
కన్నడ నటి దీప్తి కాప్సే
గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్‌లో వచ్చిన అనుచితమైన మెసేజ్‌కు కన్నడ నటి దీప్తి కాప్సే స్పందించిన తీరుకు ఆమెపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. మంగళవారం రాత్రి 7:56 గంటల సమయంలో దీప్తి వాట్సాప్‌కు ఆమె కాంటాక్ట్స్‌లో లేని నంబరు నుంచి మెసేజ్ వచ్చింది. ‘బెంగళూరులో ఎవరైనా సెక్స్‌వర్కర్ ఉంటే చూసిపెట్టు. డబ్బులకైనా సరే, ఉచితంగానైనా సరే..’ అని ఆ మెసేజ్ సారాంశం! రాత్రి 11 గంటల సమయంలో ఆ మెసేజ్ చూసిన నటి దీప్తి షాక్ అయ్యారు.
వెంటనే తేరుకుని చాలా ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. (రిప్లయ్‌ని ఎడిట్ చేశాం). ఆ సమాధానంతో భయపడిన ఆగంతకుడు.. పొరపాటున మెసేజ్ వచ్చిందనీ, క్షమించాలని వేడుకున్నాడు. ఈ సంభాషణను స్క్రీన్ షాట్ తీసి దీప్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దానిని చూసిన దీప్తి అభిమానులు అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. దీప్తి కన్నడలో హని హని ఇబ్బని, జ్వలంతం, మాల్గుడి డేస్, కిరీట, ఉపేంద్రమత్తె హుట్టిబా సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.
బొమ్మనహళ్లి : (బెంగళూరు)