సాక్షి, హైదరాబాద్: ‘స్టార్టప్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. వినూత్న ఆవి ష్కరణలతో ముందుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టీ హబ్, వీ హబ్‌లను ఏర్పాటు చేసింది. సానుకూల వాతావరణంలో సాగుతున్న క్రమంలో కరోనా సంక్షోభం స్టార్టప్‌లపైనా పడింది. అయితే ఈ పరిస్థితుల్లోనూ కొత్త ఆలోచనల తో అవకాశాలను సృష్టించే సత్తా స్టార్టప్ రంగానికి ఉంది. రాష్ట్రంలో స్టార్టప్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారాలపై వీ హబ్ (విమెన్స్ హబ్) నిరంతరం పనిచేస్తోంది. ప్రస్తుతమున్న స్టార్టప్‌లను కొత్త రంగాలకు మళ్లించడం, కోవిడ్ సంక్షోభంలోనూ కొత్త అవకాశాలను సృష్టించడంపై దృ ష్టి సారించాం’ అని వీ హబ్ సీఈఓ దీప్తి రావుల అన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో స్టార్టప్ రంగం స్థితిగతులపై ‘సాక్షి’తో మాట్లాడారు.
► ఈ ఏడాది ఆరంభంలో రాష్ట్రంలో స్టార్టప్ వాతావరణం సానుకూలంగా సాగుతుండటంతో స్టార్టప్ రంగానికి 2020 చాలా ఆశాజనకంగా ఉంటుందని భావిం చాం. అనూహ్యంగా కరోనా సంక్షోభం వచ్చింది. ఇన్వెస్టర్లలో అనిశ్చితిని సృష్టిం చింది. సప్లై చైన్ కూడా కరోనా ప్రభావానికిలో నైంది. ఎంఎస్‌ఎంఈ రం గంపైనా ప్రభావం చూపింది.
► లాక్‌డౌన్ మూలంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో మీడియా, వినోద రంగాలతో పాటు, ఈ కామర్స్ రంగాలకు డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో మరి కొన్ని రంగాల్లో వేతనాల కోత, లే ఆఫ్‌లు వంటివి ఏర్పడ్డాయి. భారత స్టార్టప్ రంగం కూడా ఆందోళనకర పరిస్థితికి లోనైంది. హైదరాబాద్‌లో మాత్రం సంక్షోభం ఉన్నా భవిష్యత్‌పై ఆశాజనకంగా ఉన్నాం. మొదట్లో ఇన్వెస్టర్లు స్టార్టప్ రంగంపై ఆశాభావంతో ఉన్నా కరోనా సంక్షోభంతో ఖర్చు, ఉత్పత్తులు వం టి వాటిపై కొంత ప్రభావం చూపవచ్చు.
► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుల స్థితిగతులపై మరోమారు పునర్ మూల్యాంకనం, బిజినెస్ మాడ్యూల్స్, టీమ్‌కు ఎలా శిక్షణనివ్వాలి, భవిష్యత్ అవకాశాలపై టీ హబ్, వీ హబ్ కసరత్తు చేస్తున్నాయి. సమస్యలున్నా.. ఆరోగ్యం, ఈ–కామర్స్, వ్యవసాయ రంగంలో స్టార్టప్‌ల వృద్ధికి అవకాశం ఉంది.
► స్టార్టప్‌ల నిధుల విషయానికొస్తే కొత్తగా ఆలోచించి మార్కెట్, కస్టమర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమకూరే వీలుంది. ప్రస్తుతం వీ హబ్‌లో అనేక రకాల ఉత్పత్తులు ఉండగా, ఇందులో మారిన మార్కెట్లకు అవసరమైనవి చాలా ఉన్నాయి.
► వెంచర్ క్యాపిటలిస్టులకూ సమస్యలున్నాయి. ప్రస్తుత పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. బ్యాంకర్లు కూడా రుణాలిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం స్టార్టప్‌లు నగదు ప్రవాహం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహణ వ్యయం తగ్గిం చుకోవడం, లే ఆఫ్‌ల వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. కంపెనీలను నిలబెట్టుకోవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు.
► వీ హబ్ పరంగా చూస్తే కరోనా సం క్షోభంలో మా బృందం అనేక వెబినార్‌లు నిర్వహించి స్టార్టప్‌లు సొంత నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. వి హబ్‌లో 62 నుంచి 65 స్టార్టప్‌లపై పని జరుగుతుండగా, బయట మరో వంద, రెండొంద ల మందితో కలసి పనిచేస్తున్నాం.
► వీ హబ్‌లో ఉన్న 23 స్టార్టప్‌లు కరోనా తర్వా త ఆరోగ్యం, ఎడ్యుకేషన్ రంగాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం నుంచి స్టార్టప్‌లకు రుణ పరపతి పెంచేందుకు ఎలాంటి కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రూ. 2 కోట్ల మేర సాయం అందేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్స్‌తో మాట్లాడి కంపెనీలు మూత పడకుండా చూస్తున్నాం.
‘స్టార్టప్’ను కాపాడుకుంటాం!
Published Wed, May 13 2020 2:42 AM | Last Updated on Wed, May 13 2020 2:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment