు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండుమూడు సార్లు ఫోన్లో కూతుళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌రెడ్డి చివరికి పక్క ఇంట్లో ఉన్నవారికి ఫోన్ చేశాడు. తమ కూతుళ్లు ఫోన్ ఎత్తడం లేదని చెప్పి, ఓ సారి ఇంటిదాకా వెళ్లి చూడమని కోరాడు. పక్క ఇంట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా వారు దీప్తిని పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా మెట్పల్లి డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు కిరణ్, చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
అక్క అనుమానాస్పద మృతి.. చెల్లెలి అదృశ్యం.. ఏం జరిగింది?
కోరుట్ల/రాయికల్: ‘సోమవారం రాత్రి ఆ ఇంట్లో అక్కాచెల్లెళ్లు మాత్రమే ఉన్నారు. తెల్లారేసరికి అక్క చనిపోయి సోఫాలో పడి ఉంది. ఇంటి బయట తలుపునకు గొల్లెం పెట్టి చెల్లి ప్రియుడితో కలిసి పరారైంది’. ఇంట్లోని కిచెన్‌లో ఓడ్కా, బ్రీజర్ బాటిళ్లు ఉన్నాయి. అసలు ఆ రాత్రి ఇంట్లో ఏం జరిగి ఉంటుంది..? అక్క చనిపోవడానికి చెల్లెలే కారణమా..? ప్రియుడితో కలిసి చెల్లె వెళ్లిపోతుంటే అక్క అడ్డుకున్న క్రమంలో గొడవ జరిగిందా.. ఈ గొడవలోనే అక్క ప్రాణాలు పోయాయా..? లేదా ఓడ్కాలో అక్కకు మత్తు ఇచ్చి చెల్లెలు గుర్తుతెలియని యువకుడితో కలిసి పరారైందా..? వోడ్కాలో కలిపిన మత్తు మందు డోసు ఎక్కువై అక్క చనిపోయిందా..?! అనేక అనుమానాలు కోరుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బంక దీప్తి మృతి వెనక లెక్కలేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులు సుమారు పాతికేళ్లుగా కోరుట్లలోని భీమునిదుబ్బలో స్థిరపడ్డారు. ఇటుకబట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాస్‌రెడ్డికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు దీప్తి(24) పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్‌ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచి పనిచేస్తోంది. చిన్నకూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. సోమవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి– మాధవి హైదరాబాద్‌లోని బంధువుల గృహాప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు తండ్రితో అక్కాచెల్లెళ్లు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. తెల్లారేసరికి.. మంగళవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించగా పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ కాలేదు. చిన్నకూతురు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండుమూడు సార్లు ఫోన్లో కూతుళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌రెడ్డి చివరికి పక్క ఇంట్లో ఉన్నవారికి ఫోన్ చేశాడు. తమ కూతుళ్లు ఫోన్ ఎత్తడం లేదని చెప్పి, ఓ సారి ఇంటిదాకా వెళ్లి చూడమని కోరాడు. పక్క ఇంట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా వారు దీప్తిని పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా మెట్పల్లి డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు కిరణ్, చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ రాత్రి ఏం జరిగినట్లు..? సోమవారం ఉదయం తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని బంధువు ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లగా రాత్రి అక్కాచెల్లెల్లు ఇద్దరే ఇంట్లో ఉన్నారు. కిచెన్‌లో వోడ్కా, బ్రీజర్ బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు ఉండటంతో రాత్రి వేళ దీప్తి, చందన కలిసి మద్యం సేవించారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి మద్యం బాటిళ్లు ఎవరు తెచ్చి ఇచ్చారు, ప్రియుడితో కలిసి పరారయ్యేందుకు ముందుగానే పథకం వేసుకున్న చందన అతడితోనే మద్యం తెప్పించి ముగ్గురు కలిసి మద్యం తీసుకున్నారా..? అన్న విషయంలో స్పష్టత లేదు. దీప్తికి మద్యంలో మత్తు కలిపి తాము పరారయ్యేందుకు పథకం వేశారా..? మత్తు డోసు ఎక్కువ కావడంతో దీప్తి మృతి చెంది ఉంటుందా..? అన్న అనుమానాలున్నాయి. చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగి ఆ గొడవలో తగలరాని చోట దెబ్బతగిలి దీప్తి చనిపోయిందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీప్తి శరీరంపై పెద్దగా గాయాలు కనిపించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. బస్టాండ్ సీసీ ఫుటేజీలో చందన.. కోరుట్ల బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో మంగళవారం వేకువజామున 5 గంటలకు చందన ఓ యువకుడితో కలిసి ఉన్న వీడియోలను పోలీసులు గుర్తించారు. చందన, మరో యువకుడు లగేజీ తీసుకుని నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు సీసీ పుటేజీల్లో రికార్డు అయింది. చందన ఫోన్‌కాల్ డేటా ఆధారంగా ఆమె ఓ యువకుడితో గంటల తరబడి ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి చందన ఫోన్ లొకేషన్ హైదరాబాద్‌లో వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారని సమాచారం. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! అమెరికా బతుకమ్మ ఉయ్యాలో!!
‘‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ! తంగేడు పువ్వులో... తంగేడు కాయలో... ఆట చిలుకలు రెండు... పాట చిలుకలు రెండు...’’ ‘‘చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన...’’ ‘‘ఇలా ఒకటా... రెండా... లెక్కలేనన్ని బతుకమ్మ పాటలు మా నాలుకల మీద నాట్యమాడుతుంటాయి. గ్రామాల్లో గడిచిన బాల్యం జీవితాన్ని నేర్పుతుంది. తెలంగాణ గ్రామాల్లో బాల్యం బతుకమ్మ పాటల రూపంలో సమాజంలో జీవించడాన్ని నేర్పుతుంది. నిరక్షరాస్యులు కూడా ఈ పాటలను లయబద్ధంగా పాడతారు. బతుకమ్మ పాటల సాహిత్యం వాళ్ల నాలుకల మీద ఒదిగిపోయింది. తమకు తెలిసిన చిన్న చిన్న పదాలతో జీవితాన్ని అల్లేశారు గ్రామీణ మహిళలు. మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్. మా అమ్మమ్మ గారి ఊరు జగిత్యాల జిల్లా, వెలుగుమాట్ల. నా చదువు పుట్టపర్తిలో, సెలవులు అమ్మమ్మ ఊరిలో. దసరా సెలవులు వస్తున్నాయంటే సంతోషం అంతా ఇంతా కాదు. దేశమంతా దేవీ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటే మేము బతుకమ్మ వేడుకలు చేసుకుంటాం. గౌరమ్మ అందరి మనసుల్లో కొలువుంటుంది, మాట, పాట, ఆట అన్నీ గౌరమ్మ కోసమే అన్నట్లు ఉంటుందీ వేడుక. ఇంత గొప్ప వేడుకకు దూరమయ్యానని అమెరికా వెళ్లిన తర్వాత కానీ తెలియలేదు. అందుకే అమెరికాలో బతుకమ్మను పేర్చాను’’ అన్నారు దీప్తి మామిడి... కాదు, కాదు, బతుకమ్మ దీప్తి. ‘‘నేను 2007లో యూఎస్‌కి వెళ్లాను. న్యూజెర్సీలో ఉండేవాళ్లం. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లిని. భర్త, పాప, ప్రొఫెషన్‌తో రోజులు బిజీగా గడిచిపోయేవి. డబ్బు కూడా బాగా కనిపించేది. కొద్ది నెలల్లోనే... ఏదో మిస్సవుతున్నామనే బెంగ మొదలైంది. వ్యాక్యూమ్ ఏమిటనేది స్పష్టంగా తెలియలేదు, కానీ బాల్యం, సెలవుల్లో బతుకమ్మ వేడుక మరీ మరీ గుర్తుకు వస్తుండేది. బతుకమ్మ కోసం ఇండియాకి రావడం కుదరకపోతే నేనున్న చోటే బతుకమ్మ వేడుక చేసుకోవచ్చు కదా! అనిపించింది. అలా అక్కడున్న తెలుగువాళ్లను ఆహ్వానించి బతుకమ్మ వేడుక చేశాను. మొదటి ఏడాది పదిహేను మందికి లోపే... పదేళ్లు దాటేసరికి ఆ నంబరు ఐదారు వందలకు చేరింది. అందరికీ భోజనాలు మా ఇంట్లోనే. ఏటా ఒక పెళ్లి చేసినట్లు ఉండేది. ఇండియా నుంచి తెలంగాణ పిండివంటలను తెప్పించుకోవడం, ఆ రోజు వండుకోవాల్సినవన్నీ మా ఇంట్లోనే వండడం, ఆ వంటల కోసం దినుసులను సేకరించడం, స్నేహితులందరినీ ఆహ్వానించడం, పూలు తెచ్చుకుని ఒక్కొక్కటీ పేర్చడం... ఇలా ప్రతి ఘట్టాన్నీ ఎంజాయ్ చేసేదాన్ని. ‘ఏటా అంతంత ఖర్చు ఎందుకు’ అని స్నేహితులు అనేవాళ్లే కానీ మా వారు ఒక్కసారి కూడా అడగలేదు. నా సంతోషం కోసం చేసుకుంటున్న ఖర్చు అని అర్థం చేసుకునేవారు. ఎప్పుడూ అన్నం ఉంటుంది! యూఎస్‌లో మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడూ అన్నం, కూరలుండేవి. మా కన్సల్టెన్సీకి వచ్చిన వాళ్లు, ముఖ్యంగా బ్యాచిలర్స్ కోసం ఈ ఏర్పాటు. మేము యూఎస్‌లో అడుగుపెట్టిన కొన్నాళ్లకే రెసిషన్ వచ్చింది. అప్పుడు పడిన ఇబ్బందులు నాకిప్పటికీ గుర్తే. అందుకే యూఎస్‌కి వచ్చిన కుర్రాళ్లు మన తెలుగింటి రుచులతో భోజనం చేస్తారు కదా! అనుకునేదాన్ని. షడ్రసోపేతమైన భోజనం అని కాదు కానీ కనీసం పప్పుచారయినా ఉండేది. ఈ అలవాటుకు బీజం పడింది కూడా అమ్మమ్మ దగ్గరే. అమ్మమ్మ పెద్ద పాత్రలో అంబలి చేయించి ఇంటి ముందు పెట్టేది. చాలామంది పొలం పనులకు వెళ్తూ దారిలో మా ఇంటి ముందాగి అంబలి తాగి, ఆవకాయ ముక్క చప్పరించుకుంటూ వెళ్లేవాళ్లు. ఆకలి తీర్చడంలో, అవసరమైన వాళ్లకు సహాయం చేయడంలో ఉండే సంతృప్తి మరి దేనిలోనూ ఉండదు. మా డ్రైవర్ ఇతర పనివాళ్ల పిల్లల చదువు కోసం ఫీజులు కట్టినప్పుడు మరొకరి జీవితానికి మనవంతు సహాయం చేస్తున్నామనే భావన సంతృప్తినిస్తుంది. అవకాశం లేనప్పుడు ఎలాగూ చేయలేం, వెసులుబాటు ఉన్నప్పుడయినా చేసి తీరాలి. మన ఎదుగుదల కోసం సమాజం నుంచి మనం తీసుకుంటాం, మనం ఎదిగిన తరవాత మరొకరి ఎదుగుదల కోసం ఆపన్న హస్తాన్ని అందించి తీరాలనేది పుట్టపర్తి స్కూల్ నేర్పించిన వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. మా అమ్మ ఫ్రెండ్ లీలా ఆంటీ కూడా బతుకమ్మ పండుగను బాగా చేసేవారు. ఆమె ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్. గునుగుపూలు వాటర్బాడీస్ని శుద్ధి చేస్తాయని చెప్తూ ఈ పండుగ వెనుక ఉన్న పర్యావరణ పరిరక్షణను వివరించేవారు. ఇవన్నీ మైండ్‌లో ఒక్కటొక్కటిగా అల్లుకుంటూ ఇలా దండ కూర్చుకున్నాయి. బతుకమ్మ దీప్తినయ్యాను! యూఎస్ జీవితం నాకు చాలా నేర్పించిందనే చెప్పాలి. అక్కడ అన్నీ ఉంటాయి కానీ ఏదో లేదనే వెలితి. రొటీన్ లైఫ్‌ని జాయ్‌ఫుల్‌గా మలుచుకోవడానికి నాకు బతుకమ్మ ఒక దారి చూపించింది. అప్పట్లో యూఎస్ ఇంతగా ఇండియనైజ్ కాలేదు. ఇప్పుడైతే న్యూజెర్సీ, డాలస్తోపాటు కొన్ని నగరాలు పూర్తిగా భారతీయలవే అన్నట్లు, తెలుగువాళ్ల ఊళ్లే అన్నట్లయిపోయాయి. మన పండుగలు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. నేను మొదలుపెట్టడంతో నేను బతుకమ్మ దీప్తినయ్యాను. ‘దీప్తి మామిడి’గా అమెరికాలో అడుగుపెట్టాను. మూడేళ్ల కిందట తిరిగి వచ్చేటప్పటికి నా పేరు ‘బతుకమ్మ దీప్తి’గా మారింది. బతుకమ్మ పాటకు మ్యూజిక్ మొదలైతే చాలు... ఒళ్లు పులకించిపోతుంది. పూనకం వచ్చినట్లే ఉంటుంది. మీతో మాట్లాడుతున్నా సరే... బతుకమ్మ ఫీల్ వచ్చేస్తుంది. చూడండి గూజ్బంప్స్ వచ్చేశాయి’’ అని చేతులను చూపించారు బతుకమ్మ దీప్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కాస్తయితే...దీప్తి లక్షలు పోగొట్టుకునేది
-
యాంకర్ ప్రశ్నకి ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్
-
సస్పెన్స్,ట్విస్టులతో పిచ్చెక్కిపోతారు..
