1/18
తెలంగాణ తొలి ప్లేయర్‌గా ఘనత
2/18
పారాలింపిక్స్-2024లో తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజికి కాంస్య పతకం
3/18
మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో మూడో స్థానంలో నిలిచిన దీప్తి
4/18
పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి తెలంగాణ ప్లేయర్‌గా ఘనత
5/18
ప్రపంచ పారా చాంపియన్, పారా ఆసియా గేమ్స్ చాంపియన్ హోదాలో తొలిసారి పారాలింపిక్స్‌లో అడుగుపెట్టిన దీప్తి
6/18
పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న క్రీడాకారులు ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్.
7/18
2019 ఆసియా అండర్–18 చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది.
8/18
రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది.
9/18
దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా లోని కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు.
10/18
ఒకవైపు పేదరికం ఇబ్బంది పెడుతుండగా... మరోవైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా గ్రామంలో హేళన చేసేవారు.
11/18
గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్‌లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది.
12/18
ఇలాంటి తరుణంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు.
13/18
దీప్తిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రంలో ట్రెయినింగ్ అందించే ఏర్పాట్లు చేశారు.
14/18
ఆర్థిక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ స్వర్ణ ప్రదర్శనతో ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు.
15/18
మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో దీప్తికి శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
16/18
కెరీర్ ఆరంభంలో దీప్తి అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం.
17/18
ఈ ఏడాది మే నెలలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా చాంపియన్‌షిప్‌లో దీప్తి 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించి పారాలింపిక్స్‌లో మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది.
18/18
తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ పతకం సాధించింది.