-
జుట్టుపై పిచ్చ కామెడీ.. నవ్వించి నవ్వించి చంపేస్తావా ఏంటి..
-
శాకుంతలం మెప్పించిందా..?నొప్పించిందా..?
-
డైరెక్టర్‌గా మారిన నాని సోదరి.. ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ
‘‘మీట్ క్యూట్’ కథని నా సోదరి దీప్తి రాసిందని నేను నిర్మించలేదు. మరెవరు రాసినా ప్రొడ్యూస్ చేసేవాణ్ణి.. ఈ స్క్రిప్ట్ అంత అద్భుతంగా ఉంది. ఇందులోని పాత్రలు, మాటలు, వాళ్ల మధ్య వచ్చే సందర్భాలన్నీ సహజంగా ఉంటాయి’’ అని హీరో నాని అన్నారు. అదా శర్మ, వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ శర్మ, రోహిణి మొల్లేటి, శివ కందుకూరి తదితరులు కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. నాని సోదరి దీప్తి గంటా కథ రాసి, దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. ఐదు కథల ఆంథాలజీగా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 25 నుంచి సోని లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ– ‘‘ఈ స్క్రిప్‌్టని చాలా రోజులు చదవకుండా పక్కన పెట్టాను. దీప్తి ఒత్తిడి చేసేసరికి చదవడం ప్రారంభించాను. కొన్ని పేజీలు చదివేసరికి కథలో లీనమయ్యాను. ఈ స్క్రిప్ట్‌లోనే దీప్తి డైరెక్షన్ కనిపించింది’’ అన్నారు. దీప్తి మాట్లాడుతూ– ‘‘నేను గతంలో ఒక షార్ట్ ఫిలిం చేశాను. ‘మీట్ క్యూట్’లో ఒక కథ రాసి, నానీకి వినిపించాను. ఇలాంటివి ఇంకో మూడు నాలుగు రాస్తే ఆంథాలజీ చేయొచ్చని సలహా ఇచ్చాడు. జర్నీల్లో, ఇతర సందర్భాల్లో అపరిచిత వ్యక్తుల మధ్య మాటలు ఎలా ఉంటాయి? అనే ఊహతో ఈ స్క్రిప్ట్ రాశాను. ఓ మంచి లవ్ స్టోరీ రాస్తే ఆ కథను నాని హీరోగా తెరకెక్కిస్తా’’ అన్నారు. -
అనుకోకుండా ఇద్దరు స్ట్రేంజర్స్ కలిస్తే.. ఆసక్తిగా ట్రైలర్
నాని సోదరి దీప్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్‌గుడ్ వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. ఈ సిరీస్‌లో సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునయన ప్రధాన పాత్రల్లో నటించారు. ఐదు విభిన్నమైన కథలతో సరికొత్తగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్ నవంబర్ 25 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో ప్రసారం కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ను న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. (చదవండి: నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అదే.. విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్) ఇక ట్రైలర్ విషయానికొస్తే.. 'మీకు మీచ్ క్యూట్ అంటే తెలుసా.. అంటే అనుకోకుండా ఇద్దరు స్ట్రేంజర్స్ ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు.. ఆ క్యూట్ సిచ్యువేషన్స్.. వారి మధ్య జరిగే సంభాషణలు.' అనే నాని వాయిస్‌తో ప్రారంభమైంది. 'ఈ మనిషితో గొడవపడటం కూడా అనవసరం కదా అనుకున్నప్పుడే బంధాలు విఫలమవుతాయి. మనం ప్రేమించే వాళ్లతోనే కదా గొడవపడతాం' అంటూ సాగే సత్యరాజ్ మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఏదైనా రిలేషన్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చే గొడవలను పరిష్కరించుకుని బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేయాల్సిన పనులను వివరిస్తూ సిరీస్ రూపొందించారు. -
శెభాష్: నందినికి స్వర్ణం.. దీప్తికి రజతం.. రజితకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ జాతీయ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం తెలంగాణ మహిళా అథ్లెట్స్ అగసార నందిని స్వర్ణం, జీవంజి దీప్తి రజతం... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కుంజ రజిత కాంస్యం సాధించారు. గుజరాత్లో జరుగుతున్న ఈ మీట్లో నందిని 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.97 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. ఈ ప్రదర్శనతో నందిని కొలంబియాలో ఆగస్టు 1 నుంచి 6 వరకు జరిగే ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. దీప్తి 100 మీటర్ల ఫైనల్ రేసును 12.17 సెకన్లలో ముగించి రెండో స్థానాన్ని దక్కించుకుంది. రజిత 400 మీటర్ల ఫైనల్ రేసును 56.32 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. నందిని, దీప్తి, రజిత హైదరా బాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘సాయ్’ కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ పొందుతున్నారు. చదవండి: Rafael Nadal: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం -
మీట్ ‘క్యూట్’గా మెగాఫోన్ పట్టిన నాని సోదరి
న్యాచురల్ స్టార్ నాని సోదరి క్యూట్‌గా మెగాఫోన్ పట్టేసింది. రోల్.. కెమెరా..యాక్షన్ అంటూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్‌పై ‘మీట్ క్యూట్’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నాని సోదరి దీప్తి గంటా చేపట్టింది. గతంలో ‘అనగనగా ఒక నాన్న’ అనే షార్ట్‌ఫిల్మ్‌ను దీప్తి తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు దర్శకత్వ బాట పట్టారు. ఈ విషయాన్ని నాని ట్విటర్లో తెలిపారు. ‘నేడు కొత్త ప్రయాణం మొదలైంది. ఇది నాకెంతో ప్రత్యేకం’ అంటూ ‘మీట్ క్యూట్’కు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. అందులో సత్యరాజ్ కూర్చుని ఉండగా నాని క్లాప్ కొడుతున్న ఫొటోతో పాటు మరో ఫొటో పంచుకున్నారు. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఆ ఫొటో చూస్తుంటే సత్యరాజ్‌కు దీప్తి సీన్ వివరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. నాని నిర్మాణంలో ‘అ!, హిట్’ సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూపొందుతున్న ఈ సినిమా ఆ బ్యానర్లో నాలుగోది. Wall Poster Cinema Production No 4 🎬#MeetCute A new journey begins today :)) This one’s special for more than one reason ❤️@mail2ganta @lightsmith83 @VijaiBulganin @vinay2780 @artkolla @Garrybh88 @PrashantiTipirn @walpostercinema pic.twitter.com/8ToWRgu4Zu — Nani (@NameisNani) June 14, 2021 -
హైదరాబాద్ అమ్మాయికి మైక్రోసాఫ్ట్‌లో జాబ్, రూ.2 కోట్ల వేతనం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌కు చెందిన నర్కుటి దీప్తి అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా రూ.2 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. దీప్తి తండ్రి, ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ వెంకన్న హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని క్లూస్ టీమ్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. దీప్తి యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరెడాలో సీటు సాధించారు. ఇలా అమెరికా వెళ్లిన ఆమె ఎంఎస్ (కంప్యూటర్స్) ఈ నెల 2తో పూర్తి చేశారు. దీనికి ముందే ఆ యూనివర్శిటీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దీప్తికి మైక్రోసాఫ్ట్, గోల్డ్ మెన్ సాక్స్, అమేజాన్ కంపెనీల్లో ఉద్యోగం వచి్చంది. ఈమె మాత్రం మైక్రోసాఫ్ట్ సంస్థ వైపే మొగ్గు చూపారు. దీప్తి ప్రతిభను గుర్తించిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ (ఎస్డీఈ) గ్రేడ్–2 కేటగిరీలో ఎంపిక చేసుకుంటూ రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజ్ ఇచ్చారు. ఈ నెల 17న మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో దీప్తి బాధ్యతలు స్వీకరించనున్నారు. (చదవండి: H-1B: భాగస్వాముల వీసాలకు గూగుల్ మద్దతు) -
మరో రెండేళ్లు ‘వీ హబ్‘ సీఈవోగా దీప్తి రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ‘వీ హబ్’ సీఈవోగా దీప్తిరెడ్డి రావుల సర్వీసును మరో రెండేళ్లు పొడిగిస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 జనవరి ఒకటిన వీ హబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన దీప్తి ఈ ఏడాది మార్చి 31వరకు సేవలు అందించారు. మరో మూడేళ్ల పాటు ఒప్పంద కాలాన్ని పొడిగించాల్సిందిగా దీప్తి ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో దీప్తి రెడ్డిని రూ.2 లక్షల నెలసరి వేతనంపై మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (తెలంగాణకే నా సర్వీస్!) -
‘స్టార్టప్’ను కాపాడుకుంటాం!
సాక్షి, హైదరాబాద్: ‘స్టార్టప్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. వినూత్న ఆవి ష్కరణలతో ముందుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టీ హబ్, వీ హబ్‌లను ఏర్పాటు చేసింది. సానుకూల వాతావరణంలో సాగుతున్న క్రమంలో కరోనా సంక్షోభం స్టార్టప్లపైనా పడింది. అయితే ఈ పరిస్థితుల్లోనూ కొత్త ఆలోచనల తో అవకాశాలను సృష్టించే సత్తా స్టార్టప్ రంగానికి ఉంది. రాష్ట్రంలో స్టార్టప్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారాలపై వీ హబ్ (విమెన్స్ హబ్) నిరంతరం పనిచేస్తోంది. ప్రస్తుతమున్న స్టార్టప్‌లను కొత్త రంగాలకు మళ్లించడం, కోవిడ్ సంక్షోభంలోనూ కొత్త అవకాశాలను సృష్టించడంపై దృ ష్టి సారించాం’ అని వీ హబ్ సీఈఓ దీప్తి రావుల అన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో స్టార్టప్ రంగం స్థితిగతులపై ‘సాక్షి’తో మాట్లాడారు. ► ఈ ఏడాది ఆరంభంలో రాష్ట్రంలో స్టార్టప్ వాతావరణం సానుకూలంగా సాగుతుండటంతో స్టార్టప్ రంగానికి 2020 చాలా ఆశాజనకంగా ఉంటుందని భావిం చాం. అనూహ్యంగా కరోనా సంక్షోభం వచ్చింది. ఇన్వెస్టర్లలో అనిశ్చితిని సృష్టిం చింది. సప్లై చైన్ కూడా కరోనా ప్రభావానికిలో నైంది. ఎంఎస్ఎంఈ రం గంపైనా ప్రభావం చూపింది. ► లాక్డౌన్ మూలంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో మీడియా, వినోద రంగాలతో పాటు, ఈ కామర్స్ రంగాలకు డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో మరి కొన్ని రంగాల్లో వేతనాల కోత, లే ఆఫ్‌లు వంటివి ఏర్పడ్డాయి. భారత స్టార్టప్ రంగం కూడా ఆందోళనకర పరిస్థితికి లోనైంది. హైదరాబాద్‌లో మాత్రం సంక్షోభం ఉన్నా భవిష్యత్‌పై ఆశాజనకంగా ఉన్నాం. మొదట్లో ఇన్వెస్టర్లు స్టార్టప్ రంగంపై ఆశాభావంతో ఉన్నా కరోనా సంక్షోభంతో ఖర్చు, ఉత్పత్తులు వం టి వాటిపై కొంత ప్రభావం చూపవచ్చు. ► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుల స్థితిగతులపై మరోమారు పునర్ మూల్యాంకనం, బిజినెస్ మాడ్యూల్స్, టీమ్‌కు ఎలా శిక్షణనివ్వాలి, భవిష్యత్ అవకాశాలపై టీ హబ్, వీ హబ్ కసరత్తు చేస్తున్నాయి. సమస్యలున్నా.. ఆరోగ్యం, ఈ–కామర్స్, వ్యవసాయ రంగంలో స్టార్టప్‌ల వృద్ధికి అవకాశం ఉంది. ► స్టార్టప్‌ల నిధుల విషయానికొస్తే కొత్తగా ఆలోచించి మార్కెట్, కస్టమర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమకూరే వీలుంది. ప్రస్తుతం వీ హబ్‌లో అనేక రకాల ఉత్పత్తులు ఉండగా, ఇందులో మారిన మార్కెట్లకు అవసరమైనవి చాలా ఉన్నాయి. ► వెంచర్ క్యాపిటలిస్టులకూ సమస్యలున్నాయి. ప్రస్తుత పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. బ్యాంకర్లు కూడా రుణాలిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం స్టార్టప్‌లు నగదు ప్రవాహం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహణ వ్యయం తగ్గిం చుకోవడం, లే ఆఫ్‌ల వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. కంపెనీలను నిలబెట్టుకోవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు. ► వీ హబ్ పరంగా చూస్తే కరోనా సం క్షోభంలో మా బృందం అనేక వెబినార్లు నిర్వహించి స్టార్టప్‌లు సొంత నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. వి హబ్‌లో 62 నుంచి 65 స్టార్టప్‌లపై పని జరుగుతుండగా, బయట మరో వంద, రెండొంద ల మందితో కలసి పనిచేస్తున్నాం. ► వీ హబ్‌లో ఉన్న 23 స్టార్టప్‌లు కరోనా తర్వా త ఆరోగ్యం, ఎడ్యుకేషన్ రంగాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం నుంచి స్టార్టప్‌లకు రుణ పరపతి పెంచేందుకు ఎలాంటి కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రూ. 2 కోట్ల మేర సాయం అందేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్స్‌తో మాట్లాడి కంపెనీలు మూత పడకుండా చూస్తున్నాం. -
నాన్న పేరు గుర్తుండిపోయేలా....
సినిమాని కాచి వడపోసిన వారు కొద్ది మందే ఉంటారు. ఆ జాబితాలో కచ్చితంగా కోడి రామకృష్ణ ఉంటారు. అందుకే ఆయన హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి అనేక హిట్ సినిమాలు తీసి గురువును(దాసరి నారాయణరావు) మించిన శిష్యుడు అనిపించుకున్నారు. కోడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి శనివారం (22న). ఈ సందర్భంగా ఆయన కుమార్తెలు దీప్తి, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది మా కోరిక. అందుకే ఆయన పేరుతో సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి చిత్రాలు తీస్తాం.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. కాగా పాలకొల్లులో పుట్టి పెరిగిన కోడి రామకృష్ణ పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. డిగ్రీ పూర్తయ్యాక చెన్నై వెళ్లి దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ 100 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలందరితో పని చేశారు. తమిళ, హిందీ, కన్నడ, మల యాళ చిత్రాలకూ దర్శకత్వం వహించా రాయన. ఆయన దర్శకత్వంలో చివ రిగా వచ్చిన చిత్రం ‘అరుంధతి’. -
టీడీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డ దీప్తి
-
కిలాడీ దీప్తి అరెస్ట్
పెదకాకాని(పొన్నూరు): ఉద్యోగాలిప్పిస్తానంటూ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వసూలు చేసి ఘరానా మోసాలకు పాల్పడిన కిలాడి లేడీ మామిళ్లపల్లి దీప్తిని గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎట్టకేలకు ఆమెను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి పెదకాకానికి తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమెకు 11 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్ఐ అనురాధ చెప్పారు. అప్పట్లో సీఎంవోలో పీఏగా పనిచేస్తున్నట్టు నకిలీ ఐడీ కార్డులతో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపే క్రమంలో ఈ మోసాలకు పాల్పడ్డానని పోలీసుల విచారణలో ఆమె చెప్పినట్టు తెలిసింది. కాకుమాను మండలం బోడుపాలేనికి చెందిన దీప్తి టీడీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయంలో హల్చల్ చేసేది. మంత్రుల శాఖల కార్యాలయాల్లోకి వెళ్లి వస్తూ నిరుద్యోగులకు నమ్మకం కలిగిస్తూ.. ఉద్యోగాల పేరుతో వారి నుంచి డబ్బు గుంజేది. వ్యవహారం వెలుగులోకి వచ్చిందిలా.. వైఎస్సార్ జిల్లాకు చెందిన వల్లభరెడ్డి రామకృష్ణారెడ్డి ఐదుగురికి ఏపీ జెన్కోలో ఉద్యోగాలిప్పించేలా దీప్తితో ఒప్పందం కుదుర్చుకుని గతేడాది ఏప్రిల్ 15న ఆమెకు రూ.12.50 లక్షలు చెల్లించాడు. గుంటూరుకు చెందిన ప్రత్తిపాటి దిలీప్, మోహనరావు కూడా ఉద్యోగాల నిమిత్తం ఆమెకు రూ.6.50 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత తాము మోసపోయామని గుర్తించిన వీరు గతేడాది అక్టోబర్ 15న పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె చేసిన మోసాలపై అప్పట్లో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో బాధితులు మరింత మంది ముందుకొచ్చి ఫిర్యాదులు చేశారు. అప్పటి నుంచి ఆమె పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతోంది. తాజాగా ఈ నెల 4న తెనాలిలో చంద్రబాబు, లోకేశ్‌లు హాజరైన కార్యక్రమంలో పాల్గొన్న దీప్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించగా పరారైంది. -
ఫిట్నెస్ ఛాంపియన్
దీప్తికి ఫిట్‌గా ఉండడం ఇష్టం. అందరినీ తనలా ఫిట్‌గా ఉంచడం ఇంకా ఇష్టం. క్రీడలన్నా క్రీడాకారులన్నా కూడా ఎంతో ఇష్టం. వారిని విజయం వైపు నడిపించడంలో తానూ భాగం పంచుకోవడం మహా ఇష్టం. ఈ ఇష్టాలన్నీ మేళవించి క్రీడాకారులకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారామె. పేరొందిన మహిళా బైక్ రేసర్లు, బాక్సింగ్ ఛాంపియన్లకు కూడా ఫిట్నెస్ పాఠాలు బోధిస్తున్న ఈ తెలుగు కోచ్... ఫిట్‌గా ఉంటేనే ఏ రంగంలోనైనా హిట్ కొడతామని అంటున్నారు. ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. కాలేజీ రోజుల నుంచీ.. ఫిట్నెస్ మీద ఇష్టంతో విభిన్న రకాల వ్యాయామ శైలులను సాధన చేశాను. అలా పదిహేనేళ్లు గడిచిపోయాయి. ఎంబీయే చేశాక స్వంతంగా మార్కెటింగ్ కంపెనీ ప్రారంభించాను. పొద్దస్తమానం ల్యాప్‌ట్యాప్ ముందు కూర్చోవడంతో ఏదో మిస్ అవుతున్నాను అనిపించేది. అదే సమయంలో పెళ్లి, బాబు పుట్టిన తర్వాత ఆరోగ్యం విషయంలోనూ కొన్ని తేడాలు కనిపించాయి. కాలేజీ రోజుల్లో లేని ఈ సమస్య అంతా కూర్చుని చేసే జాబ్ వల్లే అని అర్ధమయ్యాక... మార్కెటింగ్ కంపెనీకి గుడ్‌బై చెప్పేశాను. కిక్ ఇచ్చింది మునుపటి ఫిట్నెస్ను సాధించడంతో పాటే ఇక ఈ రంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకుని ఫిట్నెస్ ట్రైనర్‌గా కూడా మారాను. అలా కొనసాగుతూనే ఈ రంగంలో ఉన్న మిగతా దారులనూ వెతికాను. క్రీడాకారులకు ఫిట్నెస్ కోచ్‌గా ఉండటం చాలా ఆసక్తిగా అనిపించింది. కిక్‌బాక్సింగ్‌లో మూడేళ్లు జాక్సన్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. క్రీడాకారులకు ట్రైనర్‌గా మారడానికి ముందు అన్ని రకాలుగా అధ్యయనం చేశాను. వారి మైండ్‌సెట్‌ను అర్ధం చేసుకున్నాను. నేనూ అలవరచుకున్నాను. ఇంటర్నేషనల్ సర్ఫర్స్, సెయిలర్స్, స్విమ్మర్స్.. ఇలా ఎక్కువ మంది క్రీడాకారులు చెన్నైలో ఉన్నారు. అక్కడైతే మరింత మందికి నా సేవలు అందించవచ్చునని మూడున్నరేళ్ల క్రితం చెన్నైకి షిఫ్ట్ అయ్యాను. స్పోర్ట్స్ పర్సన్స్‌కి కోచ్‌గా ఉంటూనే ఇప్పుడు ఎఫ్ 45 పేరుతో రెండు ఫిట్నెస్ స్టూడియోలను నడుపుతున్నాను. ఆట.. బాట అంతర్జాతీయ సర్ఫ్, సెయిలర్స్, స్విమ్మర్స్.. ఇలా అన్ని కేటగిరీలో స్పోర్ట్స్ టాపర్స్ పలువురికి మా స్టూడియోలో శిక్షణ అందిస్తున్నాం. నా ఆధ్వర్యంలో 25 మంది ట్రైనర్లు ఉన్నారు. వీరందరితో కలిసి పూర్తి ట్రైనింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తాను. వ్యక్తిగతంగా స్పోర్ట్స్ పీపుల్ని ట్రైన్ చేయడాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంటాను. క్రీడాకారులు ట్రోఫీలు, ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంటారు. అందుకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అలాంటి క్రీడాకారుల విజయాల్లో భాగం పంచుకోవడం అనేది చాలా ఆనందాన్ని అందిస్తుంది. ఇంటర్నేషనల్ ఫిమేల్ రేసర్ బైక్‌లో నెంబర్ వన్ అయిన అలీషా అబ్దుల్లాకు రెండేళ్లుగా పర్సనల్ ట్రైనర్‌గా ఉన్నాను. అలాగే ఇప్పుడు స్పోర్ట్స్ నేప«థ్యంలో సినిమాలు బాగా తయారవుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు జాన్కొకేన్ ఓ బాక్సింగ్ మూవీకి రెడీ అవుతున్నాడు. ఆ మూవీ కోసం జాన్ని మూడు నెలలుగా ట్రైన్ చేస్తున్నాం. భరత్ తదితర సినిమా సెలబ్రిటీలూ మా ఫిట్నెస్ స్టూడియోలకు వస్తారు. మండే మాంక్ కండలు తిరిగిన దేహం వంటివి కాకుండా ఆరోగ్యంగా, చలాకీగా ఉండడమే చాలా మంది లక్ష్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని శారీరక, మానసిక, భావోద్వేగాలకు సంబంధించిన ప్రయోజనాలు అన్నీ మేళవించి అందిస్తూ 55 నిమిషాల్లో చేసే వ్యాయామం పరిచయం చేస్తున్నా. మండే మాంక్ పేరుతో ఫిట్నెస్ యాప్, వెబ్సైట్ కూడా లాంచ్ చేయబోతున్నాను. దీంట్లో మెంటల్లీ ఫిట్‌గా ఎలా ఉండాలి? ఫిజికల్లీ ఫిట్‌గా ఎలా ఉండాలి? సైకియాట్రిస్ట్, న్యూట్రీషియన్ సూచనలు... ఇవన్నీ ఉంటాయి. ఏ ప్రాంతానికి తగిన ఆహారపు అలవాట్లను బేస్ చేసుకుంటూ డైట్‌కు సంబంధించిన సూచనలు అందిస్తున్నాం. ఇళ్లలో ఉండేవారు, ఆఫీసుల్లో వర్క్ చేసేవారు ఎవరికి ఏ విధమైన ఫిట్నెస్ అవసరమో అలాంటివి మండేమాంక్లో చేర్చాం. మూడు నెలల్లో ఈ యాప్‌ని లాంచ్ చేస్తాను. మండేమాంక్ పేరుతో ఏపీ, తెలంగాణలోనూ స్టూడియోలను ప్రారంభించబోతున్నా. మూడేళ్లలో 75 çస్టూడియోలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మెట్రో నగరాల్లోనే కాకుండా మిగతా పట్టణాల్లోనూ ఫిట్నెస్ స్టూడియోలను చేరువ చేయాలని నా ఉద్దేశం’’ అని తెలిపారు దీప్తి. – ఎస్.సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
రాజధాని రైతులను కొందరు రెచ్చగొడుతున్నారు
సాక్షి, అమరావతి/తెనాలి రూరల్: రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిరసనల్లో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రాజధానిలో తనపై దాడి అనంతరం కొందరు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ టీవీ జర్నలిస్ట్ నల్లమోతు దీప్తి డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం దీప్తి, మరో మహిళా జర్నలిస్టు హసీనా, పలువురు మీడియా ప్రతినిధులు డీజీపీ సవాంగ్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచి్చందన్నారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని.. కానీ ఆ నిరసనలు హింసకు దారితీసేలా ఉండకూడదని అన్నారు. రాజధాని రైతుల ఆందోళనను సున్నితంగానే చూశామన్నారు. అయితే ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బంది కల్గించేలా వ్యవహరించడం, శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం లాంటివి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇప్పటి వరకు రాజధానిలో ఆందోళనలపై 12 కేసులు నమోదు చేశామన్నారు. జర్నలిస్టులపై దాడి కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని, మిగిలిన వారిని వీడియోల ఆధారంగా గుర్తిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలు, రక్షణ అంశాలకు సంబంధించిన అంశం ఉంటుంది కాబట్టి రాజధాని హైపవర్ కమిటీలో తన పేరు పెట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. డీజీపీ ఆఫీసు ఎక్కడ ఉండాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులు అందించే సేవలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ బలగాలను సమన్వయం చేయడానికి డీజీపీ కార్యాలయం దోహదం చేస్తుందన్నారు. పాలనాపరమైన పోలీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. నిందితులకు జనవరి 10 వరకు రిమాండ్ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో జర్నలిస్టులపై జరిగిన దాడి కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం, మల్కాపురం, వెలగపూడి, నెక్కల్లు గ్రామాలకు చెందిన శివబాబు, నరేష్, సురేంద్ర, శ్రీనివాసరావు, నాగరాజు, లోకనాయక్, వెంకటస్వామిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వీరిని తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే నిందితులను విడిచిపెట్టాలని టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద హడావుడి చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్టేషన్‌కు వచ్చి నిందితులను విడిచిపెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. నిందితులకు వైద్య పరీక్షల అనంతరం రాత్రి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్వీవీఎన్ లక్షి్మ.. నిందితులకు జనవరి 10 వరకూ రిమాండ్ విధించారు. -
విషాదంగా మారిన దీప్తీశ్రీ కిడ్నాప్ కేసు
సాక్షి, తూర్పుగోదావరి : మూడు రోజుల క్రితం తప్పిపోయిన చిన్నారి దీప్తీశ్రీ (7) కేసు చివరికి విషాదంగా మారింది. కాకినాడలో శుక్రవారం పాఠశాలకు వెళ్లిన దీప్తీ కిడ్నాప్‌కు గరైన విషయం తెలిసిందే. పాప సవతి తల్లి శాంతి కుమారినే ఈ దారుణానికి పాల్పడినట్లు చిన్నారి నాయనమ్మ ఆరోపించడంతో పోలీసులు శాంతి కుమారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీప్తిని గొంతు నులిమి హత్య చేసినట్లు, ఉప్పుటేరు కాల్వలో పడేశానని పలు రకాల సమాధానాలు చెప్పడంతో కాకినాడ సబ్ డివిజన్ పోలీసులు చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చర్యలు ముమ్మరం చేసిన పోలీసులకు ఇంద్రపాలెం లాకుల వద్ద గుర్రపు డెక్కల కింద చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి దీప్తీని సవతి తల్లి శాంతికుమారి అపహరించి హత్య చేసిందని, అనంతరం ఆమె మృతదేహాన్ని మూటలో కట్టి ఇక్కడ పడేసినట్లు పోలీసులు తెలిపారు. -
దీప్తి.. కార్పొరేషన్‌నూ వదల్లేదు
సాక్షి, గుంటూరు : నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని ఘరానా మోసాలకు పాల్పడిన మామిళ్ళపల్లి దీప్తి చేతివాటం ప్రదర్శించడంలో తనదైన ముద్ర వేసుకుంది. సీఎంవోలో పీఏగా పని చేస్తున్నానంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని, సివిల్ వివాదాలు పరిష్కరిస్తానని చెప్పి అమాయకుల నుంచి రూ.70 లక్షలకు పైగా దోచుకొని బాధితుల ఫిర్యాదుతో పరారైన విషయం తెలిసిందే. ఆమె మోసాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గుంటూరు కార్పొరేషన్లో ఆనందలహరి కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ హయాంలో మంత్రి సాయంతో కాంట్రాక్ట్‌ను కొట్టేసింది. ఆనందలహరి నిర్వహణ కోసం.. 2017లో అప్పటికే దీప్తికి మాజీ మంత్రితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దానిని అడ్డుగా పెట్టుకొని గుంటూరు కార్పొరేషన్ అధికారులకు తరచూ ఫోన్ చేయించి వారిని దారికి తెచ్చుకుంది. ఈ క్రమంలో గుంటూరులో ప్రతి ఆదివారం ఆనందలహరి పేరుతో కార్యక్రమం నిర్వహించేందుకు కార్పొరేషన్ దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో దీప్తి తన స్వచ్ఛంద సంస్థకు అర్హత లేకపోయినప్పటికీ దరఖాస్తు చేసుకుంది. అదే సమయంలో మరో సంస్థ నిర్వాహకులు కూడా దరఖాస్తు చేశారు. వెంటనే కాంట్రాక్ట్ తనకే ఇవ్వాలంటూ దరఖాస్తు మంజూరు చేసే అధికారిని సైతం మభ్యపెట్టి సదరు మాజీ మంత్రితో కార్పొరేషన్ రికమండ్ చేయించి కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రతి వారం కార్యక్రమం నిర్వహణకు కార్పొరేషన్ రూ.60 వేల చొప్పున చెల్లుస్తుంది. నిబంధనల ప్రకారం కార్యక్రమం కొనసాగించకుండా రూ.20 వేలలోపు ఖర్చుతో మమ అనిపించింది. దీంతో నగరంలో కార్యక్రమం నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికే ఏడాదిపాటు కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీకేష్ లఠ్కర్ ఇదంతా దోపిడీ అని తేల్చి బిల్లులు నిలుపుదల చేశారు. మళ్లీ బిల్లుల చెల్లింపుల కోసం... అప్పట్లో పర్యవేక్షణాధికారిగా పని చేసి అనంతరం బదిలీపై వెళ్లిన అధికారి మళ్లీ బదిలీపై ఇక్కడకే వచ్చారు. దీంతో దీప్తి, ఆమె స్నేహితులు సదరు అధికారి వద్దకు వెళ్లి బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అందుకు కమిషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బిల్లు పెండింగ్‌లో ఉంది. మంగళగిరి మాయ‘లేడీ’ ఉలికిపాటు మంగళగిరిలో మరో కలాడీ లేడీ బాగోతం అంటూ సాక్షి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనం టీడీపీ నాయకులను ఉలిక్కిపాటుకు గురి చేసింది. విజలెన్స్ అధికారులు సైతం బాధితుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. తెనాలిలోని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పని చేసిన కిలాడీ లేడీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. మాజీ హోంమంత్రి చినరాజప్పతో తనకు పరిచయాలు ఉన్నాయని పలువురిని నమ్మించింది. సేల్స్ మేనేజర్‌గా పని చేసిన సమయంలో తనతో పని చేసిన సహ ఉద్వోగులకు ఔట్ సోర్సింగ్ ఉద్వోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసింది. తాజాగా సాక్షి దినపత్రికలో కథనం రావడంతో కిలాడీ లేడీ ఉదయం నుంచి బాధితులకు ఫోన్ చేసి తాను విదేశాలలో ఉన్నానని, వారంలో వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలుకుతోంది. దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయవద్దంటూ బతిమాలుతున్నట్లు సమాచారం. కొందరు బాధితులు వెంటనే తాము ఇచ్చిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని, లేదంటే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. చదవండి: నకిలీ ఐడీ కార్డుతో దీప్తీ బురిడీ.. -
మళ్లీ మురిపి'స్టారు'
ఇదండీ విషయం! అభినయానికి వయసుండదు.వయసుకి అందం ఉంటుంది.తారలు... నిజమే తారలు మాసిపోరు.నాటి తారలే నేటి అభినయ తారలు.అపుడు మెరిశారు ఇప్పుడు మురిపిస్తారు. గ్లామర్ ఇండస్ట్రీలో స్పాట్లైట్ ఎప్పుడూ ఒకరి మీదే ఉండదు. ఫోకస్ ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. హీరోయిన్ల విషయంలో అయితే మరీనూ. హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా చిన్నది. ఐదూ పదేళ్ల తర్వాత తెరమరుగవుతుంటారు. కొందర్ని ఇండస్ట్రీ దూరం జరిపితే, కొందరేమో ఇండస్ట్రీకే దూరం జరుగుతారు. కేవలం కొందరు హీరోయిన్లు మాత్రమే దీనికి మినహాయింపు. కాలానుగుణంగా సీతాకోక చిలుకలో మార్పులొచ్చినట్టు వీళ్ల కెరీర్ సైకిల్లో మార్పులొస్తుంటాయి. పాత్రలకు ప్రమోషన్లు వస్తుంటాయి. గ్యాప్‌కి గ్యాప్ ఇచ్చి ఈ యాక్టర్స్ ఎప్పుడు తిరిగొచ్చినా కెమెరాలు మరింత ఫోకస్‌తో వీళ్ల మీద దృష్టి పెడతాయి. ప్రేక్షకుడి కళ్లు మరింత మెరుపుతో వీళ్లను చూస్తాయి. ఈ నటీమణులు మళ్లీ తిరిగి రావడానికి.. స్క్రిప్ట్ కారణం కావొచ్చు, సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తుందని దర్శక–నిర్మాతలు అనుకోవచ్చు. మరే కారణం అయినా కావచ్చు. ప్రస్తుతం కొందరు హీరోయిన్లు తిరిగి తెర మీద కనిపించడానికి రెడీ అవుతున్నారు. అలా చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మళ్లీ మెరవడానికి సిద్ధమైన నటీమణులపై స్పెషల్ స్టోరీ. సౌందర్య లహరి ‘పెళ్లి సందడి’ సినిమాలో శ్రీకాంత్ స్వప్న సుందరిగా నటించారు దీప్తీ భట్నాగర్. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కూడా స్వప్న సుందరిగా మారిపోయారామె. అ సినిమా తర్వాత ‘ఆటో డ్రైవర్, మా అన్నయ్య, కొండవీటి సింహాసనం’ సినిమాల్లో కనిపించారామె. 2002 తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు దీప్తి. ఇçప్పుడు నూతన దర్శకుడు పవన్ సుందర్ దర్శకత్వం వహిస్తున్న ‘కిట్టీ పార్టీ’ సినిమాతో కమ్‌బ్యాక్ చేస్తున్నారు. ఇది దీప్తీకి తెలుగులోనే కమ్‌బ్యాక్ కాదు యాక్టర్‌గానే కమ్‌బ్యాక్. 2004 తర్వాత ఏ భాషలోనూ ఆమె సినిమా చేయలేదు. ఫిర్ ప్యార్ కరేంగే మైనే ప్యార్ కియా అని సల్మాన్, భాగ్యశ్రీతో చెప్పారు. సినిమా బ్లాక్‌బస్టర్. హిందీ రానీ వాళ్లు కూడా భాగ్య శ్రీతో మైనే ప్యార్ కియా అన్నారు. ఆ సినిమా నార్త్, సౌత్‌లో సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది భాగ్యశ్రీకి. ఆ తర్వాత తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఓంకారం’ (కన్నడ బ్లాక్‌బస్టర్ ‘ఓం’ తెలుగు రీమేక్) చేశారు. ఆ వెంటనే బాలకృష్ణతో ‘రాణా’ సినిమా చేశారు. ఇప్పుడు సుమారు 21ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో కనిపించబోతున్నారు భాగ్యశ్రీ. ‘కిట్టీ పార్టీ’ చిత్రంలో భాగ్యశ్రీ కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. రైలు పట్టాల మీద పరిగెడుతూ ‘మాఘమాసం ఎప్పుడొస్తుందో...’ అని పాట పాడిన లైలా అందరికీ గుర్తే. ‘ఎగిరే పావురమా’ సినిమాలో ఓ సూపర్ హిట్ సాంగ్ ఇది. చిన్న పిల్లలాంటి గొంతు ఆమె ప్రత్యేకం. తెలుగులో ‘ఉగాది, పెళ్ళి చేసుకుందాం, పవిత్ర ప్రేమ’ వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు లైలా తెలుగుకు తిరిగొస్తున్నారా? అంటే దానికి కొంచెం టైమ్ ఉన్నట్టుంది. ప్రస్తుతానికి తమిళంలో రీ–ఎంట్రీ ఇస్తున్నారు. పదమూడేళ్ల తర్వాత తమిళ సినిమాలో నటిస్తున్నారు లైలా. ‘అలీసే’ అనే క్రైమ్ డ్రామాలో కీలక పాత్రలో కనిపించనున్నారు లైలా. ఈ సినిమాకు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాత. రాజకీయాల్లో చురుకుగా ఉండటంతో తెలుగు స్క్రీన్‌పైన జయప్రదను ప్రేక్షకులు మిస్ అయ్యారు. 2007లో బాలకృష్ణ ‘మహారథి’ సినిమా తర్వాత తెలుగులో ఆమె సినిమాలేవీ చేయలేదు. తమిళ, హిందీ, కన్నడంలో ఒకటీ అరా సినిమాలు చేశారు కానీ తెలుగు తెరపై కనిపించలేదామె. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన ‘శరభ’ సినిమాలో కీలక పాత్రతో రీ–ఎంట్రీ ఇచ్చారు జయప్రద. ఇటీవల రిలీజైన ‘సువర్ణ సుందరి’లో కూడా కీలక పాత్ర చేశారామె. 18 ఏళ్లకు మళ్లీ ‘20వ శతాబ్దం, పద్మావతి కల్యాణం, బావ నచ్చాడు’ సినిమాల్లో కనిపించిన సుమన్ రంగనాథ్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు కనిపించడానికి రెడీ అయ్యారు. ‘బావ నచ్చాడు’ తర్వాత సుమన్ రంగనాథ్ మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. కానీ కన్నడ, తమిళ, హిందీల్లో సినిమాలు చేస్తున్నారామె. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘కిట్టీ పార్టీ’లో సుమన్ రంగనాథ్ కీలక పాత్ర చేస్తున్నారు. 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో తెలుగు తెరపై కనిపించనున్నారు. ఎటూ వెళ్లిపోలేదు ‘గ్రీకువీరుడు...’ అంటూ ‘నిన్నే పెళ్లాడతా’లో కాబోయే వాడి కోసం పాడిన టబు మనందరికీ గుర్తే. గర్వం అణచడానికి గణపతి విగ్రహాన్ని తనతో మోయించిన ‘కూలీ నెం 1’ కూడా గుర్తే. ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ కవ్వించిన సిసింద్రీని కూడా మరచిపోలేం. పుండరీక రంగనాథుడిని మోహంలో ముంచెత్తిన మోహినిని మరచిపోవడం సాధ్యమా? ఇలా వెంకటేశ్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ అందరితో కథానాయికగా నటించిన టబు దర్శనాలు ఈ మధ్య తెలుగు తెరకు తగ్గాయి. 2008లో చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో చేసిన ‘ఇదీ సంగతి’ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదామె. ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జున పాడిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ని టబు ఫ్యాన్స్ ‘ఎటో వెళ్లిపోయింది టబు’ అని పాడుకున్నారు. కానీ జస్ట్ బాలీవుడ్లో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు టబు. ఎటూ వెళ్లిపోలేదు. ఇంతకీ సంగతేంటంటే... సుమారు పదకొండేళ్ల తర్వాత త్రివిక్రమ్– అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నారామె. తన సినిమాల్లో కీలక పాత్రల కోసం ఒకప్పటి హీరోయిన్లని తీసుకోవడం త్రివిక్రమ్ స్టైల్ అనుకోవచ్చు. ‘అత్తారింటికి దారేది’లో నదియా, ‘అజ్ఞాతవాసి’లో ‘ఖుష్బూ’ని చాలా గ్యాప్ తర్వాత నటింపజేశారు త్రివిక్రమ్. తాజాగా అల్లు అర్జున్ సినిమాతో టబుని తిరిగి తీసుకొచ్చారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి తల్లిగా లేక అత్తయ్య పాత్రలో టబు కనిపిస్తారని సమాచారం. ఫైర్ బ్రాండ్ ఈజ్ బ్యాక్ తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పాపులారిటీ తీసుకొచ్చిన ఫైర్ బ్రాండ్ హీరోయిన్ విజయశాంతి. యాక్షన్, రివల్యూషనరీ సినిమాలతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. విజయ్‌శాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలను చూడటం తమ ‘కర్తవ్యం’గా భావించి థియేటర్స్‌వైపు వెళ్లారు ప్రేక్షకులు. 2006లో చేసిన ‘నాయుడమ్మ’ తర్వాత విజయశాంతి సినిమాలకే బ్రేక్ ఇచారు. పాలిటిక్స్‌లో బిజీగా మారారు. మళ్లీ 13 ఏళ్ల విరామం తర్వాత స్క్రీన్ మీద కనిపించడానికి రెడీ అయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ద్వారా విజయశాంతి మళ్లీ రీ–ఎంట్రీ ఇస్తున్నారు. విజయశాంతి తొలి చిత్రం ‘కిలాడీ కృష్ణుడు’ సినిమాలో హీరో కృష్ణ. ఇప్పుడు రీ–ఎంట్రీ చేస్తున్న సినిమాలో హీరో ఆయన తనయుడు మహేశ్ కావడం విశేషం. కృష్ణ దర్శకత్వం వహించి, నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో విజయశాంతి హీరోయిన్. అందులో మహేశ్ బాలనటుడిగా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సరి లేరు నీకెవ్వరు’లో మహేశ్ పాత్రతో సమానంగా ఆమె పాత్ర కూడా ట్రావెల్ అవుతుందని తెలిసింది. ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
మెరిసిన శ్రీనివాస్, దీప్తి
హాంకాంగ్: ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అథ్లెట్స్ సత్తా చాటుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్ బాలుర 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం... మెడ్లే రిలేలో స్వర్ణం సాధించాడు. వరంగల్ జిల్లాకు చెందిన జీవంజి దీప్తి బాలికల 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో కాంస్యం... మెడ్లే రిలేలో రజతం సొంతం చేసుకుంది. 200 మీటర్ల రేసులో షణ్ముగ శ్రీనివాస్ 21.87 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని సంపాదించాడు. వివేక్ కరణ్ (100 మీటర్లు), షణ్ముగ శ్రీనివాస్ (200 మీటర్లు), శశికాంత్ (300 మీటర్లు), అబ్దుల్ రజాక్ (400 మీటర్లు)లతో కూడిన భారత బృందం మెడ్లే రిలేను ఒక నిమిషం 54.04 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు దీప్తి 200 మీటర్ల రేసును 24.78 సెకన్లలో ముగించి మూడో స్థానాన్ని పొందింది. భారత్‌కే చెందిన అవంతిక 24.20 సెకన్లలో రేసును ముగించి రజతం దక్కించుకుంది. దీప్తి (100 మీటర్లు), అవంతిక (200 మీటర్లు), సాండ్రా (300 మీటర్లు), ప్రియా మోహన్ (400 మీటర్లు)లతో కూడిన భారత బృందం 2 నిమిషాల 10.87 సెకన్లలో పూర్తి చేసి రజతం కైవసం చేసుకుంది. పోటీల చివరి రోజు భారత్‌కే చెందిన అమన్ దీప్ సింగ్ ధలివాల్ (షాట్‌పుట్–19.08 మీటర్లు), మథేశ్ బాబు (800 మీటర్లు–1ని:51.48 సెకన్లు), అమిత్ జాంగిర్ (3000 మీటర్లు–8ని:36.34 సెకన్లు) రజత పతకాలు గెలిచారు. బాలికల 800 మీటర్లలో పూజ (2ని:09.32 సెకన్లు) రజతం, 1500 మీటర్లలో చాంతిని చంద్రన్ (4ని:36.09 సెకన్లు) కాంస్యం, బాలుర 1500 మీటర్లలో సుమీత్ ఖరబ్ (1ని:55.81 సెకన్లు) కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్ 8 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. చైనా 12 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 31 పతకాలు గెలిచి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. -
నా పెళ్లి దుస్తులు కూడా నేనే డిజైన్ చేసుకున్నా..
సీతమ్మధార(విశాఖఉత్తర): చదువుకున్నది ఎంబీఏ..ఇష్టమై ఎంచుకున్న రంగం ఫ్యాషన్ డిజైనర్. ఎంబీఏ పూర్తవ్వగానే ఉద్యోగంలో చేరినా మనసుకు నచ్చకపోవడంతో ఉద్యోగానికి విడిచిపెట్టి ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టింది ఎన్‌ఏడీకి చెంది దీప్తి. నేర్చుకున్న వృత్తిని పదిమందికీ ఉచితంగా పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. చిన్నప్పటి నుంచి ట్రెండీగా ఉండడం ఇష్టం..పెరిగిన వాతావరణం ప్రభావమో ఏమో గానీ కొత్త కొత్త ఫ్యాషన్స్‌ను ఫాలో అవడం అలవాటైంది. క్రమంగా ఫ్యాషన్ డిజైనర్‌గా స్థిరపడాలని కోరుకున్నా...కానీ ఈ రంగానికి అంత భవిష్యత్తు ఉండదేమోనని అమ్మానాన్న ఫార్మసీ రంగంవైపు వెళ్లమని సూచించారు. దీంతో యలమర్తి ఫార్మసీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చదవా..తరువాత ఎంబీఏ చేశా.. కొన్నాళ్ల పాటు ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశా..కానీ చిన్నతనం నుంచి బలంగా నాటుకుపోయిన ఫ్యాషన్ రంగాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి క్రియేటివ్ ఫీల్డ్ అయిన ఫ్యాషన్ రంగాన్నే ఎంచుకున్నా...ప్రస్తుతం పది మందికి ఉచితంగా నేర్పించే స్థాయికి ఎదిగా..ప్రస్తుతం ఉన్న రోజుల్లో భార్యాభర్తలిద్దరూ కష్టపడితేనే గానీ హ్యాపీగా జీవించే పరిస్థితి లేదు. నగరాలకు వస్తున్న వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సీరియస్‌గా ఆలోచించా. ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్న అనుభవంతో మహిళలకు ఉపాధి కల్పించేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో ఉంటూనే ఎంతోకొంత ఆదాయం సంపాదించవచ్చు. బీజం పడిందిలా.. ఓ ఫంక్షన్‌కు స్నేహితుడి ఇంటికి వెళ్లా..నేను వేసుకున్న డ్రెస్సే వేరే అమ్మాయి కూడా వేసుకుంది. ఎందుకో గిల్టీగా అనిపించింది. స్పెషల్‌గా ఉండడం చిన్నప్పటి నుంచి ఇష్టం. అందుకే నేను ధరించే దుస్తులే నేనే డిజైన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే కొనసాగిస్తున్నా..2016లో నా పెళ్లి దుస్తులు కూడా నేనే డిజైన్ చేసుకున్నా..ఎన్ఏడీలో మా ఇంట్లోనే మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నా.. -
అదే పెద్ద విక్టరీ అనుకుంటున్నా: దీప్తి
‘బిగ్‌బాస్ 2’లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇన్ని రోజులు ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాననే బాధ అనిపించిందా? కచ్చితంగా బాధగానే ఉంది. దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిసే ‘బిగ్‌బాస్ 2’లో అడుగుపెట్టాను. మా అమ్మ, భర్త శ్రీకాంత్, కొడుకు సిద్ధార్థ్.. ఇలా మా కుటుంబ సభ్యులందరి సపోర్ట్‌తో బిగ్‌బాస్‌కి వెళ్లగలిగాను. జనరల్‌గా అమ్మాయిలకు పెళ్లయితే కొన్ని ఆంక్షలు ఉంటాయి. కానీ, నాకు అలాంటివేం పెట్టలేదు. ఇంత మంచి ఫ్యామిలీ ఎక్కడా ఉండదు. నాకు బాధ అనిపించినప్పుడల్లా వారి మాటలు నన్ను చాలా మోటివేట్ చేశాయి. ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని గట్టిగా ఉన్నా. మా కుటుంబ సభ్యులను చూశాక కన్నీళ్లు ఆగలేదు. నాకే కాదు. బిగ్‌బాస్ హౌస్మేట్స్ అందరి పరిస్థితి ఇంతే. వందరోజుల్లో కనీసం నాపేరు 100 సార్లైనా తలచుకున్నావా? అని మా అబ్బాయి సిద్ధార్థ్ అడిగాడు.100కంటే ఎక్కువ సార్లు తలచుకున్నా. మీరెందుకు గెలవలేకపోయారు? ఏ ఆటలో అయినా విజేత అనేవాడు ఒక్కడే ఉంటాడు. షో నుంచి బయటికొచ్చాక చాలా మంది నన్ను కలిసి ‘విజేతగా మిమ్మల్ని కూడా మేము ఊహించుకున్నాం. కనీసం రన్నరప్లో అయినా ఉంటారనుకున్నాం’ అంటుంటే వారి మనసులను గెలుచుకున్నామనే హ్యాపీ ఉంది. ఆట ఆడటానికొచ్చినప్పుడు గెలిచినా.. ఓడినా, ఎలిమినేట్ అయినా స్పోర్టివ్‌గా ఉండాలనుకున్నా, ఉన్నాను. గెలవాలనే తాపత్రయం మా 17 మందిలో ఉండేది. కౌశల్ కూడా మాలో ఒక్కడే కదా? తను గెలిస్తే ఏంటి? సంతోషమే కదా? ‘బిగ్‌బాస్ 1’లో శివబాలాజీ విజేతగా నిలిచారు. ‘బిగ్‌బాస్ 2’లో కౌశల్ గెలిచారు. రెండు సీజన్స్‌లోనూ అబ్బాయిలే గెలిచారు. అమ్మాయిలను అణిచేశారనే భావన ఏమైనా ఉందా? అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. ‘బిగ్‌బాస్’ టాస్క్‌లు ఇచ్చేటప్పుడు అబ్బాయిలకు ఒకలా.. అమ్మాయిలకు మరోలా ఇవ్వలేదు కదా? అందరికీ ఒకే టాస్క్‌లు ఇచ్చారు. ఎవరైనా ఒక్కటే అని ప్రేక్షకులు కూడా ఆటని ఆటలా చూశారు. అందుకే కదా ఫైనల్ వరకూ వెళ్లా. విజేత ఎవరన్నది చివరకు ప్రేక్షకులే నిర్ణయించారు. కౌశల్ ఎందుకు గెలిచారనుకుంటున్నారు? గేమ్ పరంగా ఆయన ఫోకస్ ప్లస్ అయింది. ఆయన గెలవడానికి అన్ని కారణాలు కలిసొచ్చాయి. అన్ని వర్గాలు ఆయన విజయానికి హెల్ప్ అయ్యాయి. కౌశల్ గెలవడానికి పూర్తి అర్హత ఉందని మీ నమ్మకమా? ‘బిగ్‌బాస్ 2’లో పాల్గొన్న 17 మందికి గెలిచే అర్హత ఉంది. అయితే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనకు అనుకూలించవు.. మరికొన్ని సార్లు అనుకూలిస్తాయి. ‘బిగ్‌బాస్ 2’లో పాల్గొన్నందుకు ఏమైనా అసంతృప్తి ఉందా? లేదు. ప్రతి టాస్క్‌లో నేను ఎంత బెస్ట్ ఇవ్వగలనో అంత ఇచ్చాను. అందరితో మంచి స్నేహం కుదిరింది. గీతామాధురి అక్కతో కలిసి ఒకటో రెండో షోలు చేశా. ఓ రోజు విజయవాడ నుంచి తిరుపతికి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు క్యాజువల్‌గా మాట్లాడాను. గీత అక్కతో తప్ప షోలో పాల్గొన్నవారిలో ఎవరితోనూ కనీసం ముఖ పరిచయం కూడా లేదు. నేనూ, గణేశ్ ఇంచుమించు ఒక్కటే అని చెప్పొచ్చు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అంతవరకూ వెళ్లి ఫైనల్ వరకూ నిలవడమే ఓ విక్టరీగా భావిస్తున్నా. -
బిగ్‌బాస్ నుంచి దీప్తి ఎలిమినేషన్ అంటూ ప్రచారం..
హైదరాబాద్ : దాదాపు మూడున్నర నెలల నుంచి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 తుది అంకానికి చేరుకుంది. ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 2 విజేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటి వరకు 14 మంది ఎలిమినేషన్స్ జరిగి, టాప్ 5 కంటెస్టెంట్లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్న తెలిసిందే. అందులో గీతా మాధురి, కౌశల్, తనీశ్, సామ్రాట్, దీప్తి నల్లమోతు ఉన్నారు. అయితే గురువారం బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతున్నట్టు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. మాములుగా శని, ఆది వారాల్లో మాత్రమే బిగ్‌బాస్ హౌజ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ, ఈ సీజన్లో బిగ్‌బాస్ హౌజ్‌లో జరిగే ప్రతి అంశం కూడా ముందుగానే బయటికి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రోజునే బిగ్‌బాస్ హౌజ్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నేడు బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమినేషన్ పక్రియ జరగనుందని.. అందులో భాగంగా దీప్తి హౌజ్ నుంచి బయటకు వెళ్లనున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. అంతేకాకుండా గ్రాండ్ ఫినాలేలో నలుగురు మాత్రమే పోటీ పడనున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ అవి కేవలం పుకార్లేనని తేలిపోయింది. కాగా, ఈ సీజన్లో బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు పోలవుతున్న ఓట్ల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కొందరు కంటెస్టెంట్ల పేరిట భారీగా ఫేక్ ఓటింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ.. బిగ్‌బాస్ విజేత ఎవరనేది ఈ వీకెండ్లో తేలిపోనుంది. -
అమ్మాయిల్ని ధైర్యంగా పెంచాలి
‘వరంగల్ యాసిడ్ ఘటన’.. నేను చదువుకునే రోజుల్లోనే జరిగింది. ఆ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. నేరస్తులపై నాటి పోలీసుల చర్య రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్లలో కొండంత విశ్వాసం నింపింది. అయితే మహిళలపై దాడులు తగ్గాలంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకునే చర్యలతో పాటు మగవాళ్లలోనూ పరివర్తన రావాలి. పరివర్తన తెచ్చే బాధ్యతను తల్లిదండ్రులు, సమాజం తీసుకోవాలి. ఆడపిల్లలు కూడా ఆత్మరక్షణకు సదా సిద్ధంగా ఉండాలి. అబలలమని భావించకుండా.. వేధింపులను, దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలి’’ అంటున్నారు మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి. బాలికలు, యువతులు, మహిళల సంరక్షణ కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటూ మహిళా ఐపీఎస్ ఆఫీసర్లలో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దీప్తితో మాట్లాడుతున్నప్పుడు మహిళా ప్రపంచానికి ఆమె ఒక స్ఫూర్తి అని ‘సాక్షి’కి అనిపించింది. నాన్న మైనింగ్ శాఖలో అధికారి. తరచూ బదిలీలు అవుతుండేవి. వరంగల్, కాకినాడ, నల్లగొండ, చిత్తూరు.. ఇలా అనేక ప్రాంతాల్లో నివాసం ఉన్నాము. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా నా బాల్యం గడించింది. చిత్తూరులోని గుడ్‌షెపర్డ్‌లో హైస్కూల్, ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్లో మరింత కష్టపడి చదివా. ఆ తర్వాత నాన్న గైడెన్స్ నా ఉన్నత విద్యాభ్యాసానికి ఎంతో తోడ్పడింది. .. కన్నీళ్లు ఆగలేదు ఐఐటీలో చేరాలన్నది నా కల. ఎలాగైనా ఐఐటీ సాధించాలని పట్టుదలతో ఉండేదాన్ని. హైదరాబాద్‌లో రామయ్య కోచింగ్ సెంటర్లో ప్రవేశానికి ప్రయత్నించా. అయితే అప్పటికే సీట్లు నిండిపోవటంతో అది కుదరలేదు. చిత్తూరు జిల్లా పక్కనే ఉన్న నెల్లూరు పట్టణంలో పేరున్న ఒక కోచింగ్ సెంటర్లో చేరాలని అనుకున్నా. అక్కడికి వెళ్లి ఓ లెక్చరర్ని అడిగితే, ‘‘చూడమ్మాయ్.. ఐఐటీలు అబ్బాయిలకు మాత్రమే సూట్ అవుతాయ్. ఇంజనీరింగ్, సైన్స్ సబ్జెక్టుల్లో వాళ్లు మాత్రమే రాణిస్తారు. అమ్మాయిలు అలా కాదు. మీరు ఐఐటీలో సెట్ కాలేరు. వెళ్లి చక్కగా డిగ్రీ చదువుకో’ అని చాలా నిరుత్సాహంగా మాట్లాడారు. ఆ లెక్చరర్ మాటలతో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆరోజు రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. నేను ఎదుర్కొన్న మొదటి వివక్ష అదే. ఎలాగైనా ఆ లెక్చరర్ అభిప్రాయాన్ని తప్పుగా నిరూపించాలనుకున్నా. పట్టుదలతో కోచింగ్ తీసుకుని ఐఐటీ సాధించా. అమ్మాయిలు ఏ రంగంలోనైనా అబ్బాయిలతో పోటీ పడవచ్చన్న ఆత్మవిశ్వాసం అప్పుడే నాకు కలిగింది. సైంటిస్టు అవ్వాలనుకున్నా ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరా. క్లాస్‌లో 60 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో ముగ్గురం మాత్రమే అమ్మాయిలం. ఢిల్లీ ఐఐటీ వాతావరణం బాగుంటుంది. అబ్బాయిలు, అమ్మాయిలు అన్న వివక్ష ఎక్కడా కనిపించదు. అప్పటి వరకు సైంటిస్టు కావాలనుకున్న నన్ను మా నాన్న సివిల్ సర్వీసెస్ వైపు మళ్లేలా చేశారు. ఐఐటీ పూర్తికాగానే హైదరాబాద్‌లో ఆర్సీ రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేరిపోయా. మొదటి ప్రయత్నంలో సక్సెస్ కాలేదు. రెండో ప్రయత్నంలో ఐపీఎస్ ర్యాంకు సాధించాను. కోపం కట్టలు తెంచుకుంది ఐపీఎస్ ఆఫీసర్ కాక ముందు ఒక ఘటన నాపై తీవ్ర ప్రభావం చూపింది. నాన్న సుపీరియర్ ఆఫీసర్ ఒకరు హైదరాబాద్‌లో ఉండేవారు. ఒక అబ్బాయి ఆయన కూతురు వెంటపడి ప్రేమించమంటూ వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో పైశాచికంగా హత్య చేశాడు. ఆ ఘటన నన్ను కుదిపేసింది. మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నవారిపై నాలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ క్షణంలోనే అనుకున్నా.. ఇలాంటి దాడులు ఆగిపోవాలని. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్‌గా నా పరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నాను. మరీ ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాను. మెదక్ జిల్లాలో మహిళలపై దాడులు అరికట్టేందుకు ‘షీ భరోసా’లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఈవ్‌టీజింగ్ అరికట్టేందుకు పోలీస్స్టేషన్ల వారీగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని మహిళా కానిస్టేబుళ్లను పోలీసు అధికారులు, సిబ్బంది గౌరవించేలా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా ప్రజలు తమ సమస్యలు ఎప్పుడైనా చెప్పుకునేందుకు ఎస్పీగా ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటున్నాను. అంబులెన్స్ కోసం చూడలేదు రంగారెడ్డి జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఓ రోజు సీఎం బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తుండగా వికారాబాద్ రూట్లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్‌బైక్ నడుపుతున్న ఓ వ్యక్తిని వాహనం ఢీకొంది. అందరూ ఆ వ్యక్తి చనిపోయాడు అనుకున్నారు. నేను వాహనం దిగి అతని పల్స్ చూశాను. బతికి ఉన్నట్లు అనిపించింది. అంబులెన్స్ కోసం చూడకుండా వెంటనే, కారుతున్న ఆ రక్తగాయాలతోనే అతడిని నా వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లా. వికారాబాద్ ఆసుపత్రిలో చికిత్స తర్వాత హైదరాబాద్‌కు తరలించాం. బతికాడు. అతడితో పాటు నాకూ ప్రాణం వచ్చినట్లయింది. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో చాలా మంది ప్రజాప్రతినిధులు, అధికారులు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్బంలో 108 వాహనాలకోసం ఎదురుచూడకుండా సొంత వాహనంలో క్షతగాత్రులను తరలించిన వార్తలు విన్నప్పుడు సంతృప్తిగా ఉంటుంది. ఆ రెండు కేసులు..! ఐపీఎస్ అయ్యాక మొదట ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నల్లగొండ జిల్లాలో పనిచేశా. అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్ వికారాబాద్ ఇచ్చారు. వికారాబాద్‌లో ఏఎస్పీగా పనిచే స్తున్న సమయంలోనే.. ఓ వ్యక్తి కన్నకూతురుపై అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మొదట ఈ కేసు మాకు ఒక సవాలుగా మారింది. తన కూతురును తీసుకుని వెళ్తుంటే గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి నేను ఘటనా స్థలానికి వెళ్లాను. తండ్రిని విచారిస్తే పొంతన లేకుండా సమాధానం చెబుతున్నాడు. తండ్రే అత్యాచారం చేసి, హత్యకు పాల్పడి ఉంటాడని మాకు అనుమానం వచ్చింది. ఘటనా స్థలంలో తండ్రి చెప్పులు కనిపించటంతో మా అనుమానం రూఢీ అయ్యింది. గట్టిగా విచారిస్తే నేరం అంగీకరించాడు. ఇప్పటికీ కదిలిపోతాను మరో కేసు గురించి కూడా చెప్పాలి. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో గత ఏడాది నవంబర్‌లో ఈ క్రైం చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన కుటుంబాలు ఉపాధి కోసం ముప్పిరెడ్డిపల్లికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాయి. కలీం, హసీనా జంట అలాగే బాబు, పాపతో వలస వచ్చారు. 2017 డిసెంబర్ 6న వాళ్ల ఆరేళ్ల పాప ఖుష్బూ కనిపించకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరుసటిరోజు ముప్పిరెడ్డిపల్లిలోని మొండికుంట అనే ప్రాంతంలోని కల్వర్టులో ఆరేళ్ల పాప శవం కనిపించింది. క్లూస్‌టీం, పోలీసు జాగిలాలను రంగంలోకి దించి దర్యాప్తు వేగవంతం చేశాం. స్వయంగా నేనే కేసును దర్యాప్తు పర్యవేక్షించాను. మాకు అందిన క్లూస్ మేరకు అజయ్ అలియాస్ శమీరాజ్ బ్రార్ అనే అతన్ని నిందితునిగా గుర్తించాము. శమీరాజ్ బ్రార్ డిసెంబర్ 6వ తేదీన ఖుబ్బూ(6) చదువుకునే పాఠశాలకు వెళ్లి భోజన విరామం సమయంలో పాపకు చాక్లెట్లు ఇచ్చి బయటకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత గ్రామ శివారులో చిన్నారిపై కిరాతకంగా అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశాడు. శమీరాజ్ బ్రార్‌కు ఆరేళ్ల కూతురు ఉంది. మానవమృగంలా మారి శమీరాజ్ బ్రార్ ఖుష్బూలో తన కూతురును చూసుకోకపోవటం నన్ను కలిచివేసింది. ఈ కేసులో శమీరాజ్ బ్రార్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఇలాంటి కేసులు చూసినప్పుడల్లా నేను కదలిపోతాను. చిన్నారులు, మహిళల విషయంలో పురుషుల ప్రవర్తన మారాలని బలంగా కోరుకుంటున్నాను’’ అని ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు చందన దీప్తి. మగపిల్లలకో పాఠ్యాంశం ఉండాలి మహిళలపై దాడులు అరికట్టాలంటే ముందు పురుషుల్లో మార్పు రావాలి. మహిళలు తమ ఆత్మరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా వేధిస్తున్నారు అంటే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలి. తల్లిదండ్రులు తమ చిన్నారులకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలి. ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేయటంతోపాటు గృహహింస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. అయితే మహిళల సంరక్షణ కోసం మరికొన్ని చర్యలు తీసుకోవచ్చు. నిర్మానుష్య ప్రదేశాల్లోనే ఎక్కువగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేస్తే దాడులు తగ్గుతాయి. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించాలన్న విషయం మగపిల్లల మనస్సు ల్లోకి ఎక్కించేందుకు పాఠ్యాంశాల్లో మహిళల ఔన్నత్యం గురించి తెలియజెప్పే అంశాలను చేరిస్తే బాగుంటుంది. – మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి – కాకోళ్ల నాగరాజు, సాక్షి, మెదక్ -
దీప్తి సునయనపై ట్రోలింగ్..
సాక్షి, హైదరాబాద్ : తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ సీజన్2 అలరిస్తోంది. కంటెస్టెంట్స్ తమ గేమ్‌ప్లాన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ హలీం, స్వీట్లు పంపించారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తొలి వారం పూర్తైంది. తొలి ఎలిమినేషన్‌కు కూడా టైం దగ్గర పడింది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాని మళ్లీ వచ్చేశారు. కంటెస్టెంట్స్‌ను టీవీ ద్వారా పలకరించారు. ఒక్కొక్కరి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ (విమర్శించడం)పై స్పందించారు. బిగ్‌బాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ అందరిపై రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమిత్ ఫ్యాన్స్ క్లబ్, దీప్తి సునయన ఆర్మీ అంటూ అభిమానులు సోషల్ మీడియా పేజీలు సృష్టించారని చెప్పారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్లో విమర్శించడం, బురద చల్లడం చాలా పెద్ద సమస్యగా తయారైందన్నారు. సరదా కోసం చేస్తే తప్పు లేదని, కానీ అదేపనిగా పెట్టుకొని విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గుర్తింపు కోసం వ్యక్తిగత విషయాల మీద దుష్ప్రచారం చేసే విధంగా వ్యక్తులు తయారయ్యారని పేర్కొన్నారు. ట్రోలింగ్ తప్పు కాదని, కానీ ఏదీ శ్రుతి మించకూడదని హితవు పలికారు. ఇరవై ఏళ్ల వయసులో సునయన డబ్ష్మాస్లు, షార్ట్‌ఫిల్మ్స్ చేసుకుంటూ, అందరికీ తెలిసే స్థాయికి వచ్చారంటూ ప్రశంసించారు. తాను ఇరవై ఏళ్ల వయసులో ఫిలింనగర్ రోడ్ల మీద తిరిగానంటూ నాని గుర్తు చేసుకున్నారు. ఎలిమినేషన్ ఓటింగ్‌లో దీప్తి సునయనకు చాలా మంది మద్దతుగా నిలిచారని, భారీగా వచ్చిన ఓట్లతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారని చెప్పారు. ఎందుకు ఏడ్చారని అడగ్గా, కుటుంబ సభ్యులు గుర్తుకు రావడంతో ఏడ్చానని సమాధానం ఇచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపులు, సభ్యుల మధ్య గొడవలను ప్రస్తావించారు. -
బుల్లితెరపై పల్లెటూరి తార
ఇబ్రహీంపట్నం : బుల్లితెరపై పల్లెటూరి తార తళుక్కుమన్నది. ‘స్టార్ మా’లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్–2 రియాల్టీషోలో సెలబ్రెటీల సరసన ఆ గ్రామీణ యువతికి ఆవకాశం దక్కింది. ఇప్పటికే అబ్బురపరిచే డ్యాన్సులు, అద్బుతమైన డబ్స్మాష్ విన్యాసాలతో యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్ బుక్‌ల్లో సంచలనం సృష్టించింది. రంగమ్మ మంగమ్మ ఏంపిల్లడూ... అంటూ సాగే పాటను డబ్స్మాష్ చేసి తన అద్భుతమైన నటనా ప్రావీణ్యంతో ప్రేక్షకుల నిరాజనాలను అందుకుంది. కోటీ 23 లక్షల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు. కళకు సృజనాత్మకతను జోడించి సినీ, టీవి, సామాజిక మాధ్యమాల్లో ఒక వెలుగు వెలుగుతోంది దీప్తి సునయన. ఆమె ప్రతిభను గుర్తించి బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెకు బిగ్‌బాస్–2 రియాల్టీషోలో అవకాశం కల్పించారు. హీరో నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో ఆమె తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. ఇంతకు ఈ యువతి ఎవరు..... దీప్తి సునయన ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడ గ్రామ పంచాయతీపరిధిలోని కర్ణంగూడ గ్రామానికి చెందిన బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గసభ్యుడు నల్లబోలు భోజిరెడ్డి కూతురు. ప్రస్తుతం వీరు నగరశివార్లలోని కర్మన్‌ఘాట్‌లో నివాసముంటున్నారు. నగరంలోని సెయింట్ ఆన్స్ కళాశాలలో దీప్తి బీఎస్సీ పూర్తిచేసింది. విద్యనభ్యసిస్తూనే తనలోని కళకు మెరుగులు దిద్దుకుంది. డ్యాన్స్‌లో ప్రతిభాపాటవాలు పొందింది. సినిమాల్లోని హీరో హీరోయిన్లు నటించిన సన్నివేశాలకు అనుగుణంగా వినూత్నరీతిలో నటించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి లక్షలాది మంది విక్షకులను సంపాదించుకుంది. నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా దీప్తి నటించింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్–2 రియల్టీషోలో నటిస్తుండటంతో ఈ ప్రాంతవాసులు ఎంతో గర్వపడుతున్నారు. సంతోషంగా ఉంది తన కుతూరు బిగ్‌బాస్ షోలో పాల్గొంటుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని దీప్తి సునయన తండ్రి భోజిరెడ్డి తెలిపారు. తాను ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తన కుతూరు పట్టుదలతో కృషిచేస్తోందన్నారు. తమ కుటుంబం నుంచి ఒక తార పుట్టుకురావడం ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందన్నారు. -
రియల్ దండుపాళ్యం
1980లో కర్ణాటకలో జరిగిన ఓ యథార్థ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. రాగిణీ ద్వివేది, మేఘనా రాజ్, దీప్తి, ప్రథమ ప్రసాద్, సంయుక్త హొర్నాడ్ ముఖ్య తారలుగా నారాయణ భట్ సమర్పణలో మహేశ్ దర్శకత్వంలో రూపొందింది. సి.పుట్టుస్వామి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. మహేశ్ మాట్లాడుతూ– ‘‘కన్నడలో వచ్చిన ‘దండుపాళ్యం’ చిత్రకథకు, మా ‘రియల్ దండుపాళ్యం’ కథకు ఏమాత్రం సంబంధం లేదు. శ్రీధర్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్ట పరంగా ఎదురైన సమస్య ను ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే కథ. ఈ నెలాఖరున విడుదల చేయనున్నాం’’ అన్నారు పుట్టుస్వామి. -
ప్రశంసల జల్లు
గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్‌లో వచ్చిన అనుచితమైన మెసేజ్‌కు కన్నడ నటి దీప్తి కాప్సే స్పందించిన తీరుకు ఆమెపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. మంగళవారం రాత్రి 7:56 గంటల సమయంలో దీప్తి వాట్సాప్‌కు ఆమె కాంటాక్ట్స్‌లో లేని నంబరు నుంచి మెసేజ్ వచ్చింది. ‘బెంగళూరులో ఎవరైనా సెక్స్‌వర్కర్ ఉంటే చూసిపెట్టు. డబ్బులకైనా సరే, ఉచితంగానైనా సరే..’ అని ఆ మెసేజ్ సారాంశం! రాత్రి 11 గంటల సమయంలో ఆ మెసేజ్ చూసిన నటి దీప్తి షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని చాలా ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. (రిప్లయ్‌ని ఎడిట్ చేశాం). ఆ సమాధానంతో భయపడిన ఆగంతకుడు.. పొరపాటున మెసేజ్ వచ్చిందనీ, క్షమించాలని వేడుకున్నాడు. ఈ సంభాషణను స్క్రీన్ షాట్ తీసి దీప్తి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దానిని చూసిన దీప్తి అభిమానులు అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. దీప్తి కన్నడలో హని హని ఇబ్బని, జ్వలంతం, మాల్గుడి డేస్, కిరీట, ఉపేంద్రమత్తె హుట్టిబా సినిమాల్లో హీరోయిన్గా నటించారు. బొమ్మనహళ్లి : (బెంగళూరు) -
దీప్తి కేసులో పోలీసులకు చుక్కెదురు
సాక్షి, విజయవాడ : పెళ్లి పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతూ, ఎన్నారై పెళ్లి కొడుకుల నుంచి డబ్బు గుంజుకుంటున్న పల్లపూరి దీప్తి కేసులో బెజవాడ పోలీసులకు చుక్కెదురు అయింది. విచారణ పరిధితో సంబంధం లేకుండా కేసు ఎలా నమోదు చేస్తారంటూ పటమట పోలీసుల తీరును న్యాయస్థానం గురువారం తప్పుబట్టింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించింది. టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితోనే.. కాగా పల్లపూరి దీప్తి అరెస్ట్ నేపథ్యంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితోనే పటమట పోలీసులు కేసు పెట్టారని దీప్తి తల్లి పూర్ణవల్లి ఆరోపించారు. సంబంధం లేని కేసును సీఐ దామోదర్‌తో ఎమ్మెల్యే కేసు నమోదు చేయించారని అన్నారు. ఎన్నారై ధరణికుమార్‌ను తన కుమార్తె డబ్బులు అడగలేదన్నారు. రెండు రోజుల పరిచయంతో లక్షా ఎనభై ఆరువేలు ఎవరైనా బ్యాంక్ అకౌంట్లో వేస్తారా? అని పూర్ణవల్లి ప్రశ్నించారు. మూడోరోజే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అంటూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు చేశారు. కాగా మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించి ఎన్నారై పెళ్లికొడుకులను మోసం చేస్తున్న పల్లపూరి దీప్తిని నిన్న (బుధవారం) విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పటమటకు చెందిన ధరణీకుమార్ మూడు నెలల క్రితం భారత్ మ్యాట్రీమోనిలో వధువు కోసం వెతకగా, దీప్తి అనే యువతి పరిచయం అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యవసరంగా తనకు కొంత డబ్బు అవసరం అని ధరణీకుమార్ను అడిగింది. ఆమె మాటలు నమ్మిన అతడు రెండు దఫాలుగా రూ.1.86 లక్షలు ఆమె అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బు తీసుకున్న నాటి నుంచి దీప్తి ఆచూకీ తెలియకపోవడంతో ధరణీకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరపగా, నిందితురాలు గుంటూరు బ్రాడీపేటకు చెందిన దీప్తిగా గుర్తించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఆమెను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. -
పెళ్లి పేరుతో ఎన్నారైకు కుచ్చుటోపి
సాక్షి, విజయవాడ : మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించి ఎన్నారై పెళ్లికొడుకులను మోసం చేస్తున్న నిందితురాలిని గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గుంటూరు డీసీపీ గజరావు భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బ్రాడిపేటలో నివసిస్తున్న దీప్తి విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడింది. తేలికగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మ్యాట్రీమోనిలో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి వివరాలను పొందుపర్చింది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధరణి కుమార్‌ను వివాహం చేసుకుంటానని నమ్మించి రూ. లక్షా 86 వేల తీసుకుంది. తిరిగి డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగింది. దాంతో మోసపోయానని గ్రహించిన సాప్ట్ వేర్ ఉద్యోగి ధరణి కుమార్ పోలీసులను ఆశ్రయించినట్లు డీసీపీ వెల్లడించారు. గతంలో దీప్తిపై ఇలాంటి కేసులే ఉన్నట్లు తెలిపారు. కొంతమంది అమ్మాయిలు దుర్బుద్ధితో వేరొకరి ఫొటోలతో మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో నకిలీ అకౌంట్లు తయారే చేసుకుంటున్నారని చెప్పారు. వివాహ సంబంధాల కోసం వెబ్సైట్లలో వెదికే వారు తెలియని వాళ్లకు నగదు పంపడం కరెక్టు కాదని హితవు పలికారు. -
చిన్నారి ప్రతిభ
-
గ్లామరస్ షో
సావిత్రి నుంచి సమంత వరకు తారల దుస్తులు... యువతుల డ్రెస్సింగ్ స్టైల్స్‌కి స్ఫూర్తిని అందించడంలో ముందుంటాయనేది తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో స్టార్స్‌తో పోటీ పడుతున్నారు టీవీ యాంకర్స్. చిన్ని తెరపై కేవలం వ్యాఖ్యానంతో మాత్రమే కాకుండా... గ్లామరస్తో రియాలిటీ షోలను రక్తికట్టిస్తున్న కొందరు టీవీ స్టార్స్‌కి ఇప్పుడు యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్. ‘సినిమాలకు తీసిపోని విధంగా యాంకర్ల డ్రెస్సింగ్‌ను తీర్చిదిద్దాల్సి ఉంటుంది’ అంటున్నారు సిటీ డిజైనర్ దీప్తి. ‘అంబర’ లేబుల్‌తో ఫ్యాషన్ రంగంలో స్వల్ప కాలంలోనే టాప్ ప్లేస్‌కు చేరుకున్న ఈమె.. టీవీ స్టార్లకు డ్రెస్‌ల డిజైనింగ్‌లో అందవేసిన చేయి అనిపించుకుంటున్నారు. సుమ, ఝాన్సీ, ఉదయభాను తర్వాత చిన్ని తెర రాణులుగా మారిన అనసూయ, శ్రీముఖి, రేష్మి, లాస్య... లాంటి వారికి కేవలం యాంకరింగ్ ఒకటే సరిపోవడం లేదు. వీరు గ్లామర్ ద్వారానూ మెప్పించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వీరి డ్రెస్సింగ్‌కు, డిజైనింగ్‌కు ప్రాధాన్యత మరింత పెరిగింది. దీంతో సిటీ డిజైనర్లకు చిన్ని తెర సెలబ్రిటీల డిజైనింగ్ బాధ్యతలూ వచ్చేశాయి. ‘సీనియర్ సినీ స్టార్, రాజకీయ నాయకురాలైన రోజా లాంటి ప్రముఖ మహిళకు డ్రైస్ డిజైనింగ్ అంటే ఆషామాషీ కాదు. ఇలాంటి టాస్క్‌లే డిజైనింగ్, స్టైలింగ్ ప్రతిభకు పదును పెడతాయనేది నా నమ్మకం’ అంటారు దీప్తి. దీప్తి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... చిన్ని తెరపై చిందేస్తున్న డిజైన్లు.. గతంతో పోలిస్తే ఇప్పుడు టీవీ షోలకి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆయా షోలలో వ్యాఖ్యాతలు, న్యాయ నిర్ణేతలు తదితరులకూ సినీతారలతో సమానంగా ఫాలోయింగ్ ఉంటోంది. నా ఫస్ట్ టీవీ షో జబర్దస్త్. అందులో రోజా గారికి డిజైన్స్ చేశాను. రోజా గారు అప్పటి వరకు చీరలు, అప్పుడప్పుడు చుడీదార్స్ మాత్రమే ధరించేవారు. మేం కొత్త లుక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్‌టైమ్ పంపిన డిజైన్‌నే ఆమెకు నచ్చింది. ఇక అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నరగా రోజా గారికి డిజైన్ చేస్తున్నాను. అలాగే జయసుధ, సుమ, రేష్మి, అనసూయ, శ్రీముఖిలతో సహా టాప్ టీవీ యాంకర్లకు డిజైన్లు అందిస్తున్నాను. సెట్... హిట్ టీవీ షోలను రక్తికట్టించడంలో ప్రధాన పాత్ర పోషించేది యాంకర్లు. దాదాపు ప్రేక్షకులు వీరినే గమనిస్తుంటారు. కాబట్టి అనుకున్నంత తేలికగా ఉండదీ వర్క్. యాంకర్‌కి డ్రెస్ డిజైన్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ దగ్గర్నుంచి ఎన్నో అంశాలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్ కలర్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో సెట్ అవ్వాలి. కొన్ని సెట్స్ డల్‌గా, డిమ్లైట్స్తో ఉంటాయి. దానికి సోబర్ కలర్స్ డిజైన్ డ్రెస్ ఇస్తే కనిపించదు. ఇప్పుడు సుమ చేస్తున్న ఇ–జంక్షన్ సెట్లో బ్లూ, గ్రీన్ లాంటి కలర్స్ వాడకూడదు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో అవి ఉన్నాయి. ఇలా సెట్లో కలర్స్‌ను బట్టి డిజైనింగ్ ఉండాలి. అంతేకాదు కామెడీ, సీరియస్, ఫెస్టివల్.. ఇలా షో కాన్సెప్ట్‌ను మైండ్‌లో ఉంచుకోవాలి. ఓ వారం కనిపించిన అవుట్‌ఫిట్ మరోవారం అవుట్‌ఫిట్‌కు పూర్తి భిన్నంగా ఉండాలి. దాదాపు 10కి పైగా టాప్ షోలు, బెస్ట్ యాంకర్లకి చేశాను. రాజశ్రీ లాంటి సీరియల్ యాక్టర్లకి డిజైన్లు అందించాను. ఇప్పుడు టీవీ యాక్టర్లు, యాంకర్లు సెలబ్రిటీ హోదాలో ఈవెంట్స్‌కి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవెంట్లో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచేలా, వారికి నప్పేలా డ్రెస్ డిజైన్ చేయాలి. -
ఎస్ఆర్ఐటీ అధ్యాపకురాలికి డాక్టరేట్
బుక్కరాయసముద్రం: రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం అధ్యాపకురాలు దీప్తికి జేఎన్టీయూ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి తెలిపారు. ‘మెషిన్ లర్నింగ్ అప్రోచ్ ఫర్ సూటబుల్ కెర్నల్ పంక్షన్ అండ్ అప్లికేషన్ ఆన్ ఇమేజస్’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ దీప్తిని కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి, సీఈఓ జగన్మోహన్రెడ్డి, సీఏఓ రంజిత్‌రెడ్డి, రీసెర్చ్ విభాగం అధిపతి అమర్నాథ్ అభినందించారు. -
లవర్స్‌డేకి లవ్ !
సాయి, దీప్తి జంటగా నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇక సె..లవ్’. జైహిత సమర్పణలో గన్నవరపు చంద్రశేఖర్, డుంగ్రోతు పీర్యానాయక్, గ్యార రవి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 10న విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మా చిత్రం సమాజానికి చేటు చేస్తుందని, వివాహ వ్యవస్థ మీద గౌరవం లేనట్లుగా ఈ చిత్ర కథాంశం ఉందన్న కారణాలతో మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డ్ తిరస్కరించింది. దీంతో రివైజింగ్ కమిటీకి వెళ్లి విడుదలకు అనుమతి పొందాం. బ్యానర్.. హీరో.. దర్శక నిర్మాతలను బట్టి సెన్సార్ రూల్స్ మారతాయా? మా సినిమాను స్త్రీ స్వేచ్ఛ, మహిళాభ్యుదయం కోణంలో చూడాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మధు, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి. -
దర్శకుడు కే.వాసు కుమార్తె దీప్తి వివాహ వేడుక
-
బుల్లితెర నటి దీప్తి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: బుల్లితెర నటి దీప్తి అలియాస్ రామలక్ష్మి(30) అనుమానాస్పదంగా మృతి చెందింది. సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన అప్పలనాయుడు కుమార్తె బిడగం రామలక్ష్మి సినిమా అవకాశాల కోసం 10 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చింది. తన పేరును దీప్తిగా మార్చుకొని పలు సీరియల్స్‌లో నటిస్తోంది. ఆడదే ఆధారం, ఆహ్వానం, లక్కీ లక్ష్మి వంటి సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించింది. తాళి సీరియల్‌కు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. అలాగే, పెళ్లమా ప్రియురాలా, కొత్త ఒక వింత, జోగిని సినిమాల్లో నటించింది. ఏడేళ్ల కిందట విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన పెయింటర్ శంకర్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే తనను వేధిస్తున్నాడంటూ దీప్తి భర్త శంకర్‌పై సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం సీరియల్స్ డెరైక్టర్ రమేశ్‌కుమార్‌తో ఆమె సహ జీవనం చేస్తోంది. ఈ విషయం రమేశ్ భార్యకు తెలియడంతో దీప్తితో ఆమె గొడవకు దిగింది. ఈ నేపథ్యంలో రమేశ్ తన భార్యకు విడాకులివ్వాలనే నిర్ణయానికి వచ్చారు. కాగా, శుక్రవారం రాత్రి 9 గంటలకు దీప్తిని ఇంటివద్ద వదిలి వెళ్లిన రమేశ్.. ఆ తర్వాత ఆమె చనిపోయిందంటూ సనత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ హరిశ్చంద్రారెడ్డి, ఎస్ఐ సైదులు ఘటనాస్థలానికి చేరుకొని దీప్తి లాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. రమేశ్‌ను విచారించగా రాత్రి 11 సమయంలో ఫ్లాట్‌కు వచ్చానని, తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా దీప్తి చీరతో ఉరేసుకోవడం చూశానని, వద్దని అరిచానని పోలీసులకు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దీప్తిది హత్యా, ఆత్మహత్యా తేలుతుందని సీఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. -
విగ్‌ల తయారీలో మహిళా దీప్తి
పరిచయం ఎన్టీయార్, ఏయన్నార్, ఎంజీయార్ల కాలంలో విగ్ అంటే వెండితెరకు మాత్రమే పరిమితమైంది. ఉంగరాల, నొక్కుల జుత్తు హీరోలు, నడుం కింద కి పారాడే పొడవాటి జడలున్న కథానాయికలను తెరకెక్కించడానికి, ప్రేక్షకుల కలలరూపాలను హీరో హీరోయిన్ల రూపంలో దర్శింపజేయడానికి సినిమా రూపకర్తలు విగ్లను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. సాధారణ జనం సైతం విగ్‌ల వినియోగంపై మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో తొలిసారిగా ఒక యువతి విగ్ తయారీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం విశేషం. 29 ఏళ్ళ దీప్తి పంచుకున్న సంగతులు ఆమె మాటల్లోనే... నాన్నే తొలి గురువు... మేం తెలుగువాళ్లమైనా, చెన్నైలో స్థిరపడ్డాం. నాన్న (అప్పారావు) సినిమా రంగంలో విగ్ మేకర్. రజనీకాంత్, బాలకృష్ణ వంటి ఎందరో పెద్ద తారలతో వర్క్ చేశారు. చిన్నప్పటి నుంచి నాన్న పని చూస్తూ పెరిగా. అప్పుడప్పుడు ఆయన పనిలో సాయపడేదాన్ని కూడా. అయితే నన్ను ఈ రంగంలోకి తీసుకురావాలని నాన్న అనుకోలేదు. బహుశా నా సోదరుణ్ణి తీసుకువద్దామని అనుకున్నారేమో... బిఎస్సీ, ఎంబిఎ పూర్తి చేశా. కార్పొరేట్ కంపెనీలో పెద్ద జీతంతో ఉద్యోగం కూడా వచ్చింది. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు... జుట్టు లేకపోవడం అనేది యువతను కూడా తీవ్రంగా బాధిస్తున్న సమస్యగా అర్థమైంది. నిజానికి సినిమాల కంటే బయటే దీని అవసరం చాలా ఉందనిపించింది. దీంతో 8 నెలల్లోనే ఉద్యోగం వదిలేసి ఈ రంగంలోకి రావాలని నిశ్చయించుకున్నా.. అధ్యయనం చేసి... అడుగేశా... విగ్ తయారీలోకి వస్తానన్నప్పుడు నాన్నతో సహా అందరూ కొంత సందేహించినా... తర్వాత నా ఆలోచన పూర్తిగా వివరించాక ఓకె అన్నారు. మన దగ్గర విగ్ తయారీకి సంబంధించి ప్రత్యేకంగా కోర్సు ఏమీ లేదు కాబట్టి...సింగపూర్, కొరియా లాంటి దేశాలకు వెళ్లి అక్కడ అత్యాధునిక మెలకువలు నేర్చుకున్నా. చైనాలో, కొరియాలో అయితే విగ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌కు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఏరియాలే ఉంటాయి. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విగ్ తయారీలో వస్తున్న మార్పులు అందుబాటులో ఉన్న కేశాలంకరణ శైలులు... వీటిన్నింటి మీదా అవగాహన ఏర్పరచుకున్నా. ఇప్పుడు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘లా మార్స్’ హెయిర్ సొల్యూషన్స్ పేరుతో సంస్థ ప్రారంభిస్తున్నా. కేశ ‘సంపదే’... మనవాళ్లు కేశసంపద అంటుంటారు నిజంగా కేశాలు సంపదే. జుట్టు విలువ, అది లేకపోతే ఎదురయ్యే సమస్యలు, వారి ఇబ్బందులు వర్ణనాతీతం. ముఖవర్ఛస్సుకు అత్యంత అవసరమైనది జుట్టే. అలాంటి పరిస్థితుల్లో... కారణాలేవైతేనేం... ప్రస్తుతం జుట్టు లేకపోవడం అనేది యువతను బాధిస్తున్న పెద్ద సమస్యగా మారింది. మిగతా అన్ని రకాలుగా బాగున్నా... కేవలం కేశాలు నిర్ణీత పరిమాణంలో లేకపోవడం చాలా మందిని వేధిస్తోంది. అయితే మన దగ్గర చాలా మందికి విగ్ వాడకంపై పూర్తి అవగాహన లేదు. విదేశాలలో విగ్‌లు సర్వసాధారణంగా వినియోగిస్తారు. మన దగ్గర మాత్రం రకరకాల నూనెలు, వైద్యప్రక్రియలతో జుట్టు మొలిపించేందుకు అష్టకష్టాలు పడతారే గాని విగ్‌ల జోలికి వెళ్లడం తక్కువే. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారుతోంది. అందరికీ అందుబాటులో... వంశపారంపర్యంగా బట్టతల వచ్చేవాళ్లే కాకుండా విభిన్న కారణాల వల్ల కేశాలను కోల్పోతున్నవాళ్లు, కేన్సర్, అలోపేసియా వంటి రోగాల బాధితులు... ఇలా విగ్‌ల అవసరం ఉన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ నిస్సంకోచంగా వినియోగించేందుకు వీలుగా విగ్లను అందరికీ అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నా. కానీ ఒక విషయం...తక్కువ ఖరీదు కదా అని సింథటిక్ హెయిర్స్‌తో రూపొందిన విగ్లను వాడితే అవి ఇతరత్రా సమస్యలు సృష్టిస్తాయి. ఈ విషయంలో విగ్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. -ఎస్.సత్యబాబు -
గుంటూరులో పరువు హత్యపై పోస్టుమార్టం